దైవపరిపాలనా పరిచర్య పాఠశాల షెడ్యూలు 1995
ఉపదేశములు
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నిర్వహించేటప్పుడు 1995 లో ఈ క్రింది ఏర్పాట్లుంటాయి.
పాఠ్యపుస్తకములు: న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్ [బిఐ 12], యునైటెడ్ ఇన్ వర్షిప్ ఆఫ్ ది ఓన్లీ ట్రూ గాడ్ [యుడబ్ల్యు], “ఆల్ స్క్రిప్చర్ ఈజ్ ఇన్‌స్పైర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బెనిఫిషియల్” (1990 వ సంచిక) [ఎస్‌ఐ], జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి [జిటి], న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ నందలి “బైబిల్ టాపిక్స్ ఫర్ డిస్‌కషన్” [*టిడి] అనువాటి మీద ఆధారపడి ప్రసంగాలు నియమించబడతాయి.
పాట, ప్రార్థన, ఆహ్వానపు మాటలతో పాఠశాల ప్రారంభమై ఈ క్రింది విధంగా కొనసాగుతుంది:
అసైన్‌మెంట్ నెం. 1: 15 నిమిషాలు. ఈ ప్రసంగాన్ని ఓ సంఘపెద్ద లేదా పరిచారకుడు యివ్వాలి, ఇది యునైటెడ్ ఇన్ వర్షిప్ ఆఫ్ ది ఓన్లీ ట్రూ గాడ్ లేదా “ఆల్ స్క్రిప్చర్ ఈజ్ ఇన్‌స్పైర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బెనిఫిషియల్” అనే పుస్తకాలపై ఆధారపడివుంటుంది. దీన్ని 10 నుండి 12 నిమిషాలపాటు ఉపదేశ ప్రసంగముగాను, ఆ పిమ్మట ఈ ప్రచురణలో ముద్రింపబడిన ప్రశ్నలను ఉపయోగిస్తూ 3 నుండి 5 నిమిషాలపాటు మౌఖిక పునఃసమీక్షగాను యివ్వాలి. దాని ఉద్దేశము కేవలం సమాచారాన్ని అందించడమేగాక, చర్చించబడే సమాచారపు ఆచరణయోగ్యమైన విలువపై అవధానం నిల్పుతూ, సంఘానికి అత్యంత సహాయకరమైన విషయాల్ని ఉన్నతపర్చాలి. చూపబడిన మూలాంశాన్నే ఉపయోగించాలి. ఈ సమాచారం నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి అందరూ ముందుగానే జాగ్రత్తగా సిద్ధపడి రావాలని ప్రోత్సహింపబడుతున్నారు.
ఈ ప్రసంగానికి నియమించబడిన సహోదరులు నియమిత సమయంలోనే ముగించడానికి జాగ్రత్తపడాలి. అవసరమైతే లేదా ప్రసంగీకుడు ముందుగా కోరినట్లైతే, ఏకాంతంగా సలహా ఇవ్వవచ్చు.
బైబిలు పఠనంనుండి ఉన్నతాంశాలు: 6 నిమిషాలు. సమాచారాన్ని ప్రాంతీయ అవసరతలకు తగినట్లు ఫలవంతముగా అన్వయించగల పాఠశాల అధ్యక్షుడు లేదా మరో సంఘపెద్ద లేదా పరిచారకుడు దీన్ని చేయాలి. అది కేవలం నియమిత పాఠ్యభాగ సారాంశమై యుండకూడదు. నియమిత అధ్యాయాల పూర్తి పునఃసమీక్షను 30 నుండి 60 సెకండ్లకు పరిమితం చేయండి. ఆ సమాచారం మనకు ఎందుకు, ఎలా విలువకరమో మెచ్చుకోవడానికి ప్రేక్షకులకు సహాయపడుటే దాని ముఖ్యోద్దేశం. ఆ తర్వాత పాఠశాల అధ్యక్షుడు విద్యార్థులను వారివారి తరగతి గదులకు పంపిస్తాడు.
ప్రసంగం నెం. 2: 5 నిమిషాలు. బైబిలునుండి ఓ నియమిత భాగాన్ని ఓ సహోదరుడు చదవాలి. ఇది ముఖ్య పాఠశాలకు, అలాగే సహాయ గుంపులకు కూడా అన్వయిస్తుంది. ప్రారంభ, ముగింపు మాటల్లో విద్యార్థి సమాచారాన్ని క్లుప్తంగా వివరించడానికి వీలయ్యేలాగున ఈ నియమిత పఠన భాగాలు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. వెనుకటి చరిత్ర, ప్రవచనార్థక లేదా సిద్ధాంత విశేషత, సూత్రాల అన్వయింపులను కూడా చేర్చవచ్చును. నియమిత వచనాలను అన్నింటిని మధ్యలో ఆపకుండా చదవాలి. అయితే, చదవాల్సిన వచనాలు వరుసగా లేనప్పుడు, చదవడం మరలా ఎక్కడినుండి కొనసాగుతుందో విద్యార్థి పేర్కొనాలి.
ప్రసంగం నెం. 3: 5 నిమిషాలు. ఈ ప్రసంగం సహోదరీలకు నియమించబడుతుంది. ఈ ప్రసంగ అంశాలు జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి లేదా న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ నందలి “బైబిల్ టాపిక్స్ ఫర్ డిస్‌కషన్” పై ఆధారపడివుంటాయి. నియమించబడే విద్యార్థిని చదువగల్గేదై యుండాలి. ప్రసంగమిచ్చేటప్పుడు ఆమె కూర్చోవచ్చు లేదా నిల్చోవచ్చు. పాఠశాల అధ్యక్షుడు ఆమెకొక సహాయకురాలిని నియమిస్తాడు. అయితే అదనంగా ఆమె యితర సహాయకురాండ్రను కూడ తీసికోవచ్చు. ఈ ప్రసంగానికి నియమించబడిన సహోదరీలు మూలాంశాన్ని, విచారించబోయే సమాచారాన్ని ప్రాంతీయ సేవకు లేదా అనియత సాక్ష్యానికి సరిపడు ఆచరణయోగ్యమైన ప్రసంగ కూర్పుకు అనుసంధానపర్చాలి. ప్రసంగ కూర్పుకు కాదుగాని, సమాచారానికే అధిక ప్రాధాన్యతనివ్వాలి.
ప్రసంగం నెం. 4: 5 నిమిషాలు. ఇదొక సహోదరునికి లేదా సహోదరికి నియమించబడుతుంది. ఇది న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ నందలి “బైబిల్ టాపిక్స్ ఫర్ డిస్‌కషన్” పై ఆధారపడివుంటుంది. దీనిని సహోదరునికి నియమించినప్పుడు, అది ప్రేక్షకులందరిని ఉద్దేశించిచేసే ప్రసంగంగా ఉండాలి. ప్రసంగం మేలైన సమాచారాన్ని అందించేదిగా, వినేవారికది నిజంగా ప్రయోజనమిచ్చేదిగా ఉండేటట్టు ఆ సహోదరుడు రాజ్యమందిర ప్రేక్షకులను మనస్సులో ఉంచుకొని సిద్ధపడుట అత్యంత శ్రేష్ఠము. సహోదరికి నియమించబడినప్పుడు, ప్రసంగం నెం. 3 కు ఇవ్వబడిన పద్ధతిచొప్పునే ఈ సమాచారాన్ని అందించాలి.
సలహా మరియు గుర్తించిన విషయాలు: ప్రతి విద్యార్థి ప్రసంగం తర్వాత, పాఠశాల అధ్యక్షుడు ఓ ప్రత్యేక సలహాయిస్తాడు. ఆయన ప్రసంగ సలహా పత్రమందివ్వబడిన వరుసక్రమాన్నే అనుసరించాల్సిన అవసరం లేదు. బదులుగా, విద్యార్థి అభివృద్ధి సాధించాల్సిన అంశాలపై ఆయన శ్రద్ధచూపాలి. ప్రసంగించే విద్యార్థి తనకివ్వబడిన ఏ ప్రసంగ లక్షణం దగ్గరైతే “I” లేదా “W” కాకుండా “G” గుర్తు మాత్రమే పొందితే, అప్పుడు ఉపదేశకుడు ఆ విద్యార్థి ఈసారి కృషిచేయాల్సిన ప్రసంగ లక్షణం దగ్గర, అనగా సాధారణంగా “G,” “I,” లేదా W గుర్తుపెట్టాల్సిన బాక్సు చుట్టూ గుండ్రంగా గీతగీయాలి. ఆ సాయంకాలమే ఆయన విద్యార్థికి ఆ విషయం తెలియజేయడమే కాకుండ ఆ ప్రసంగ లక్షణాన్ని విద్యార్థియొక్క తర్వాతి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల అసైన్‌మెంట్ పత్రంపై (S-89) వ్రాయాలి. ప్రసంగాలిచ్చేవారు హాలునందు ముందు వరుసలో కూర్చోవాలి. దీనివల్ల సమయం వృధాకాదు పైగా పాఠశాల అధ్యక్షుడు ప్రతి విద్యార్థికి నేరుగా సలహా యివ్వగలవాడై యుంటాడు. అవసరమైన మౌఖిక సలహాయిచ్చిన తర్వాత సమయం అనుమతిస్తే, విద్యార్థులు వివరించని విలువైన, ఆచరణాత్మకమైన అంశాలపై ఉపదేశకుడు వ్యాఖ్యానించవచ్చు. ప్రతి విద్యార్థి ప్రసంగం తర్వాతయిచ్చే సలహాకు లేదా తానుచెప్పే క్లుప్త వ్యాఖ్యానాలకు పాఠశాల అధ్యక్షుడు మొత్తంమీద రెండు నిమిషాలకన్నా ఎక్కువ తీసుకోకుండా జాగ్రత్తపడాలి. బైబిలు ఉన్నతాంశముల ప్రసంగం ఏవైనా అసలు అంశాల్ని విడిచిపెడితే, ఏకాంతమందు సలహా ఇవ్వవచ్చు.
ప్రసంగాల్ని సిద్ధంచేయుట: నియమిత ప్రసంగాన్ని సిద్ధంచేసుకోవడానికి ముందు విద్యార్థి తాను కృషిచేయాల్సిన ప్రసంగ లక్షణాన్ని వివరించే పాఠశాల నిర్దేశక పుస్తకపు విషయాల్ని జాగ్రత్తగా చదవాలి. రెండవ ప్రసంగానికి నియమించబడిన విద్యార్థులు తాము చదవాల్సిన బైబిలు భాగానికి తగిన మూలాంశాన్ని ఎన్నుకోవచ్చును. ముద్రిత షెడ్యూల్లో చూపబడిన మూలాంశం ప్రకారమే ఇతర ప్రసంగాలివ్వబడతాయి.
సమయము: ఉపదేశకుని సలహా, చెప్పే విషయాలతోసహా ఏ ప్రసంగం కూడ సమయాన్ని మించిపోకూడదు. రెండు, మూడు నాలుగువరకున్న ప్రసంగాలు సమయం మించివెళ్తుంటే వాటిని యుక్తిగా ఆపుజేయాలి. ఆపుజేయాలని సూచించడానికి నియమించబడిన వ్యక్తి సత్వరమే ఆ పనిచేయాలి. అసైన్‌మెంట్ నెం. 1, బైబిలు ఉన్నతాంశములు నిర్వహించే సహోదరులు ఎక్కువ సమయం తీసుకుంటే, వారికి ఏకాంతంగా సలహా ఇవ్వాలి. ప్రతిఒక్కరూ తమ సమయాన్ని జాగ్రత్తగా చూచుకోవాలి. పాట, ప్రార్థన కాకుండ మొత్తం కార్యక్రమం: 45 నిమిషాలు.
వ్రాతపూర్వక పునఃసమీక్ష: నియమిత వారాల్లో వ్రాతపూర్వక పునఃసమీక్ష ఇవ్వబడుతుంది. దానికి సిద్ధపడేటప్పుడు నియమిత సమాచారాన్ని, చదవడానికి నిర్ణయించబడిన బైబిలు భాగాన్నంతా పునఃసమీక్షించాలి. ఈ 25 నిమిషాల పునఃసమీక్షలో బైబిలును మాత్రమే ఉపయోగించాలి. మిగిలిన సమయం ప్రశ్నాజవాబుల చర్చకు ఉపయోగింపబడుతుంది. ప్రతి విద్యార్థి తన జవాబుల్ని పరిశీలించుకుంటాడు. పాఠశాల అధ్యక్షుడు పునఃసమీక్ష జవాబుల్ని ప్రేక్షకులతో విచారిస్తూ, ఆ జవాబుల్ని అందరూ స్పష్టంగా గ్రహించేలా సహాయపడునట్లు క్లిష్టమైన ప్రశ్నలకు అవధానమిస్తాడు. ప్రాంతీయ పరిస్థితులనుబట్టి అది తప్పనిసరైతే, షెడ్యూల్లో చూపబడినట్లుగా కాకుండా ఆ మరుసటి వారమైనా ఈ పునఃసమీక్షను జరుపవచ్చును.
పెద్ద సంఘాలు: పాఠశాలలో భాగము వహించడానికి 50 లేక అంతకంటే ఎక్కువమంది విద్యార్థులున్న సంఘాల్లో ఇతర ఉపదేశకులముందు నియమిత ప్రసంగాలివ్వడానికి అదనపు గుంపుల్ని ఏర్పాటుచేసుకోవచ్చు. అయితే క్రైస్తవ సూత్రాల కనుగుణ్యంగా తమ జీవితాల్ని మలచుకున్న బాప్తిస్మంపొందని వ్యక్తులు కూడ పాఠశాలలో చేరి ప్రసంగాలు ఇవ్వవచ్చును.
హాజరుకానివారు: ప్రతివారపు కార్యక్రమానికి హాజరుకావడానికి కృషిచేయుట ద్వారా, తమకు నియమించబడిన ప్రసంగాలకు సిద్ధపడుట ద్వారా ఆలాగే ప్రశ్నావిభాగపు కార్యక్రమాల్లో భాగంవహించుట ద్వారా సంఘమందలి వారందరూ ఈ పాఠశాలయెడల తమ మెప్పును చూపగలరు. విద్యార్థులందరూ తమ ప్రసంగాల్ని సద్వివేకంతో దృష్టిస్తారని మేమాశిస్తున్నాం. నియమిత ప్రసంగాలకు సంబంధిత విద్యార్థి హాజరుకాకుంటే, స్వచ్ఛందంగా ఎవరైనా ఆ ప్రసంగాన్ని చేపట్టి, ఆ స్వల్పకాల వ్యవధిలో ఇది యుక్తమని తాను తలంచిన అన్వయింపుతో ఆ ప్రసంగాన్ని ఇవ్వవచ్చును. లేదా పాఠశాల అధ్యక్షుడు ప్రేక్షకులతో తగినరీతిలో పంచుకుంటూ ఆ సమాచారాన్ని వివరించవచ్చు.
షెడ్యూలు
*టిడి - న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ నందలి “బైబిల్ టాపిక్స్ ఫర్ డిస్‌కషన్”
జన. 2 బైబిలు పఠనం: కీర్తన 119:113-176
పాట నెం. 127 (64)
నెం. 1: గొప్ప సమూహమును గుర్తించుట (యుడబ్ల్యు పు. 103-4 పేరాలు 1-4)
నెం. 2: కీర్తన 119:161-176
నెం. 3: యేసు ఎందుకు “ఈ మనుష్యుడు” అని పిలువబడ్డాడు (జిటి అధ్యా. 123)
నెం. 4: *టిడి 32ఎ మానవుని విధి ముందుగానే నిర్ణయింపబడలేదు
జన. 9 బైబిలు పఠనం: కీర్తన 120 నుండి 130
పాట నెం. 26 (9)
నెం. 1: వేరే గొర్రెలకు చెందినవారు కనుపర్చాల్సిన లక్షణాలు (యుడబ్ల్యు పు. 105 పేరా 5)
నెం. 2: కీర్తన 122:1–123:4
నెం. 3: యేసు విషయంలో పిలాతు ఎందుకు భయపడ్డాడు (జిటి అధ్యా. 124)
నెం. 4: *టిడి 33ఎ యేసు మానవప్రాణం అందరికొరకివ్వబడిన విమోచన క్రయధనమైయుండెను
జన. 16 బైబిలు పఠనం: కీర్తన 131 నుండి 136
పాట నెం. 129 (66)
నెం. 1: గొప్ప సమూహము మహాశ్రమల్ని ఎందుకు తప్పించుకుంటుంది (యుడబ్ల్యు పుటలు 106-9 పేరాలు 6-13)
నెం. 2: కీర్తన 132:1-18
నెం. 3: మానవజాతి యెడల యేసుకున్న ప్రేమకు రుజువులు (జిటి అధ్యా. 125)
నెం. 4: *టిడి 33బి యేసు విమోచన క్రయధనం ఎందుకు ఇవ్వగల్గాడు
జన. 23 బైబిలు పఠనం: కీర్తన 137 నుండి 140
పాట నెం. 205 (118)
నెం. 1: రాజ్యవారసులు ఈనాడు భూమ్మీద ఎందుకు కొద్దిమందే ఉన్నారు (యుడబ్ల్యు పుటలు 110-12 పేరాలు 1-7)
నెం. 2: కీర్తన 137:1–138:8
నెం. 3: అంతము వరకు యేసు ఎలా మాదిరికరంగా ఉన్నాడు (జిటి అధ్యా. 126)
నెం. 4: *టిడి 34ఎ ఒకే సత్యమైన మతాన్ని గుర్తించుట ఎట్లు
జన. 30 బైబిలు పఠనం: కీర్తన 141 నుండి 145
పాట నెం. 165 (81)
నెం. 1: కీర్తనల గ్రంథం ఎందుకు ప్రయోజనకరం—భాగం 1 (ఎస్‌ఐ పుటలు 104-5 పేరాలు 23-7)
నెం. 2: కీర్తన 144:1-15
నెం. 3: యేసు సమాధిలో ఉంచబడటం, ఆపై ఖాళీగానున్న సమాధి మనకెందుకు శ్రద్ధాకరము (జిటి అధ్యా. 127)
నెం. 4: *టిడి 34బి అబద్ధ బోధల్ని ఖండించుట తప్పా?
ఫిబ్ర. 6 బైబిలు పఠనం: కీర్తన 146 నుండి 150
పాట నెం. 102 (53)
నెం. 1: కీర్తనల గ్రంథం ఎందుకు ప్రయోజనకరం—భాగం 2 (ఎస్‌ఐ పుటలు 105-6 పేరాలు 28-32)
నెం. 2: కీర్తన 148:1-14
నెం. 3: యేసు పునరుత్థానపు ఆనందము (జిటి అధ్యా. 128)
నెం. 4: *టిడి 34సి మత మార్పిడిని దేవుడు ఎప్పుడు ఆమోదిస్తాడు
ఫిబ్ర. 13 బైబిలు పఠనం: సామెతలు 1, 2
పాట నెం. 185 (98)
నెం. 1: సామెతల గ్రంథానికి ఉపోద్ఘాతం—భాగం 1 (ఎస్‌ఐ పుటలు 106-7 పేరాలు 1-5)
నెం. 2: సామెతలు 2:1-19
నెం. 3: పునరుత్థానమందలి విశ్వాసం ఎలా దృఢపర్చబడింది (జిటి అధ్యా. 129)
నెం. 4: *టిడి 34డి అన్ని మతాల్లో మంచివుందని దేవుడు పరిగణిస్తున్నాడా?
ఫిబ్ర. 20 బైబిలు పఠనం: సామెతలు 3, 4
పాట నెం. 200 (108)
నెం. 1: సామెతల గ్రంథానికి ఉపోద్ఘాతం—భాగం 2 (ఎస్‌ఐ పుటలు 107-8 పేరాలు 6-11)
నెం. 2: సామెతలు 3:1-18
నెం. 3: ప్రేమనెలా చూపించాలో యేసు వివరించుట (జిటి అధ్యా. 130)
నెం. 4: *టిడి 35ఎ మృతుల్లోనుండి ఎవరు లేపబడతారు?
ఫిబ్ర. 27 బైబిలు పఠనం: సామెతలు 5, 6
పాట నెం. 11 (12)
నెం. 1: తాము ఆత్మీయ పిల్లలమని వారికెలా తెలుసు? (యుడబ్ల్యు పుటలు 112-16 పేరాలు 8-14)
నెం. 2: సామెతలు 6:1-19
నెం. 3: యేసు తన శిష్యులనెలా బలపర్చాడు (జిటి అధ్యా. 131)
నెం. 4: *టిడి 35బి మృతులు ఎక్కడ పునరుత్థానం చేయబడతారు?
మార్చి 6 బైబిలు పఠనం: సామెతలు 7, 8
పాట నెం. 105 (46)
నెం. 1: యెహోవా దృశ్య సంస్థను గుర్తించుట (యుడబ్ల్యు పుటలు 117-20 పేరాలు 1-7)
నెం. 2: సామెతలు 8:22-36
నెం. 3: దేవుని కుడి పార్శ్వమందు యేసు ఏమిచేస్తాడు (జిటి అధ్యా. 132)
నెం. 4: *టిడి 36ఎ క్రీస్తు రాకడ అదృశ్యంగా ఉంటుంది
మార్చి 13 బైబిలు పఠనం: సామెతలు 9, 10
పాట నెం. 224 (106)
నెం. 1: పరిపాలక సభయొక్క లేఖనానుసారమైన పాత్ర (యుడబ్ల్యు పుటలు 120-22 పేరాలు 8-12)
నెం. 2: సామెతలు 10:16-32
నెం. 3: జీవించిన వారిలోకెల్లా యేసు ఎందుకు మహాగొప్ప మనిషి (జిటి అధ్యా. 133)
నెం. 4: *టిడి 36బి క్రీస్తు రాకడ భౌతిక వాస్తవాలచే వివేచింపబడుతుంది
మార్చి 20 బైబిలు పఠనం: సామెతలు 11, 12
పాట నెం. 38 (65)
నెం. 1: దేవుని సంస్థయెడల మనమెప్పును విశ్లేషించుట (యుడబ్ల్యు పుటలు 123-4 పేరాలు 13, 14)
నెం. 2: సామెతలు 11:1-14
నెం. 3: ప్రతివారు మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ఎందుకు చదవాలి (జిటి—పుస్తకమందలి ఉపోద్ఘాతపు సమాచారం నుండి సిద్ధపడండి.)
నెం. 4: *టిడి 37ఎ విశ్రాంతి దినాన్ని ఆచరించే బాధ్యత క్రైస్తవులకు లేదు
మార్చి 27 బైబిలు పఠనం: సామెతలు 13, 14
పాట నెం. 139 (74)
నెం. 1: సలహాను ఎందుకు వినాలి? (యుడబ్ల్యు పుటలు 125-7 పేరాలు 1-4)
నెం. 2: సామెతలు 14:1-16
నెం. 3: *టిడి 37బి విశ్రాంతి దినాచరణ క్రైస్తవులకు ఇవ్వబడలేదు
నెం. 4: *టిడి 37సి దేవుని విశ్రాంతి దినం ఎప్పుడు ఆరంభమౌతుంది, ఎప్పుడు ముగుస్తుంది
ఏప్రి. 3 బైబిలు పఠనం: సామెతలు 15, 16
పాట నెం. 59 (31)
నెం. 1: సలహాను అంగీకరించిన వారి మాదిరిని అనుసరించండి (యుడబ్ల్యు పుటలు 127-8 పేరాలు 5, 6)
నెం. 2: సామెతలు 15:1-16
నెం. 3: *టిడి 38ఎ క్రీస్తుద్వారా మాత్రమే దేవుడు రక్షణ ననుగ్రహిస్తాడు
నెం. 4: *టిడి 38బి “ఒకసారి రక్షింపబడితే ఇక రక్షింపబడినట్లే” అనుట లేఖనాధారము కాదు
ఏప్రి. 10 బైబిలు పఠనం: సామెతలు 17, 18
పాట నెం. 163 (94)
నెం. 1: అమూల్యమైన లక్షణాల్ని పెంపొందించుకోండి (యుడబ్ల్యు పుటలు 128-31 పేరాలు 7-14)
నెం. 2: సామెతలు 18:1-15
నెం. 3: *టిడి 38సి “సర్వజన రక్షణ” లేఖన రహితము
నెం. 4: *టిడి 39ఎ పాపము అంటే ఏమిటి
ఏప్రి. 17 బైబిలు పఠనం: సామెతలు 19, 20
పాట నెం. 35 (15)
నెం. 1: నిజ క్రైస్తవుల్ని ప్రేమ గుర్తిస్తుంది (యుడబ్ల్యు పుటలు 132-3 పేరాలు 1-5)
నెం. 2: సామెతలు 19:8-23
నెం. 3: *టిడి 39బి ఆదాము పాపమునుబట్టి మానవులంతా ఎందుకు బాధ ననుభవిస్తున్నారు
నెం. 4: *టిడి 39సి నిషేధ ఫలమేమైయుండెను?
ఏప్రి. 24: వ్రాతపూర్వక పునఃసమీక్ష. కీర్తన 119:113 నుండి సామెతలు 20 వరకు
పాట నెం. 6 (4)
మే 1 బైబిలు పఠనం: సామెతలు 21, 22
పాట నెం. 95 (52)
నెం. 1: సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఏమిచేయాలి (యుడబ్ల్యు పుట 134 పేరాలు 6-9)
నెం. 2: సామెతలు 22:1-16
నెం. 3: *టిడి 39డి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపంచేయుట అంటే ఏమిటి?
నెం. 4: *టిడి 40ఎ ఆత్మ అంటే ఏమిటి?
మే 8 బైబిలు పఠనం: సామెతలు 23, 24
పాట నెం. 46 (20)
నెం. 1: సమస్యలను లేఖనానుసారంగా చేపట్టండి (యుడబ్ల్యు పుటలు 135-8 పేరాలు 10-17)
నెం. 2: సామెతలు 24:1-16
నెం. 3: *టిడి 40బి ఆత్మ, ప్రాణము ఎట్లు భిన్నమైయున్నవి?
నెం. 4: *టిడి 41ఎ పరిశుద్ధాత్మ అంటే ఏమిటి?
మే 15 బైబిలు పఠనం: సామెతలు 25, 26
పాట నెం. 145 (115)
నెం. 1: గృహమందే దైవభక్తిని అభ్యసించండి (యుడబ్ల్యు పుటలు 139-41 పేరాలు 1-5)
నెం. 2: సామెతలు 25:1-13
నెం. 3: *టిడి 41బి మానవుని మరియు జంతువునందలి జీవశక్తి ఆత్మ అని పిలువబడింది
నెం. 4: *టిడి 41సి సమస్త విధములైన అభిచారాన్ని మనమెందుకు విసర్జించాలి
మే 22 బైబిలు పఠనం: సామెతలు 27, 28
పాట నెం. 84 (30)
నెం. 1: సామెతల గ్రంథం ఎందుకు ప్రయోజనకరం—భాగం 1 (ఎస్‌ఐ పుటలు 109-10 పేరాలు 19-28)
నెం. 2: సామెతలు 28:1-14
నెం. 3: *టిడి 42ఎ యెహోవా ఎందుకు త్రిత్వమందు భాగమైయుండజాలడు
నెం. 4: *టిడి 42బి కుమారుడు తండ్రితో సమానుడు కాడు
మే 29 బైబిలు పఠనం: సామెతలు 29 నుండి 31
పాట నెం. 50 (23)
నెం. 1: సామెతల గ్రంథం ఎందుకు ప్రయోజనకరం—భాగం 2 (ఎస్‌ఐ పుటలు 110-11 పేరాలు 29-38)
నెం. 2: సామెతలు 31:10-31
నెం. 3: *టిడి 42సి దేవుడు, క్రీస్తు ఎట్లు ఏకమైయున్నారు
నెం. 4: *టిడి 42డి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదు
జూన్ 5 బైబిలు పఠనం: ప్రసంగి 1 నుండి 3
పాట నెం. 41 (22)
నెం. 1: ప్రసంగి గ్రంథానికి ఉపోద్ఘాతం (ఎస్‌ఐ పుటలు 112-13 పేరాలు 1-8)
నెం. 2: ప్రసంగి 3:1-9, 18-22
నెం. 3: *టిడి 43ఎ లోక దౌర్భల్యానికి దేవుడు బాధ్యుడు కాడు
నెం. 4: *టిడి 43బి దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతించాడు
జూన్ 12 బైబిలు పఠనం: ప్రసంగి 4 నుండి 6
పాట నెం. 62 (34)
నెం. 1: దేవుని కుటుంబ ఏర్పాటునందలి మీ పాత్రను నెరవేర్చండి (యుడబ్ల్యు పుటలు 142-4 పేరాలు 6-13)
నెం. 2: ప్రసంగి 5:1-8, 18-20
నెం. 3: *టిడి 43సి దేవుడు తన మహాగొప్ప కనికరాన్ని కనుపరస్తున్నాడు
నెం. 4: *టిడి 43డి దేవుని రాజ్యము మాత్రమే పరిష్కారము
జూన్ 19 బైబిలు పఠనం: ప్రసంగి 7 నుండి 9
పాట నెం. 162 (89)
నెం. 1: మనమెందుకు మోషే ధర్మశాస్త్రం క్రిందలేమనుటకుగల లేఖన కారణాలు (యుడబ్ల్యు పుటలు 146-8 పేరాలు 1-6)
నెం. 2: ప్రసంగి 7:1-12
నెం. 3: *టిడి 44ఎ నిజ క్రైస్తవులందరూ తప్పక సత్యానికి సాక్ష్యమివ్వాలి
నెం. 4: *టిడి 44బి మనమెందుకు ఎడతెగక ప్రజల్ని సందర్శిస్తాము
జూన్ 26 బైబిలు పఠనం: ప్రసంగి 10 నుండి 12
పాట నెం. 133 (68)
నెం. 1: ప్రసంగి గ్రంథం ఎందుకు ప్రయోజనకరం (ఎస్‌ఐ పుట 114 పేరాలు 15-19)
నెం. 2: ప్రసంగి 12:1-14
నెం. 3: *టిడి 44సి సాక్ష్యమిచ్చుట మనల్ని రక్తాపరాధం నుండి విడుదలచేస్తుంది
నెం. 4: *టిడి 1ఎ పూర్వీకులకు చేసే ఆరాధన ఎందుకు వ్యర్థం
జూలై 3 బైబిలు పఠనం: పరమగీతము 1 నుండి 4
పాట నెం. 168 (84)
నెం. 1: పరమగీతము గ్రంథానికి ఉపోద్ఘాతం (ఎస్‌ఐ పుట 115 పేరాలు 1-4)
నెం. 2: పరమగీతము 2:1-14
నెం. 3: *టిడి 1బి మానవుల్ని మనం గౌరవించవచ్చు, అయితే మనం దేవున్ని మాత్రమే ఆరాధిస్తాము
నెం. 4: *టిడి 2ఎ దుష్టత్వాన్ని అంతమొందించే దేవుని యుద్ధం
జూలై 10 బైబిలు పఠనం: పరమగీతము 5 నుండి 8
పాట నెం. 152 (82)
నెం. 1: పరమగీతము గ్రంథం ఎందుకు ప్రయోజనకరం (ఎస్‌ఐ పుట 117 పేరాలు 16-18)
నెం. 2: పరమగీతము 8:1-14
నెం. 3: *టిడి 2బి అర్మెగెద్దోను దేవుని ప్రేమను ఉల్లంఘించదు
నెం. 4: *టిడి 3ఎ బాప్తిస్మము ఒక క్రైస్తవ అవసరత
జూలై 17 బైబిలు పఠనం: యెషయా 1 నుండి 3
పాట నెం. 180 (100)
నెం. 1: యెషయా గ్రంథానికి ఉపోద్ఘాతం (ఎస్‌ఐ పుటలు 118-19 పేరాలు 1-8)
నెం. 2: యెషయా 1:1-13
నెం. 3: *టిడి 3బి బాప్తిస్మము పాపములను తుడిచివేయదు
నెం. 4: *టిడి 4ఎ బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమైయున్నది
జూలై 24 బైబిలు పఠనం: యెషయా 4 నుండి 7
పాట నెం. 144 (78)
నెం. 1: క్షమాపణకు, రక్షణకు విశ్వాసం అవశ్యం (యుడబ్ల్యు పుటలు 148-50 పేరాలు 7-10)
నెం. 2: యెషయా 6:1-13
నెం. 3: *టిడి 4బి బైబిలు మనకాలం కొరకు అభ్యాససిద్ధమైన మార్గదర్శిని
నెం. 4: *టిడి 4సి బైబిలు ప్రతి ప్రజకు, తెగలవారి కొరకైయుంది
జూలై 31 బైబిలు పఠనం: యెషయా 8 నుండి 10
పాట నెం. 140 (77)
నెం. 1: ధర్మశాస్త్రాన్ని ఎరిగియుండుటవలన కలిగే ప్రయోజనాలు (యుడబ్ల్యు పుటలు 150-1 పేరాలు 11-13; పుట 153 పేరా 14)
నెం. 2: యెషయా 9:1-12
నెం. 3: *టిడి 5ఎ రక్తమార్పిడులు దేవుని నియమాన్ని ఉల్లంఘిస్తాయి
నెం. 4: *టిడి 5బి దేవునికి లోబడుట అవశ్యము
ఆగ. 7 బైబిలు పఠనం: యెషయా 11 నుండి 13
పాట నెం. 44 (22)
నెం. 1: మోషే ధర్మశాస్త్రమందలి ప్రాథమిక సూత్రాలు: “దేవునియెడల బాధ్యతలు” (యుడబ్ల్యు పుట 152)
నెం. 2: యెషయా 11:1-10
నెం. 3: *టిడి 6ఎ అన్యరాజుల కాలాలు 1914 లో ముగిశాయి
నెం. 4: *టిడి 7ఎ నిజ క్రైస్తవ చర్చీని గుర్తించుట
ఆగ. 14 బైబిలు పఠనం: యెషయా 14 నుండి 17
పాట నెం. 170 (95)
నెం. 1: మోషే ధర్మశాస్త్రమందలి ప్రాథమిక సూత్రాలు: “నిషేధింపబడిన మత అభ్యాసాలు” (యుడబ్ల్యు పుట 152)
నెం. 2: యెషయా 14:3-20
నెం. 3: *టిడి 7బి నిజ క్రైస్తవ చర్చి క్రీస్తుపై నిర్మింపబడింది
నెం. 4: *టిడి 8ఎ నిరూపిత విజ్ఞానశాస్త్రంతో సృష్టి ఏకీభవిస్తుంది
ఆగ. 21 బైబిలు పఠనం: యెషయా 18 నుండి 22
పాట నెం. 175 (104)
నెం. 1: మోషే ధర్మశాస్త్రమందలి ప్రాథమిక సూత్రాలు: “వివాహము, కుటుంబ జీవితం” (యుడబ్ల్యు పుట 152)
నెం. 2: యెషయా 21:1-17
నెం. 3: *టిడి 8బి సృష్టిదినములు 24 గంటల దినములవంటివి కావు
నెం. 4: *టిడి 9ఎ యేసు సిలువపై కాదుగాని నిందాభరిత మ్రానుపై మరణించాడు
ఆగ. 28 వ్రాతపూర్వక పునఃసమీక్ష. సామెతలు 21 నుండి యెషయా 22 వరకు
పాట నెం. 204 (109)
సెప్టె. 4 బైబిలు పఠనం: యెషయా 23 నుండి 26
పాట నెం. 106 (55)
నెం. 1: మోషే ధర్మశాస్త్రమందలి ప్రాథమిక సూత్రాలు: “ఇతర ప్రజలకు సంబంధించిన విధులు” (యుడబ్ల్యు పుట 152)
నెం. 2: యెషయా 25:1-12
నెం. 3: *టిడి 9బి సిలువను ఆరాధించుట ఎందుకు విగ్రహారాధనయైయుంది
నెం. 4: *టిడి 10ఎ మానవుడెందుకు మరణిస్తాడు
సెప్టె. 11 బైబిలు పఠనం: యెషయా 27 నుండి 29
పాట నెం. 27 (7)
నెం. 1: జీవము, రక్తము పవిత్రమైనవి (యుడబ్ల్యు పుటలు 154-6 పేరాలు 1-6)
నెం. 2: యెషయా 28:1-13
నెం. 3: *టిడి 10బి మృతులకు స్పృహలేదు, వారికేమీ తెలియదు
నెం. 4: *టిడి 10సి మృతులతో మాట్లాడుట ఎందుకు అసాధ్యము
సెప్టె. 18 బైబిలు పఠనం: యెషయా 30 నుండి 33
పాట నెం. 160 (88)
నెం. 1: వైద్యపరంగా రక్తాన్ని ఉపయోగించుట, క్రైస్తవుని బాధ్యత (యుడబ్ల్యు పుటలు 156-60 పేరాలు 7-12)
నెం. 2: యెషయా 32:1-8, 16-20
నెం. 3: *టిడి 11ఎ అపవాది నిజంగా ఉనికిలో ఉన్నాడు
నెం. 4: *టిడి 11బి అపవాది ఈ విధానాన్ని పరిపాలిస్తున్నాడు
సెప్టె. 25 బైబిలు పఠనం: యెషయా 34 నుండి 37
పాట నెం. 146 (80)
నెం. 1: నిజ క్రైస్తవులు లోకసంబంధులు కారు (యుడబ్ల్యు పుటలు 161-3 పేరాలు 1-6)
నెం. 2: యెషయా 35:1-10
నెం. 3: *టిడి 11సి సాతానుతో చేరిన దేవదూతలు తమనుతాము దయ్యాలుగా మార్చుకున్నారు
నెం. 4: *టిడి 12ఎ భూమియెడల దేవుని సంకల్పము
అక్టో. 2 బైబిలు పఠనం: యెషయా 38 నుండి 40
పాట నెం. 143 (76)
నెం. 1: లోకసంబంధులు కాకుండుట క్రైస్తవులనుండి ఏమి కోరుతున్నది (యుడబ్ల్యు పుటలు 163-8 పేరాలు 7-16)
నెం. 2: యెషయా 40:12-26
నెం. 3: *టిడి 12బి భూమి ఎల్లప్పుడూ నివాసయోగ్యంగా ఉంటుంది
నెం. 4: *టిడి 13ఎ అబద్ధ ప్రవక్తల్ని ఎలా గుర్తించాలి
అక్టో. 9 బైబిలు పఠనం: యెషయా 41 నుండి 43
పాట నెం. 92 (51)
నెం. 1: ఎడతెగక దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి (యుడబ్ల్యు పుటలు 169-71 పేరాలు 1-7)
నెం. 2: యెషయా 43:1-15
నెం. 3: *టిడి 14ఎ ఆత్మీయ స్వస్థత శాశ్వత ప్రయోజనాల్ని కలిగివుంది
నెం. 4: *టిడి 14బి దేవుని రాజ్యం శాశ్వతమైన భౌతిక స్వస్థతల్ని తెస్తుంది
అక్టో. 16 బైబిలు పఠనం: యెషయా 44 నుండి 46
పాట నెం. 166 (90)
నెం. 1: అపొస్తలుల మాదిరినుండి ప్రయోజనం పొందుట (యుడబ్ల్యు పుట 172 పేరా 8)
నెం. 2: యెషయా 46:1-13
నెం. 3: *టిడి 14సి ఆధునికకాల విశ్వాస స్వస్థతకు దైవిక గుర్తింపులేదు
నెం. 4: *టిడి 14డి భాషల్లో మాట్లాడుట దాని సంకల్పాన్ని నెరవేర్చింది
అక్టో. 23 బైబిలు పఠనం: యెషయా 47 నుండి 49
పాట నెం. 56 (33)
నెం. 1: వివేచనతో ధైర్యంగా ప్రకటించుట (యుడబ్ల్యు పుటలు 173-5 పేరాలు 9-13)
నెం. 2: యెషయా 48:1-11, 16-19
నెం. 3: *టిడి 15ఎ 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్తారు
నెం. 4: *టిడి 16ఎ ఎవరునూ నరకమందు బాధింపబడరు
అక్టో. 30 బైబిలు పఠనం: యెషయా 50 నుండి 53
పాట నెం. 132 (70)
నెం. 1: యెహోవా దినము దగ్గరైనదని కనిపెట్టుకొనియుండుడి (యుడబ్ల్యు పుటలు 176-7 పేరాలు 1-4)
నెం. 2: యెషయా 52:1-15
నెం. 3: *టిడి 16బి అగ్ని నిర్మూలనకు సూచనైయుంది
నెం. 4: *టిడి 16సి ధనవంతుడు, లాజరుకు సంబంధించిన ఉపమానమందు అక్షరార్థమైన అగ్నిలేదు
నవ. 6 బైబిలు పఠనం: యెషయా 54 నుండి 57
పాట నెం. 187 (93)
నెం. 1: సూచనను నెరవేర్చే సంఘటనల విషయమై అప్రమత్తంగా ఉండండి (యుడబ్ల్యు పుటలు 178-9 పేరాలు 5, 6)
నెం. 2: యెషయా 55:1-13
నెం. 3: *టిడి 17ఎ తొలి క్రైస్తవులు జన్మదినాల్ని లేదా క్రిస్మస్‌ను ఆచరించలేదు
నెం. 4: *టిడి 18ఎ విగ్రహారాధన దేవునియెడల అవమానకరము
నవ. 13 బైబిలు పఠనం: యెషయా 58 నుండి 62
పాట నెం. 107 (57)
నెం. 1: వేరుచేసే మహాగొప్ప పని—అంతము సమీపించినదనుటకు రుజువైయుంది (యుడబ్ల్యు పుటలు 179-83 పేరాలు 7-14)
నెం. 2: యెషయా 60:4-17
నెం. 3: *టిడి 18బి విగ్రహారాధన ఇశ్రాయేలీయులకు ఉరిగావుండెను
నెం. 4: *టిడి 18సి యెహోవా తిరస్కరించే ఆరాధన
నవ. 20 బైబిలు పఠనం: యెషయా 63 నుండి 66
పాట నెం. 77 (41)
నెం. 1: యెషయా గ్రంథం ఎందుకు ప్రయోజనకరం (ఎస్‌ఐ పుట 123 పేరాలు 34-9)
నెం. 2: యెషయా 65:11-25
నెం. 3: *టిడి 19ఎ మిశ్రిత విశ్వాసాన్ని దేవుడు అంగీకరించడు
నెం. 4: *టిడి 19బి దేవుడు సంపూర్ణ భక్తిని కోరుతున్నాడు
నవ. 27 బైబిలు పఠనం: యిర్మీయా 1 నుండి 3
పాట నెం. 70 (39)
నెం. 1: యిర్మీయా గ్రంథానికి ఉపోద్ఘాతం (ఎస్‌ఐ పుట 124 పేరాలు 1-5)
నెం. 2: యిర్మీయా 1:4-19
నెం. 3: *టిడి 20ఎ నిజ క్రైస్తవులు దేవుని నామం ఎరిగియుండి, దానిని ఉపయోగించాలి
నెం. 4: *టిడి 20బి బైబిలు, సృష్టి దేవుని ఉనికిని రుజువుచేస్తున్నవి
డిశ. 4 బైబిలు పఠనం: యిర్మీయా 4 నుండి 6
పాట నెం. 97 (50)
నెం. 1: యెహోవాయొక్క జ్ఞానయుక్తమైన, ప్రేమపూర్వక సంకల్పం (యుడబ్ల్యు పుటలు 184-5 పేరాలు 1-5)
నెం. 2: యిర్మీయా 5:1-14
నెం. 3: *టిడి 20సి యెహోవాయొక్క అద్భుతమైన లక్షణాలు
నెం. 4: *టిడి 20డి అందరూ ఒకే దేవున్ని సేవించుటలేదు
డిశ. 11 బైబిలు పఠనం: యిర్మీయా 7 నుండి 9
పాట నెం. 158 (85)
నెం. 1: యెహోవా తన ప్రజల్ని ఐక్యపరస్తున్నాడు (యుడబ్ల్యు పుటలు 186-7 పేరాలు 6-9)
నెం. 2: యిర్మీయా 9:12-26
నెం. 3: *టిడి 21ఎ యెహోవాసాక్షుల ప్రారంభం
నెం. 4: *టిడి 22ఎ యేసు దేవుని కుమారుడును, నియమిత రాజునైయున్నాడు
డిశ. 18 బైబిలు పఠనం: యిర్మీయా 10 నుండి 12
పాట నెం. 222 (119)
నెం. 1: మానవ సృష్టి స్వతంత్రం చేయబడుతుంది (యుడబ్ల్యు పుటలు 188-91 పేరాలు 10-17)
నెం. 2: యిర్మీయా 10:6-15, 22-25
నెం. 3: *టిడి 22బి మనం యేసుక్రీస్తును ఎందుకు నమ్మాలి
నెం. 4: *టిడి 22సి క్రీస్తునందలి నమ్మకంతోపాటు క్రియలు కూడా ఉండాలి
డిశ. 25 వ్రాతపూర్వక పునఃసమీక్ష. యెషయా 23 నుండి యిర్మీయా 12 వరకు
పాట నెం. 34 (8)