ఎక్కువ ఇవ్వబడింది—ఎక్కువ అడుగబడింది
1 సత్యాన్ని కలిగి ఉండేందుకు మనమెంతగా అనుగ్రహించబడ్డామో కదా! యెహోవాకు మనం చేసుకున్న సమర్పణ కారణంగా ‘మనకు సువార్త అప్పగించబడింది.’ (1 థెస్స. 2:4) ఇది మనకు పెద్ద బాధ్యతను తెచ్చి పెడుతుంది. యేసు ఇలా చెప్పాడు: ‘ఎవనికి ఎక్కువగా ఇవ్వబడునో, వానియొద్ద ఎక్కువగా అడుగబడును.’—లూకా 12:48బి.
2 ఆ మాటలు ఎంత నిజమైనవో కదా! మనమందరం దేవుని వాక్య జ్ఞానంతోను, సహోదరుల అద్భుతమైన సహవాసముతోను మరియు అద్భుతమైన నిరీక్షణతోను ఆశీర్వదించబడ్డాము గనుక మనకు ఎక్కువగా ఇవ్వబడిందని నిజంగా చెప్పవచ్చు. సహేతుకంగా, తిరిగి ఎక్కువగా అపేక్షించబడుతుంది.
3 చేయవలసిన వాటిని గూర్చిన సరైన దృష్టిని కలిగి ఉండండి: కొందరు, మన నుండి అమితంగా అపేక్షించబడుతుందనే అభిప్రాయానికి వచ్చారు. క్రైస్తవ సంఘ శిరస్సుగా యేసు క్రీస్తు అది సక్రమంగా పని చేసేందుకు ‘అవసరమైనవాటిని’ తీర్మానిస్తున్నాడు. (ఎఫె. 4:15, 16) ‘తన కాడి సుళువుగాను తన భారము తేలికగాను ఉన్నవి’ అని ఆయన అభయమిస్తున్నాడు. (మత్త. 11:28-30) పరిమితులు గల వారికి ఆయన ప్రేమపూర్వకంగా మినహాయింపులను ఇస్తాడు. (లూకా 21:1-4) ఎంత మొత్తం అయినప్పటికీ, మన చేతనైనంత మనమిస్తే, మనం ఆశీర్వదించబడతాము.—కొలొ. 3:23, 24.
4 మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘నా జీవితంలో రాజ్యాసక్తులు మొదటి స్థానంలో ఉన్నాయా? దేవుని నామానికి స్తుతి మరియు ఇతరులకు మేలు కలిగే విధంగా నేను నా సమయాన్ని, నా ఆస్తులను ఉపయోగిస్తున్నానా? భౌతిక వస్తువులను స్వార్థంతో అనుభవిస్తున్నందువల్ల కాక, యెహోవాను సేవిస్తున్నందువల్ల గొప్ప ఆనందం కలుగుతున్నట్లు నేను కనుగొంటున్నానా?’ ఈ ప్రశ్నలకు లభించే నిజాయితీ గల మన జవాబులు మన హృదయంలో ఉన్న కోరికలను వెల్లడి చేస్తాయి.—లూకా 6:45.
5 చెడు చేయాలని శోధింపబడడాన్ని తప్పించుకోండి: స్వాభీష్టం, పేరాశ మరియు భోగేచ్ఛ వంటి ప్రలోభాలు, ఒత్తిళ్ళు ముందెన్నడూ ఇంతగా లేవు. రాజీపడాలనే ప్రలోభాలతోకూడిన నైతిక సవాళ్ళను మనం ప్రతిరోజు ఎదుర్కుంటున్నాం. ఈ సవాళ్ళను విజయవంతంగా ఎదుర్కోడానికి మనకు సహాయం చేయమని మనం యెహోవాను అభ్యర్థించాలి. (మత్త. 26:41) ఆయన తన ఆత్మ ద్వారా మనలను శక్తిమంతులను చేయగలడు. (యెష. 40:29) ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదవడం గొప్ప సహాయంగా ఉంటుంది. (కీర్త. 1:2, 3) స్వయం శిక్షణ మరియు ఆత్మనిగ్రహం కూడా ప్రముఖ పాత్రను నిర్వహిస్తాయి.—1 కొరిం. 9:27.
6 మంచిని ప్రేమించడం మాత్రమే సరిపోదు గాని, మనం చెడును ద్వేషించాలి కూడా. (కీర్త. 97:10) దాని భావం ఏమంటే చెడు విషయాల యెడల ఆశను పెంపొందించుకోకూడదన్నదే. సామెతలు 6:16-19 యెహోవా ద్వేషించే ఏడు సంగతులను తెలియజేస్తుంది. స్పష్టంగా యెహోవాను ప్రీతిపర్చాలనుకునేవాడు, అలాంటి కార్యాలను తప్పకుండా ద్వేషించాలి. సత్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానంతో ఆశీర్వదించబడ్డాం గనుక, మన మనస్సులను మంచి కార్యాలపై ఉంచుకుంటూ మనం ఆ జ్ఞానానికి అనుగుణంగా ప్రవర్తించడానికి ఇష్టపడాలి.
7 ‘ఎల్లప్పుడూ ప్రభువు కార్యమునందు ఎంతో చేయడానికి’ మనకు అనుకూలమైన పరిస్థితుల కొరకు ప్రార్థన చేయడం సముచితము. (1 కొరిం. 15:58) యెహోవా సేవలో సోత్సాహ పట్టిక (బిజీ షెడ్యూల్) అనేది ఒక రక్షణగా ఉంటుందని అనేకులు కనుగొన్నారు, ఎందుకంటే, అది నిష్ప్రయోజనమైనవాటిని వెంబడించేందుకు సమయాన్ని అనుమతించదు.
8 అన్ని విషయాలను పరిశీలించాక, యెహోవా మన నుండి కోరేది ఎంతో సహేతుకమైనదే. (మీకా. 6:8) ప్రతి సేవాధిక్యతను బట్టి కృతజ్ఞతను కలిగి ఉండడానికి మనకు ప్రతీ కారణం ఉంది. (ఎఫె. 5:20) కాబట్టి మనం “ప్రయాసముతో పాటుపడుచు” ఉంటే మన నుండి కోరబడే దేనికన్నా అపరిమితమైన గొప్ప ప్రతిఫలం మనకు ఇవ్వబడుతుందని నమ్మకం కలిగి ఉండగలము.—1 తిమో. 4:10.