ఇదే సరైన సమయం
1 అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రెండవ పత్రిక రాసినప్పుడు, యెరూషలేములో ఉన్న తమ తోటి విశ్వాసుల కొరకు శ్రేష్ఠమైన సహాయకార్యక్రమాన్ని అందిస్తామని వారు నిశ్చయించుకున్న విషయాన్ని వారికి జ్ఞాపకం చేశాడు. అయితే, ఒక సంవత్సరం గడిచినా కూడా తాము ప్రారంభించిన పనిని యింకా పూర్తి చేయలేదు. కనుక ఆయన వారిని యిలా ఉద్బోధించాడు: “వెళ్లి, పూర్తిచేయండి: ఆ పనిని ఎంత ఆసక్తితో చేపట్టారో అంత ఆసక్తితో దాన్ని పూర్తిచేయండి.”—2 కొరిం. 8:11, ది న్యూ ఇంగ్లీష్ బిల్.
2 ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా, మనమందరమూ గురులను పెట్టుకున్నాము. ప్రాంతీయ సేవలో మన భాగాన్ని మనం విస్తృతపర్చుకోవాలనో, మన సహోదరులను మంచిగా అర్థంచేసుకోవాలనో, సేవా ఆధిక్యతకు అర్హతను పొందాలనో, లేక ఏదొక బలహీనతను అధిగమించాలనో మనం నిర్ణయించుకుని ఉంటాము. మనం మంచి ఉద్దేశాలతో ప్రారంభించినప్పటికీ, మన గురిని సాధించేందుకు బహుశ మనం దాన్ని సక్రమంగా అనుసరించి ఉండము. మనం దాన్ని గ్రహించకముందే అంటే మనం ఎలాంటి పురోభివృద్ధి సాధించకుండానే వారాలు లేక చివరికి నెలలు సంవత్సరాలు కూడా గడిచిపోయి ఉంటాయి. బహుశా, మనం ప్రారంభించినదాన్ని “వెళ్లి, పూర్తిచేయాలి” అనే సలహాను మనకుమనమే అన్వయించుకోవల్సిన అవసరం ఉందంటారా?
3 మన గురులను సాధించడం: వ్యక్తిగత గురిని ఏర్పర్చుకోవడం సులభమేగాని, దాన్ని సాధించడం కష్టం. వాయిదావేయడం ఏ అభివృద్ధినైనా ఆటంకపరుస్తుంది. మనం నిర్ణయించుకుని, ఆలస్యం చేయకుండా ముందుకుసాగేందుకు గట్టిగా నిశ్చయించుకోవాలి. వ్యక్తిగత సంస్థీకరణ అన్నది ఆవశ్యకం. ఆ కార్యాన్ని జరిగించేందుకు అవసరమయ్యే సమయాన్ని మనం కేటాయించడం, అంతేకాకుండా ఆ సమయాన్ని ఆ ఉద్దేశం కొరకే ఖచ్చితంగా వ్యయపర్చడం ప్రాముఖ్యం. ఒక నిర్ణీతమైన గడువును పెట్టుకొని, ఆ తర్వాత దాన్ని చేరుకునేందుకుగాను వ్యక్తిగత క్రమశిక్షణను కల్గివుండడం మంచి ఆలోచనే.
4 గమ్యాలను చేరడంలో మనకు ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ‘దాన్ని తర్వాత చేసుకోవచ్చులే,’ అని అనుకోవడం చాలా సులభం. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సామెతలు 27:1 యిలా పేర్కొంటోంది: “రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.” “రేపేమి సంభవించునో మీకు తెలియదు . . . కాబట్టి మేలైనదిచేయనెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును,” గనుక భవిష్యత్తును గూర్చి అతి నమ్మకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని శిష్యుడైన యాకోబు హెచ్చరించాడు.—యాకో. 4:13-17.
5 ఎన్నో ఆటంకాలను బట్టి అలాగే, యితరులు మన నుండి కోరే వాటినిబట్టి మన గురులు సులభంగా మరుగునపడగలవు. వాటిని మన మనస్సుల్లో ఎల్లప్పుడూ తాజాగా ఉంచుకునేందుకు జాగ్రత్తతో కూడిన ప్రయత్నం చేయడం అవసరం. ఆ విషయాన్ని మన ప్రార్థనల్లో పెట్టడం సహాయకరంగా ఉంటుంది. మనకు జ్ఞాపకం చేయమనీ, మనల్ని ప్రోత్సహించమని మనకు సన్నిహితులైనవారిని కోరడం ఉపయుక్తంగా ఉండగలదు. మన అభివృద్ధి ఎలా ఉందో చూసుకునేందుకు కేలండరుపై గుర్తుపెట్టుకోవడం మనకో జ్ఞాపికగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి ‘తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము చేయవలెననని’ తీర్మానించుకోవాలి.—2 కొరిం. 9:7.
6 అక్టోబరు నెల మన గురులపై అవధానం నిలిపేందుకు చక్కటి అవకాశాన్ని అందిస్తుంది. ఇంటింటి పరిచర్యలోనూ పునర్దర్శనాల్లోనూ మనం కావలికోట, తేజరిల్లు! పత్రికల చందాలను అందిస్తాము. సాధించేందుకుగాను కొన్ని సహేతుకమైన గురులను మనం ఏర్పర్చుకోగలమా? నిర్దిష్టమైన సంఖ్యలో పత్రికా చందాలను అందించాలనే గురిని కల్గివుండే విషయమేమిటి? లేక మన పత్రికల అందింపును విస్తృతపర్చే ప్రయత్నంలో గురిని ఏర్పర్చుకోగలమా? ఎక్కువ పునర్దర్శనాలను చేయాలని, కొత్త బైబిలు పఠనాన్ని ప్రారంభించాలి తీర్మానించుకోవడం అనేకులకు సహేతుకమైన గురులు కాగలవు.
7 ప్రాముఖ్యమైనదాన్ని వాయిదావేయడం వివేకయుక్తం కాదు ఎందుకంటే “లోకము గతించిపోవుచున్నది.” (1 యోహాను 2:17) యెహోవా సేవలో ప్రత్యేకమైన ఆధిక్యతలూ ఆశీర్వాదాలూ మనకు యిప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటినుండి ప్రయోజనం పొందడం మన చేతిలోనే ఉంది.