సెలవుదిన సాక్ష్యం
లోక పండుగల సమయం అనేకులకు ఉద్యోగంలోను, పాఠశాలలోను సెలవు సమయం కాబట్టి, సెలవు దిన సాక్ష్యము కొరకు పెద్దలు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. మనం పారంపర్య సెలవుదిన శుభాకాంక్షలను తిరిగి చెప్పము కనుక, అలాంటి శుభాకాంక్షలకు మనం స్పందించడంలో లౌక్యమవసరము. శుభాకాంక్షలను గూర్చి వివాదం లేపవలసిన అవసరం లేదు, చాలా వరకు, మనం గృహస్థునికి—పొరుగువారికి లేదా బంధువుకు—శుభాకాంక్షలకు బదులుగా కేవలం కృతజ్ఞతలు చెప్పవచ్చు, ఆ తర్వాత మనం అందించదలచిన సమాచారాన్ని కొనసాగించవచ్చు. మనం క్రిస్టమస్ శుభాకాంక్షలకు బదులు చెప్పకపోవడాన్ని గూర్చి ఆ గృహస్థుడు అడిగినట్లయితే, దేవుని ఘనపరచే ప్రజలు చేయవలసి ఉన్నట్లు క్రీస్తుయేసును మనం గౌరవిస్తామని, కాని మానవులు రూపించిన అనేక ఆచారాలు క్రీస్తునుగాని లేదా దేవుడ్నిగాని ఘనపరచడం లేదని, అందుకే మనం వాటిలో పాలుపంచుకోమని అతనికి తెలియజేయగలము.