ఎల్లప్పుడును స్తుతియాగము చేస్తూ—దేవుని రాజ్యమును మొదట వెదకండి
1 రాజ్యాన్ని మొదట వెదికేవారు, యెహోవాను గూర్చి ఆయన రాజ్యాన్ని గూర్చి మాట్లాడే విషయంలో ఎల్లప్పుడూ మెలకువగా ఉంటారు. (కీర్త. 145:11-13) ఆయన నామాన్ని స్తుతించడానికి, సువార్తను గూర్చి మాట్లాడడానికి ప్రతి రోజూ అవకాశాలున్నాయి. (కీర్త. 96:2) “దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము” అని ప్రకటించిన కీర్తనల రచయితకు యెహోవాను స్తుతించడం ఆనందాన్నిచ్చింది. (కీర్త. 44:8) మనమూ అదే విధంగా భావిస్తే, రాజ్య పరిచర్యలో క్రమంగా భాగం వహించేందుకు మనం ఎంతో ఆసక్తిని కల్గివుంటాము.
2 మనం పరిచర్య యందు ఎంత సమయం గడపాలన్న విషయంలో యెహోవా నిర్దిష్టమైన షరతులను ఏర్పర్చలేదు, అయితే “ఎల్లప్పుడూ” ఆయనను స్తుతించమని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. (హెబ్రీ. 13:15) మన వ్యక్తిగత పరిస్థితులు అనుమతిస్తే, యెహోవాను స్తుతించడానికి ప్రతి వారం కొంత సమయాన్ని గడపడం మన గురిగా చేసుకోవాలి. దాన్ని ఇప్పటికే చేస్తున్నవారు అప్పుడప్పుడు లేదా క్రమంగా సహాయ పయినీరుగా సేవించడానికి తమ పరిస్థితులను సర్దుబాటు చేసుకోవచ్చు. సహాయ పయినీరు సేవను ఆనందిస్తున్నవారు, బహుశ క్రమ పయినీర్లుగా భాగం వహించవచ్చును.
3 మన వ్యక్తిగత పరిస్థితులేమైనప్పటికీ, మన స్తుతియాగాన్ని అధికం చేసుకోవడం మనకు సాధ్యమేనా? మెప్పుదల ఆసక్తిని పురికొల్పుతుంది. దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా పఠించడం మెప్పుదలను పెంపొందిస్తుంది. సంఘ కూటాలు ఆ మెప్పుదలను ఆచరణాత్మకమైన రీతుల్లో వ్యక్తపర్చేందుకు మనల్ని పురికొల్పుతాయి. ఆసక్తితో స్తుతించే యితరులతో సన్నిహిత సంబంధాన్ని కల్గివుండడం, ‘సత్కార్యములు చేయుటకు పురికొల్ప’ గలరు. (హెబ్రీ. 10:24) సంఘం అందించేవాటినుండి పూర్తి ప్రయోజనం పొందడం ద్వారా, మన స్తుతియాగాలను మనం అధికం చేసుకోవచ్చు.
4 ప్రవక్త్రియైన అన్న యెహోవా సేవలో మంచి మాదిరినుంచింది. ఆమెకు 84 సంవత్సరాల వయస్సున్నప్పటికీ, “దేవాలయము విడువక . . . రేయింబగళ్లు సేవచేయుచుండెను.” (లూకా 2:37) సంఘ పనుల్లో ఆమె హృదయపూర్వకంగా పాల్గొనడం ఆమెకు ఎంతో సంతృప్తిని తెచ్చింది. ఆమె నమ్మకమైన సేవను గూర్చిన బైబిలు వృత్తాంతం నేడు మనందరికీ ప్రోత్సాహాన్నిస్తుంది.
5 ‘బలవంతులైనవారు . . . బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధు’లైయుండాలని పౌలు సిఫారసు చేశాడు. (రోమా. 15:1) బహుశ, దయతో కూడిన మీ సహాయం, ప్రోత్సాహం నుండి ప్రయోజనం పొందేవారు మీ సంఘంలో ఉండివుంటారు. వారికి అప్పుడు సరిగ్గా అవరసమున్నది మీతో పరిచర్యలో పాల్గొనేందుకు ఆహ్వానించడమే కావచ్చు. ఒక ప్రచారకునికి ప్రయాణ సౌకర్యమో లేక తనతో పాటు పనిచేసేందుకు ఎవరో ఒకరు అవసరం కావచ్చు. మరెవరికైన నిరుత్సాహం ఓ సమస్య కావచ్చు, మరి రాజ్య పరిచర్యలో ఆ వ్యక్తి ఆసక్తిని పునరుద్ధరించగల్గే అవసరమైన నిర్మాణాత్మకమైన మద్దతును అందించే వ్యక్తి బహుశ మీరే అయివుండవచ్చును. (1 థెస్స. 5:14) “పరిశుద్ధుల అవసరములలో పాలుపొం”దేందుకు మీ సుముఖతే, యెహోవా నామ ఘనతను అధికం చేయాలనే మీ హృదయపూర్వక కోరికను ప్రదర్శిస్తుంది.—రోమా. 12:13.
6 ఇప్పటికే యెహోవా మనకొరకు చేసినవి, భవిష్యత్తులో చేయబోయే వాటన్నింటిని గణించడం అసంభవం. ఈ ఆశీర్వాదాలను బట్టి మనం ఆయనకు తిరిగి చెల్లించగల్గే మార్గమే లేదు. ‘సకలప్రాణులు యెహోవాను స్తుతించేందుకు’ ఎంతటి బలీయమైన కారణాలున్నాయి!—కీర్త. 150:6.