కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/94 పేజీ 2
  • అక్టోబరు నెల కొరకైన సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు నెల కొరకైన సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1994
  • ఉపశీర్షికలు
  • అక్టోబరు 3 తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 10 తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 17 తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 24తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 31 తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1994
km 10/94 పేజీ 2

అక్టోబరు నెల కొరకైన సేవా కూటములు

సూచన: సమావేశ సమయంలో కూడా మన రాజ్య పరిచర్య ప్రతి వారం సేవాకూటానికి పట్టికనిస్తుంది. ప్రతి సంఘమూ, అది నియమించబడిన “దైవ భయం” జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు అంతేకాకుండ తర్వాతి వారంలో జరిగే 30 నిమిషాల పునఃసమీక్షా కార్యక్రమానికి కూడా హాజరయ్యేందుకు అవసరమైన సర్దుబాట్లను చేసుకోవాలి. జిల్లా సమావేశపు ప్రతిదిన కార్యక్రమాల పునర్విమర్శ కొరకైన ముఖ్యాంశాలపై కేంద్రీకరించేలా యిద్దరు లేక ముగ్గురు అర్హత గల సహోదరులను నియమించాలి. అలా బాగా సిద్ధపడిన పునఃసమీక్ష సంఘంలోని వారు తమకు తాము వ్యక్తిగతంగా అన్వయించుకునేందుకు అలాగే ప్రాంతీయ సేవలో ఉపయోగించేందుకు వీలుగా ముఖ్యాంశాలను జ్ఞాపకముంచుకోడానికి సహాయపడుతుంది. ప్రేక్షకులనుండి వచ్చే వ్యాఖ్యానాలూ, చెప్పే అనుభవాలూ క్లుప్తంగానూ సూటిగాను ఉండాలి.

అక్టోబరు 3 తో ప్రారంభమయ్యే వారం

పాట 203 (43)

10 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్య నుండి ఎన్నిక చేయబడిన ప్రకటనలు.

17 నిమి: “ఇదే సరైన సమయం.” ప్రశ్నా జవాబులు. మన రాజ్య పరిచర్య నవంబరు 1993 పేజీ 4, 5 ల్లోని “ఆత్మీయ గురులను వెంబండించండి” అనే ఉపశీర్షిక నుండి కూడా వ్యాఖ్యానాలను చేర్చండి.

18 నిమి: “అక్టోబరు నెలలో పత్రిక చందాలను సేకరించడంలో శ్రద్ధ కల్గివుండండి.” ప్రేక్షకులతో చర్చించండి. సంభాషణను ప్రారంభించేందుకు పత్రికలను ఎలా ఉపయోగించవచ్చో చూపే రెండు బాగా సిద్ధపడిన ప్రదర్శనలను ఏర్పాటు చేయండి. ప్రతి యింటి దగ్గర చందాను అందించడంలోని ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి. గృహస్థుడు చందాను అంగీకరించకపోయినట్లైతే విడి పత్రికలను అందించే అవసరతను, నొక్కి చెప్పండి మరియు అలాంటి గృహస్థులకు మ్యాగజీన్‌ రూట్‌ను, కొనసాగించమని ప్రోత్సహించండి.

పాట 212 (110) ముగింపు ప్రార్థన.

అక్టోబరు 10 తో ప్రారంభమయ్యే వారం

పాట 104 (57)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు మరియు విరాళాలున్నట్లైతే వాటిని అందుకున్న వివరాలు.

15 నిమి: “తలిదండ్రులారా—మీ పిల్లలకు సలహాదారులై యుండండి!” ఆగస్టు 8, 1994, జరిల్లు! నందలి మొదటి మూడు శీర్షికలపై ఆధారపడిన ప్రసంగాన్ని ఒక పెద్ద యిస్తాడు. ఆ సమాచారాన్ని స్థానికంగా అన్వయించండి. ఉపాధ్యాయులతో లేక పాఠశాల అధికారులతో మాట్లాడిన అనుభవం గల ఒక తల్లిని గాని తండ్రిని గాని క్లుప్తంగా యింటర్‌వ్వూ చేయండి. తలిదండ్రులు తమ పిల్లలకు ఎలా సలహాదారులై ఉండగలరో వక్కాణించండి.

20 నిమి: పాఠశాలలో క్రైస్తవ ప్రవర్తన. ముగ్గురు లేక నలుగురు యౌవనులతో ఒక పెద్ద జరిపే చర్చ. పాఠశాలలో, యౌవనులైన మన పిల్లలు తమ బైబిలు సూత్రాల యెడల వారికున్న గౌరవంతో రాజీపడేలా రకరకాల ఒత్తిడులకు గురౌతున్నారు. వీటిలో అనేకం తరచూ తరగతికి నేరుగా సంబంధంలేని కార్యకలాపాలనుండి వస్తాయి. క్రీడలు, డేటింగ్‌, సామాజిక ఫంక్షన్లు అపాయాన్ని తేగలవు. పాఠశాల బ్రోషూరులోని 22-5 వరకున్న పేజీలను ఉపయోగించి “విద్యేతర పనులను” గూర్చి పెద్ద, యౌవనులతో చర్చిస్తాడు. ఈ విషయాల్లో భాగంవహించే ఒత్తిడిని యౌవనులు ఎదుర్కొంటున్నామని వ్యాఖ్యానిస్తారు, కనుక యివ్వబడే సలహాలను వారు మెచ్చుకుంటారు.

పాట 108 (69), ముగింపు ప్రార్థన.

అక్టోబరు 17 తో ప్రారంభమయ్యే వారం

పాట 194 (105)

7 నిమి: స్థానిక ప్రకటనలు.

18 నిమి: మేలు చేయుటయందు విసుకక యుందము. ఒక పెద్ద యిచ్చే ప్రసంగం. ఆత్మీయ అలసట, యెహోవా సేవలోని మన ఆనందాన్ని, ఆసక్తిని తగ్గించగలదు. జనవరి 15, 1986, కావలికోట (ఇంగ్లీష్‌), 19 వ పేజీలో (బాక్స్‌ నందు) యివ్వబడిన సలహాలను ఉపయోగించి మన ఆత్మీయ శక్తిని నూతనపర్చుకునే విధానాన్ని పునఃపరిశీలించండి. సంఘ కార్యక్రమాలకు హృదయపూర్వక మద్దతును వక్కాణించండి.

20 నిమి: “ఆసక్తి కనపర్చేవారికి ప్రేమపూర్వకంగా సహాయపడండి.” ప్రేక్షకులతో చర్చ. సూచించబడిన అందింపులనుపయోస్తూ, రెండు ప్రదర్శనలను ఏర్పాటు చేయండి. సముచితమైతే, మొదటి సందర్శనంలో ఒకటి లేక రెండు పత్రికలను మాత్రమే పుచ్చుకున్న గృహస్థుని పునర్దర్శించేటప్పుడు పత్రిక చందాను అందించే విషయాన్ని ప్రస్తావించండి. బైబిలు పఠనాలను ప్రారంభించే గురిని మనస్సులో కల్గివుండమని ప్రేక్షకులను ప్రోత్సహించండి.

పాట 156 (118) ముగింపు ప్రార్థన.

అక్టోబరు 24తో ప్రారంభమయ్యే వారం

పాట 141 (64)

12 నిమి: స్థానిక ప్రకటనలు. “ప్రకటన ముగింపు పుస్తకాన్ని మరలా పఠించడం” ను పునఃసమీక్షించండి. పాఠాలను ముందే పఠించి, క్రమంగా హాజరయ్యే ప్రాముఖ్యతను గుర్తుచేయండి. మన సంఘ పుస్తక పఠన పట్టిక, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మన సహోదరులు యిప్పుడు అనుసరించే దానితో పొందిక కల్గివుంటుందనే వాస్తవం వైపుకు అవధానాన్ని మళ్లించండి.

15 నిమి: మీకు క్రమమైన ఆర్డరు ఉందా? రాజ్యవర్తమానాన్ని వ్యాపింపజేసేందుకు కావలికోట తేజరిల్లు! పత్రికలు శ్రేష్ఠమైన సహాయకాలు. అవకాశం దొరిగినప్పుడెల్లా వాటిని మనం అందించాలి. మన రాజ్య పరిచర్య ఏప్రిల్‌ 1984 నందలి 5 వ పేజీ 18 వ పేరానందు, ప్రతి ప్రచారకుడూ “ప్రతి సంచికకూ నిర్దిష్టంగా యిన్ని ప్రతులు కావాలనే ఒక ఖచ్చితమైన పత్రిక ఆర్డరును కల్గివుండాలి” అని సిఫారసు చేసింది. లేకపోతే, అందించేందుకు మన దగ్గిర కొత్త సంచికలు లేనట్లు మనం కనుగొంటాము, మరి మనం కరపత్రాలు బ్రోషూర్లపై ఆధారపడవల్సి వస్తుంది. ఓ క్రమమైన ఆర్డరును కల్గివుండడం ప్రతి కుటుంబ సభ్యునికి మంచిది. పత్రిక కౌంటర్‌ వద్ద ఆర్డర్లను పెట్టండి. ప్రతివారం పత్రికలను తీసుకోవడం మరవకండి. క్రమమైన ఆర్డరును కల్గి ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలను ప్రస్తావించండి.

18 నిమి: “ఎల్లప్పుడును స్తుతియాగము చేస్తూ—దేవుని రాజ్యమును మొదట వెదకండి.” ప్రశ్నా జవాబులు. మనం వ్యక్తిగతంగా కృషిచేయవల్సిన కొన్ని ప్రయోజనాత్మకమైన గురులను ప్రస్తావించండి. ఇతరులు మరింత అభివృద్ధిని సాధించేలా మనం వారికి సహాయపడేందుకు గల మార్గాలను చర్చించండి.

పాట 171 (59) ముగింపు ప్రార్థన.

అక్టోబరు 31 తో ప్రారంభమయ్యే వారం

పాట 169 (28)

12 నిమి: స్థానిక ప్రకటనలు. లౌకిక సెలవుదినాలు ఎక్కువగా ఉండే నవంబరు డిశంబరు నెలల్లో సహాయ పయినీర్లుగా చేయమని అందరినీ ప్రోత్సహించండి. దాన్ని చేసేందుకుగాను మనం అవసరమైన సమయాన్ని ఎలా కనుగొనగలమనే విషయంలో కొన్ని సలహాలనివ్వండి.

15 నిమి: స్థానిక అవసరాలు. లేక మే 15, 1994, కావలికోట పక్ష పత్రికల సంపుటిలోని 21-3 పేజీల్లోని “మీరు ఓర్పును ప్రదర్శించగలరా?” అనే శీర్షికపై ఒక పెద్ద ప్రసంగించేటట్లు ఏర్పాటుచేయండి.

18 నిమి: నవంబరు అందింపు కొరకు సిద్ధపడండి. బైబిలు జ్ఞానం ఏ మాత్రం లేని వ్యక్తులైనప్పటికీ, బైబిలును చదవడంలోనూ దాన్నుండి తెలుసుకోవడంలోనూ ఆసక్తి గలవారికి, న్యూ వరల్డ్‌ టాన్స్‌లేషన్‌ శ్రేష్ఠమైనదని, సులభంగా చదవగల్గినదని, అద్భుతమైన రెఫరెన్సులతో పఠన సహాయకాలతో ఆధునిక ఇంగ్లీష్‌ భాషలో ఉంటుందని చెప్పి అందించడం అవసరం. ఇప్పటికే తమ దగ్గిర బైబిలున్న వ్యక్తులకు, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ అన్నింటికంటే ఎందుకు ఉన్నతమైందో చూపించడం అవసరం. “ప్రతి లేఖనమూ దైవావేశమువలన కల్గినది మరియు ప్రయోజనకరమైయున్నది” (ఇంగ్లీష్‌) అనే పుస్తకాన్ని చూడండి (327-8 వ పేజీ, 1-6 పేరాలు). యెహోవా నామం ఎందుకు ఉపయోగించబడిందో వివరించండి, అంతేకాకుండ ఆధునిక భాషను ఉపయోగించడం వల్ల వచ్చే ప్రయోజనాలను చూపే కొన్ని ఉదాహరణలను యివ్వండి. బైబిలు వెనుకనున్న కొన్ని సహాయకరమైన విషయాలను చూపించండి; ఉదాహరణకు, సుపరిచిత లేఖనాలను త్వరగా కనుక్కునేందుకు ఉపయోగపడే “బైబిలు పదాల ఇండెక్స్‌” ను చూపండి. “బైబిలు పుస్తకాల పట్టిక” ప్రతి పుస్తకాన్ని ఎవరు రచించారు, అది ఎక్కడ, ఎప్పుడు రాయబడింది అలాగే దానికి ఎంత సమయం పట్టింది అనే విషయాలను చూపిస్తుంది. రీజనింగ్‌ పుస్తకాన్ని చూడండి (పేజీ 59 నందలి, “బైబిలు ప్రవచనం, లోక పరిస్థితుల భావాన్ని వివరిస్తుంది” అనే ఉపశీర్షిక), ఆ తర్వాత యోహాను 17:3, కీర్తన 37:10, 11, 29 పై ఆధారపడిన లేఖనాధార సంభాషణను ఎలా ప్రారంభించాలో మీరు చర్చించవచ్చు. స్థానిక ప్రాంతంలో, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? అనే పుస్తకాన్ని ఎలా అందించాలో చూపే ఓ ప్రదర్శనను సామర్థ్యంగల ఒక ప్రచారకుని చేత ఏర్పాటుచేయండి. రెండవ ప్రదర్శనలో, ఒక ప్రచారకుడు ఒకటి లేక అంతకంటే ఎక్కువ బ్రోషూర్లను లేక సంఘంలో అందుబాటులో ఉన్న 192 పేజీల పుస్తకాన్ని అందించాలి.

పాట 136 (61) ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి