కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/95 పేజీ 2
  • మార్చిలోని సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చిలోని సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1995
  • ఉపశీర్షికలు
  • మార్చి 6తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 13తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 20తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 27తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1995
km 3/95 పేజీ 2

మార్చిలోని సేవా కూటాలు

మార్చి 6తో ప్రారంభమయ్యే వారం

పాట 25 (30)

13 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ప్రశ్నాభాగాన్ని చర్చించండి.

15 నిమి: “ఎక్కువ ఇవ్వబడింది—ఎక్కువ అడుగబడింది.” ప్రశ్నా జవాబులు. ఏప్రిల్‌, మే నెలల్లో సహాయ పయినీరు జాబితాలో చేరడానికి అర్హతగల వారిని ప్రోత్సహించండి.

17 నిమి: “యౌవనస్థులతో వారు ఎలా ‘సంతోషించ’వచ్చో చెప్పడం.” ముఖ్యమైన విషయాలను పునఃసమీక్షించండి. యౌవనస్థులు అడుగు ప్రశ్నలు అనే పుస్తకాన్ని ఉపయోగించి లేదా అందించడంలో సంతోషించిన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి. అది ప్రతి ఒక్కరికి సంబంధించిన పరిస్థితులతో వ్యవహరిస్తుంది కాబట్టి, ఈ పుస్తకాన్ని అందించడంలో అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని అందరినీ పురికొల్పండి. ఒకటి లేదా రెండు అందింపులను ప్రదర్శించండి.

పాట 31 (51) మరియు ముగింపు ప్రార్థన.

మార్చి 13తో ప్రారంభమయ్యే వారం

పాట 24 (70)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టు.

15 నిమి: “సమయోచితమైన జ్య వార్త ప్రపంచవ్యాప్తంగా అందించబడవలసి ఉంది.” ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం. ఏప్రిల్‌, మే నెలల్లోని రానున్న ప్రత్యేక కార్యక్రమ ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి. క్రొత్తవారితో సహా అందరూ పూర్తిభాగం కలిగి ఉండేలా పథకం వేసుకోవాలని పురికొల్పండి.

20 నిమి: “క్రొత్త బ్రోషూరును ఫలవంతంగా ఉపయోగించుట.” శీర్షికను ప్రేక్షకులతో చర్చించండి. బ్రోషూరులోని అంశాలను ఎత్తి చూపండి, మరణమందు తమ ప్రియమైనవారిని కోల్పోయినవారిని ఓదార్చడంలో దాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తూ సలహాలు ఇవ్వండి. సంఘంలో ఏ భాషల్లో అది లభ్యమవుతుందో పేర్కొని, కూటం తర్వాత ప్రతులను తీసుకొనమని ప్రచారకులను ప్రోత్సహించండి.

పాట 36 (14) ముగింపు ప్రార్థన.

మార్చి 20తో ప్రారంభమయ్యే వారం

పాట 40 (31)

15 నిమి: స్థానిక ప్రకటనలు. కుటుంబం 1995 వార్షిక పుస్తకమును ఉపయోగించడాన్ని ప్రదర్శించండి. కుటుంబంలోని వారు పుస్తకం యెడల మెప్పుదలను కనబరుస్తారు; 3-11 పుటల్లోని ఉపోద్ఘాతం యొక్క ముఖ్యాంశాలను తండ్రి క్లుప్తంగా పునఃసమీక్షిస్తాడు. ప్రతివారం ఎలా వార్షిక పుస్తకములోని కొన్ని పుటలను కలిసి చదవడానికి, ప్రతిదినము లేఖనములను పరిశీలించుటలో నిర్ణయించబడిన బైబిలు లేఖనాలను ప్రతిరోజు తప్పనిసరిగా పరికించడానికి తామెలా ప్రయత్నం చేయవచ్చో వాళ్ళు చర్చించుకుంటారు.

15 నిమి: స్థానిక అవసరాలు లేదా కావలికోట నవంబరు 15, 1994, పుటలు 26-8నందు గల “మీరు పన్ను చెల్లించవలసివుంటే చెల్లించండి,” అనే శీర్షిక ఆధారంగా ప్రసంగమివ్వండి.

15 నిమి: “‘తమ మహా సృష్టికర్తను ఇప్పుడే స్మరణకు తెచ్చుకొనుటకు’ యౌవనస్థులకు సహాయం చేయుట.” ముఖ్య అంశాలను పునఃసమీక్షించండి, ఒకటో రెండో పునర్దర్శనాలను ప్రదర్శించండి.

పాట 52 (59) ముగింపు ప్రార్థన.

మార్చి 27తో ప్రారంభమయ్యే వారం

పాట 205 (118)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: “మానవ చరిత్రలో అతి ప్రాముఖ్యమైన సంఘటన.” ప్రేక్షకులతో చర్చించండి. జ్ఞాపకార్థ దినము కొరకైన ప్రాంతీయ ఏర్పాట్లను పునఃసమీక్షించండి. మనం ఆసక్తిగల వారిని ఆహ్వానించి, హాజరవ్వడానికి వారికి సహాయం చేయడం ఎందుకు అవసరమో వివరించండి.

15 నిమి: “సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే దానిలో ఒక పాఠం.” ఫిబ్రవరి 15, 1995 కావలికోట, పుట 26లోని శీర్షికపై ఆధారపడిన ప్రసంగాన్ని పెద్ద ఇస్తాడు. దయాపూర్వకంగా, స్థానికంగా ప్రస్తుతమున్నాయని తెలిసిన లేదా మునుపు ఉండిన సమస్యలను విమర్శిస్తున్నట్లు అనిపించని విధంగా జాగ్రత్తతో, ఆచరణయోగ్యమైన అన్వయింపును చేస్తూ, ప్రసంగం ఇవ్వబడాలి.

10 నిమి: ఏప్రిల్‌లో కావలికోట, జరిల్లు! పత్రికలకు చందాలు సేకరించడం. ఇంటింటనూ అలాగే అనియత (ఇన్‌ఫార్మల్‌) సాక్ష్యంలోను చందాలు సేకరించడాన్ని గూర్చి అనుకూల దృక్పథం కలిగి ఉండేందుకు ప్రేక్షకులను ప్రోత్సహించండి. ఇంటింటా చందాలను సేకరించడంలో పాటించడానికి క్రింది సలహాలను పునఃసమీక్షించండి: స్నేహపూర్వకంగా నవ్వాలి. ఉత్సాహవంతులుగా ఉండాలి. నెమ్మదిగా మాట్లాడాలి. ఒక పత్రికలోని ఒక శీర్షికను మాత్రమే చర్చించాలి, కాని పత్రికలను క్రమంగా స్వీకరించడంలోని ప్రయోజనాలను వివరించాలి. పత్రికలను గృహస్థుని చేతికి అందించాలి. చందా చేయడానికి నిరాకరించినట్లయితే, కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ప్రతులను అందించడానికి నిశ్చయం చేసుకోవాలి. పత్రికలను నిరాకరించినట్లయితే, అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఒక్కో ప్రతి చొప్పున స్వీకరించినట్లయితే, తరువాతి సంచికలతో మళ్ళీ వస్తానని తెలపాలి. ఆసక్తిగలవారి మరియు పత్రికలను తీసుకున్నవారి రికార్డును ఉంచుకోవాలి. పునర్దర్శనంలో చందాలను గూర్చి మళ్ళీ మాట్లాడాలి. చివరిగా, ప్రస్తుత పత్రికలను ఉపయోగిస్తూ, చందాలను సేకరించడాన్ని గూర్చిన ఒకటి లేదా రెండు క్లుప్త అందింపులను ప్రదర్శించండి.

పాట 176 (16) ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి