ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు అక్టోబరు: జరిల్లు! లేక కావలికోట చందాలను సేకరించాలి. పక్షపత్రికలకు ఒక సంవత్సరం చందా రూ. 70.00. నెలసరి పత్రికల సంవత్సరం చందా అలాగే పక్షపత్రికలకు ఆరునెలల చందా రూ. 35.00. నెలసరి పత్రికలకు ఆరునెలల చందా లేదు. దయచేసి గమనించండి: కావలికోటకు పక్షపత్రిక చందాలు, కన్నడ, మలయాళం, మరాఠి తమిళం, తెలుగు భాషల్లో లభ్యమవుతున్నాయి; నెలసరి పత్రికల చందాలు బెంగాలి, గుజరాతి, హింది, నేపాలి, ఉర్దు భాషల్లో లభ్యమవుతున్నాయి. జరిల్లు! పక్ష పత్రికలకు మలయాళం, తమిళం భాషల్లో చందాలు లభ్యమవుతున్నాయి; నెలసరి పత్రికలకు, గుజరాతి, కన్నడ, తెలుగు భాషల్లో చందాలు లభ్యమవుతున్నాయి. పంపిణీదారుల జరిల్లు! ప్రతులు, బెంగాలీ, హింది, మరాఠి, నేపాలి, భాషల్లో మూడునెల్లకోసారి సంఘాలకు అందుబాటులో ఉంటాయి, అయితే, ఈ నాలుగు భాషల్లోని వాటికి విడిగా చదాలు అందుబాటులో లేవు. నవంబరు: న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్‌తో సహా బిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? ఇంగ్లీష్ కాక యితర భాషల్లో స్కూల్ బ్రోషూరు కాకుండా వేరే ఏ బ్రోషూరునైనా అందించవచ్చు లేక 192 పేజీల ఏ పుస్తకాన్నైనా అందించవచ్చు. డిశంబరు: జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని రూ. 40.00 చందాకు అందించవచ్చు. మీ స్టాకులో ఈ ప్రచురణ లేకపోతే ఆ పరిస్థితి యితర అందింపులను యిచ్చేందుకు నడిపించినట్లైతే, మీరు నా బైబిలు కథల పుస్తకము లేక మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని అదే చందాకు అందించవచ్చు. (నిరంతరం జీవించగలరు చిన్న సైజు రూ. 20.00). జనవరి: పాతవైన 192-పేజీల పుస్తకాలను ఒక్కొక్కటి రూ. 6.00 చందాకు ప్రత్యేక అందింపు క్రింద అందించాలి.
◼ సంఘంతో సహవసించే ప్రతిఒక్కరు కూడా కావలికోట జరిల్లు! పత్రికల కొత్త మరియు రెన్యూవల్ చందాలను సంఘం ద్వారానే పంపించాలి, నేరుగా సంస్థకు పంపించకూడదు.
◼ మన రాజ్య పరిచర్యలోని అనుబంధంలో “దైవపరిపాలనా పరిచర్య పాఠశాల షెడ్యూలు 1995” ఉంది. వచ్చే 1995 సంవత్సరమంతా చూసుకునేందుకు మీరు దాన్ని దాచి పెట్టుకోవాలి. ఈ 1994 పట్టిక ఫిబ్రవరి 20, 1995 వ వారం వరకు కొనసాగినప్పటికీ, 1995 పట్టిక జనవరి 2 తో ప్రారంభమయ్యే వారంతో మొదలౌతుంది. ఇలా పైబడేందుకు కారణమేంటంటే, యిన్ని దశాబ్దాలు చేసినట్లుగా రెండునెలలు వెనకబడిపోకుండా బ్రూక్లిన్ పట్టికను 1995 జనవరి నుండి మనం అనుసరిస్తాము. అయితే, తత్ఫలితంగా ఫిబ్రవరి 20 న జరగవల్సిన రాత పూర్వక పునఃసమీక్షతో సహా జనవరి, ఫిబ్రవరి కొరకు వేయబడిన 1994 పట్టిక పోతుంది. తదుపరి కూటాల్లో ఈ సమాచారం నుండి విషయాలు తెలిపేందుకు పాఠశాల అధ్యక్షులు తమ శాయశక్తులా ప్రయత్నించాలి, అయితే జనవరి 2, 1995 నుండి సంఘాలన్ని 1994 పట్టికను ఉపయోగించడం మానివేసి, యిక్కడ యివ్వబడిన 1995 పట్టికను ఉపయోగించడం ప్రారంభించాలి. అప్పటినుండి, మునుపటి సంవత్సరాల్లో జరిగినట్లుగా మార్చి నుండి ఫిబ్రవరి వరకు కాకుండ, జనవరి నుండి డిశంబరు వరకూ పాఠశాల పట్టిక ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది మన సహోదరులు 1995 లో అనుసరించే పాఠశాల పట్టికనే మనము కూడా అనుసరించగలుగుతామని మేము ఎంతో సంతోషిస్తున్నాము.
◼ బాడ్జి కార్డుల ప్లాస్టిక్కు కవర్లను ఆర్డరు చేసే విషయాన్ని గూర్చిన ఏప్రిల్ 1994 మన రాజ్య పరిచర్య నందున్న చివరి ప్రకటనను దయచేసి పునఃసమీక్షించండి.
◼ పెద్ద అచ్చు పాటల పుస్తకం ఖరీదు, ప్రచారకులకు రూ. 60.00 పయినీర్లకు రూ. 45.00.
◼ లభ్యమవుతున్న కొత్త ప్రచురణలు:
గుజరాతి, హింది, కన్నడ, మరియు మరాఠి: ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు.
◼ మరలా లభ్యమవుతున్న ప్రచురణలు:
బెంగాలి: కురుక్షేత్రం నుండి ఆర్మగిద్దోను వరకు—మరియు మీరు జీవముతో తప్పించుకోగలరు, మనలను సంరక్షించే దేవుడున్నాడా?; ఇంగ్లీషు: న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్—రెగ్యులర్ (బై12), యెహోవాకు స్తుతిగీతములు పాడుడి—పెద్ద సైజు; హిందీ: సురక్షితమైన భవిష్యత్తును నీవెలా కనుగొనగలవు; కన్నడ: సురక్షితమైన భవిష్యత్తును నీవెలా కనుగొనగలవు కురుక్షేత్రం నుండి ఆర్మగిద్దోను వరకు—మరియు మీరు జీవముతో తప్పించుకోగలరు, విడుదలకు నడుపు దైవిక సత్య మార్గము; నేపాలి: భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!
◼ స్టాకులోలేని ప్రచురణలు:
ఇంగ్లీషు: పరదైసుకు నడిపించే త్రోవను ఎలా కనుగొనాలి (ట్రాక్టు); యెహోవాసాక్షులు వుని రాజ్య ప్రచారకుల గుజరాతి: సంరక్షించు దేవుడున్నాడా?, “ఈ రాజ్య సువార్త;” తమిళం: నీ కుటుంబ జీవితమును సంతోషభరితము చేసికొనుము; మలయాళం: దేవుడు మన యెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు?; హిందీ: మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? “ఈ రాజ్య సువార్త.”