ఆయన అనుచరులయ్యేందుకు వారిని పురికొల్పండి
1 మొదటి కొరింథీయులు 3:6 నందు, పౌలు యీ విధంగా వ్రాశాడు: “నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే.” క్రీస్తు శిరస్సత్వం క్రింద ఐక్యంగా పనిచేయవలసిన అవసరతను సహోదరులు గుర్తించడానికి సహాయపడేందుకు పౌలు ఈ తర్కాన్ని ఉపయోగించాడు. ఈ విధంగా నాటడం, నీరు పోయడం అనే ప్రాముఖ్యమైన పనుల్లో వారు వహించిన విశేషమైన పాత్రను గుణగ్రహించేందుకు కూడా ఆయన వారికి సహాయం చేశాడు.
2 జీవాన్ని రక్షించే ఈ పని ఈనాడే ముగింపుకు రావలసి ఉంది. సమర్పిత క్రైస్తవులుగా, యేసు అనుచరులయ్యేందుకు ఇతరులకు సహాయపడవలసిన ఈ గంభీరమైన బాధ్యతలో మనం పాలు పంచుకుంటాం. (అపొ. 13:48) మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని ఉపయోగిస్తూ, మీరు కలిగించిన ఆసక్తిని ఎలా పెంపొందిస్తారు?
3 ఈ పుస్తకాన్ని తీసుకున్న వ్యక్తిని పునర్దర్శించేటప్పుడు, మీరు యిలా ప్పగల్గుతారు:
◼ “మనం క్రితం మాట్లాడుకున్నప్పుడు, యేసుక్రీస్తు ఎలాంటి మనిషి అనే దాని గురించి చర్చించాం. జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకం మీకివ్వడంలో నేను సంతోషించాను. యేసు బోధలోను, ఆయన వ్యక్తిత్వంలోను మిమ్మల్ని ఏది ఆకట్టుకుంది?” జవాబివ్వనివ్వండి. అధ్యాయం 113 నకు తిప్పి, వినయాన్ని చూపడంలో యేసు యొక్క ఉత్తమ మాదిరిని గూర్చి చర్చించండి. అపొస్తలుడైన పౌలు యేసుయొక్క వినయం గల దృక్పథాన్ని ఎలా దృష్టించాడో చూపించేందుకు ఫిలిప్పీయులు 2:8 చదవండి. క్రమంగా బైబిలును పఠించడం ద్వారా ఎక్కువగా ఎలా తెలుసుకోవచ్చో మీరు వివరించగలరు.
4 మీరు యీ ఉపోద్ఘాతాన్ని యిష్టపడవచ్చు:
◼ “యేసు నిజంగా మనయెడల శ్రద్ధ కలిగియున్నాడని చూపించే విధంగా, ఆయన భూమ్మీద ఉన్నప్పుడు చేసిన కార్యాలను గూర్చి మనం మాట్లాడుకున్నాం. అమితంగా బాధలను అనుభవించినవారిని విమోచించడానికి చివరికి ఆయన ఏమి చేస్తాడని మీరనుకుంటున్నారు?” జవాబివ్వనివ్వండి. అధ్యాయం 133 తిప్పి ఐదవ పేరాలోని వ్యాఖ్యానాలను పునఃసమీక్షించండి. తరువాతి పేజీలోని చిత్రాన్ని చూపుతూ, పరలోకమందు జరుగుచున్నట్లు భూమిమీద దేవుని చిత్తం జరిగేటప్పుడు ఎలా ఉంటుందో వివరించండి. ఎక్కువ తెలుసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను గూర్చి తెలపండి.
5 మీ దటి దరనంలో, గహస్థుడు ఈ పుస్తకాన్ని తీసుకోనట్లయితే, మీరీవిధంగా చెబుతూ మీ చర్చను ఆరంభించగలరు:
◼ “అనేకమంది ప్రజలు తాము అనుకరించ తగిన మాదిరి అని ఎవరిని దృష్టిస్తారో వారిలా తమ జీవితాన్ని రూపుదిద్దుకుంటారనే విషయాన్ని మనమిద్దరం అంగీకరిస్తామనుకుంటాను. యేసుక్రీస్తు ఒకరు అనుకరించ తగిన శ్రేష్ఠమైన మాదిరి. యేసు ఉంచిన మాదిరిని గూర్చి పఠించడం ద్వారా నేను నేర్చుకున్న ప్రాముఖ్యమైన ఒక పాఠాన్ని మీతో పంచుకోడానికి యిష్టపడుతున్నాను. [మహాగొప్ప మనిషి అనే పుస్తకంలోని 40 వ అధ్యాయం తీసి, కరుణను గూర్చి యేసు దయాపూర్వకంగా నేర్పిన పాఠంవైపుకు శ్రద్ధ మళ్ళించండి.] నేను ఇతరులయెడల యీ గుణాన్ని ఎంతగా కనబర్చవలసిన అవసరం ఉందన్న విషయాన్ని అది నాకు గుర్తుచేసింది.” మత్తయి 5:7 చదవండి. ఈ పుస్తకాన్ని మళ్ళీ అందించడానికి లేదా దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూర్ను అందించడానికి యిది సముచితమైన సమయం కావచ్చు.
6 లేదా బహుశా మీరు యీ విధంగా సూటిగా చెప్పడానికి యిష్టపడవచ్చు:
◼ “నేను క్రితం యిక్కడికి వచ్చినప్పుడు, యేసును గూర్చిన జ్ఞానాన్ని ఆర్జించడంలోని ప్రాముఖ్యతను గూర్చి చర్చించాము. అలాంటి జ్ఞానాన్ని సంపాదించడమే ‘నిత్యజీవము’ అని యోహాను 17:3 చెబుతుంది. మనం దాన్ని ఎలా చేయగలం?” జవాబివ్వనివ్వండి. మన బైబిలు పఠన ఏర్పాటును గురించి, దానినుండి ప్రయోజనం పొందడాన్ని గూర్చి వివరించడంలో కొనసాగండి.
7 కోతలో పనిచేయువాని గురించి “తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును” అని పౌలు చెబుతున్నాడు. (1 కొరిం. 3:8) యేసు అనుచరులయ్యేందుకు మనం యితరులకు సహాయం చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నట్లయితే, మన ప్రతిఫలం కచ్చితంగా గొప్పదై ఉంటుంది.