కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/95 పేజీ 2
  • జనవరిలోని సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరిలోని సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1995
  • ఉపశీర్షికలు
  • జనవరి 2తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 9తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 16తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 23తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 30తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1995
km 1/95 పేజీ 2

జనవరిలోని సేవా కూటములు

జనవరి 2తో ప్రారంభమయ్యే వారం

పాట 83 (86)

10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి తగిన ప్రకటనలు.

17 నిమి: “ఎల్లప్పుడూ చేయడానికి ఎంతో ఉంది.” ప్రశ్నా జవాబులు. ఖాళీగా ఉండని ఒక పెద్ద, లేదా ఒక గృహిణి లేదా పయినీరు వంటి వారితో క్లుప్తమైన రెండు మూడు ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయండి; వారు ఖాళీలేని పట్టికను ఎలా అనుసరించగలుగుతున్నారు, అలా అయినప్పటికీ, వాటితో తమ సంతోషాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నారో వివరించమని వారిని అడగండి.

18 నిమి: “మన పాత పుస్తకాలను చక్కగా ఉపయోగించుకోవడం.” ప్రేక్షకులతో చర్చించండి. ఏ పాత పుస్తకాలు లభ్యమవుతాయో సంఘానికి తెలపండి; పరిచర్యలో ఉపయోగించడానికి పుస్తకాలను తీసుకొనమని ప్రోత్సహించండి. ఇవ్వబడిన సలహాలతో ఒకటో రెండో క్లుప్త ప్రదర్శనలను ఏర్పాటు చేయండి.

పాట 188 (81) మరియు ముగింపు ప్రార్థన.

జనవరి 9తో ప్రారంభమయ్యే వారం

పాట 183 (73)

15 నిమి: స్థానిక ప్రకటనలు. “క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం.” ఒక ప్రసంగం. వారాంతంలోని ప్రాంతీయ పరిచర్య ఏర్పాట్లను ప్రకటించండి. క్రొత్త పత్రికలను తీసుకు వెళ్ళి, తగిన సమయమున అందించమని అందరిని ప్రోత్సహించండి.

15 నిమి: “ప్రోత్సాహకరమైన కాపుదల.” సెప్టెంబరు 15, 1993 కావలికోట, పుటలు 21-23ల్లోని ఉపశీర్షిక క్రింద ఉన్న సమాచార ఆధారితమైన ప్రసంగాన్ని ఒక పెద్ద యిస్తాడు.

15 నిమి: విశ్వాసాన్ని సవాలు చేసే వైద్య పరిస్థితిని ఎదుర్కోడానికి మీరు సిద్ధమేనా? మన అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌⁄రిలీజ్‌ కార్డు మరియు గుర్తింపు కార్డు యిచ్చే విలువైన కాపుదల యెడల సహోదరులు మెప్పును చూపడానికి సహాయపడే, గంభీరమైన, అలాగే పురికొల్పే ప్రసంగాన్ని సమర్థవంతుడైన పెద్ద యిస్తాడు. ఈ కాపుదలకు అర్హత గలిగి, దానిని కోరుకునేవారు యీ కార్డులను నింపి ఉంచుకోడానికి ఏర్పాట్లు చేస్తూ, గత జనవరిలోని కార్యక్రమాన్ని పునరావృత్తి చేయండి. జనవరి 1994 మన రాజ్య పరిచర్య 2వ పుటలోని, “జనవరి 2తో ప్రారంభమయ్యే వారం” క్రింద వివరణల కొరకు చూడండి.

పాట 198 (50) మరియు ముగింపు ప్రార్థన.

జనవరి 16తో ప్రారంభమయ్యే వారం

పాట 182 (97)

10 నిమి: స్థానిక ప్రకటనలు. క్రొత్త పత్రికల్లో నుండి మాట్లాడగల అంశాలను చూపించండి. ఈ వారాంతంలో అందరూ ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనాలని ప్రోత్సహించండి.

18 నిమి: “ఇతరుల యెడల శ్రద్ధ చూపించండి—1వ భాగం.” ప్రశ్నా జవాబులు. పైకప్పు, నీటి పంపులు, విద్యుత్‌ విధానాలు మరియు రాజ్యమందిర భద్రత కొరకైన యితర ఏర్పాట్లన్నీ మరమ్మతు చేయబడ్డాయా అని చూసేందుకు పెద్దలు కలిసి తనిఖీ చేయవలసిన అవసరముందని చూపించే జ్ఞాపికలను చేర్చాలి.—డిశంబరు 1984 మన రాజ్య పరిచర్య, పుట 4 చూడండి.

17 నిమి: “పునర్దర్శనాలు చేయడం ద్వారా మీకు శ్రద్ధ ఉందని చూపించండి.” ముగ్గురు లేదా నలుగురు ప్రచారకులు పునర్దర్శనాలు చేయడంలోని ఉద్దేశాన్ని గురించి, దాని ప్రాముఖ్యతను గురించి చర్చించాలి. పఠనాలను ఆరంభించాలనే లక్ష్యాలను నొక్కి చెప్పాలి. ఇవ్వబడిన సలహాలను పునఃసమీక్షించాలి. అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహాన్ని, సలహాలను ఇచ్చే ఒకటో రెండో ప్రదర్శనలను గుంపుతో చేపించాలి.

పాట 196 (64) మరియు ముగింపు ప్రార్థన.

జనవరి 23తో ప్రారంభమయ్యే వారం

పాట 161 (110)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు.

10 నిమి: మన ప్రాంతంలో సమగ్రంగా సేవ చేయడం. సేవాధ్యక్షుని ప్రసంగం. జూలై 15, 1988 కావలికోట (ఆంగ్లం) పఠన శీర్షికల్లోని ఉన్నతాంశాలను పునఃసమీక్షించండి. స్థానికంగా అన్వయించండి. సంఘ ప్రాంతంలోని భాగాల్లో క్రమంగా సేవ చేయనట్లయితే, దాన్ని ఎలా చేయవచ్చో సలహా యివ్వండి.

10 నిమి: స్థానిక అవసరాలు. నవంబరు 1, 1994, కావలికోట, (పక్షపత్రిక సంపుటలు) 28-31 పుటల్లోని “దైవపరిపాలనా గ్రంథాలయాన్ని ఎలా సంస్థీకరించుకోవాలి,” అనే శీర్షికపై ఆధారపడిన ఒక ప్రసంగాన్నివ్వండి.

15 నిమి: “వ్యక్తిగత పఠనం—శ్రద్ధ చూపించవలసిన విషయం.” ప్రశ్నా జవాబులు. జూన్‌ 15, 1985, కావలికోట (ఆంగ్లం), 8-13 పుటల ఆధారంగా ఎంపిక చేసిన వ్యాఖ్యానాలను చేర్చండి.

పాట 116 (37) మరియు ముగింపు ప్రార్థన.

జనవరి 30తో ప్రారంభమయ్యే వారం

పాట 141 (64)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

20 నిమి: సెప్టెంబరు 1, 1994 కావలికోట పక్షపత్రికల సంపుటల 27-8 పుటల్లోని “నిర్బంధాలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయా?” అనే శీర్షికపై ఆధారపడిన ప్రసంగాన్ని ఒక పెద్ద యిస్తాడు.

15 నిమి: ఫిబ్రవరిలో నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అందించండి. ఈ పుస్తకంలోని సమాచారం ప్రజలకెందుకు అవసరమై ఉన్నదో వివరించండి. (ఏప్రిల్‌ 1, 1988, కావలికోట (ఆంగ్లం), 25-6 పుటలు, 17, 18 పేరాలు చూడండి.) దానిని చదివిన, యథార్థ హృదయులు చూపించిన మెప్పుదలను తెలిపే అనుభవాలను గూర్చి క్లుప్తంగా చెప్పండి. (సెప్టెంబరు 1, 1989, కావలికోట, 32వ పుట, డిశంబరు 1, 1991, కావలికోట, 32వ పుట చూడండి.) నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని మనం ఎవరికైతే అందించామో ఆ ఆసక్తిగల వారితో బైబిలు పఠనాలను ఎలా ఆరంభించవచ్చో చూపే కొన్ని సలహాలను ఇవ్వండి. బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే పుస్తకం, 6వ పుటలోని “జీవితము/సంతోషము” అనే శీర్షికను ఉపయోగించి సమాచారాన్ని క్లుప్తంగా అందించే ప్రదర్శనను సామర్థ్యము గల ప్రచారకునితో చేపించాలి. లేదా స్థానిక ప్రాంతానికి తగిన మరొక సమాచారాన్ని ఉపయోగించాలి. ఈ వారం పరిచర్యలో ఉపయోగించడానికి సాహిత్యాన్ని తీసి పెట్టుకోవాలని ప్రేక్షకులకు గుర్తుచేయాలి.

పాట 199 (105) మరియు ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి