దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష
జూన్ 27 నుండి అక్టోబరు 17, 1994 మధ్యవారాల్లోని ప్రసంగాల సమాచారంపై ఆధారపడిన, పుస్తకాలను మూసివేసి చేయవలసిన పునఃసమీక్ష. అనుమతించిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడానికి వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నకు సమాధానం వ్రాయడానికైనా బైబిలును మాత్రమే ఉపయోగించాలి. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధనకొరకు యివ్వబడ్డాయి. ది వాచ్‌టవర్ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్ నెంబర్లు ఉండకపోవచ్చు.]
ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. చదివేటప్పుడు కీర్తనల గ్రంథంలో 71 సార్లు కనిపించే “సేలా” అనే పదాన్ని ఉచ్ఛరించనవసరం లేదు. [ఎస్‌ఐ పుట 101 పేరా 5]
2. కీర్తన 15:4 ప్రకారం, క్రైస్తవుడు తాను చేసిన మొక్కుబడి లేఖనరహితమని తెలుసుకున్నప్పటికీ, ఆయన దాన్ని చెల్లించవలసిందే. [వారపు బైబిలు పఠనం; కా 91 8⁄1 పుటలు 30-1 చూడండి.]
3. మానవుల కష్టాలకు, వ్యాధికి, మరణానికి దేవుడు కారణం కాడని యోబు గ్రంథం నిరూపిస్తుంది. [ఎస్.ఐ. పుట 100 పేరా 42]
4. ఆదాము కావాలనుకుంటే పరిపూర్ణమైన యథార్థతను కాపాడుకోగల్గేవాడని, దేవుని సృష్టి పనిలో పొరపాటేమి లేదని యేసు జీవిత విధానం నిరూపించింది. [యుడబ్ల్యు పుట 52 పేరా 11]
5. లూకా 19:20-24 లో వర్ణించబడిన ఒక మినా తీసుకొని దానిని రుమాలులో కట్టి ఉంచిన దాసుడు పని చేయనందువల్ల నేరస్థుడయ్యాడు. [జిటి అధ్యాయం 100]
6. కష్టపడి పనిచేయడం వలన, దేవునికి సంపూర్ణ భక్తిని చూపడంవలన నిజక్రైస్తవుడు నిత్యమూ జీవించే హక్కును పొందగలడు. [యుడబ్ల్యు పుట 36 పేరా 13]
7. మొదటి కొరింథీయులు 2:9 భవిష్యత్తులోని భూపరదైసును సూచిస్తుంది. [యుడబ్ల్యు పుట 26 పేరా 12 (3); కా 85 9⁄1 పుట 28 చూడండి.]
8. లోకంలో దుష్ప్రవర్తన సాధారణమైనప్పటికీ, దానికంత ప్రాముఖ్యత లేదని మనమనుకోలేము. [యుడబ్ల్యు పుట 53 పేరా 13]
9. కీర్తన 49:15 పునరుత్థాన నిరీక్షణయందు నమ్మకాన్ని చూపిస్తుంది. [వారపు బైబిలు పఠనం; w89 3⁄1 పుట 22 పేరా 13.]
10. కొన్నిసార్లు యెహోవాను సేవిస్తున్నానని చెబుతున్న మరొక వ్యక్తినుండి లోకరీతిలో నడుచుకునేందుకు ప్రలోభం వస్తుంది. [యుడబ్ల్యు పుట 43 పేరా 11.]
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి:
11. కీర్తన అంటే ఏమిటి? [ఎస్‌ఐ పుట 101 పేరా 2]
12. కీర్తన 27:10 అద్భుతమైన ఏ హామీనిస్తుంది? [వారపు బైబిలు పఠనం; w92 6⁄15 పుట 22 పేరా 17 చూడండి.]
13. పశ్చాత్తాపపడని తప్పిదస్థులకు ఎలాంటి తప్పుడు దృక్పథముందని కీర్తన 10:13 చూపిస్తుంది? [వారపు బైబిలు పఠనం; w92 2⁄1 పుట 6 చూడండి.]
14. నిర్గమకాండము 9:15, 16 ప్రకారం ఫరోతో యెహోవా వ్యవహరించిన విధం దేనిని సాధించింది? [యుడబ్ల్యు పుట 57 పేరాలు 6, 7]
15. బైబిలులో మనం చదివేదాని నుండి ప్రయోజనం పొందడానికి పరిశీలించవలసిన వాటిలో రెండింటిని పేర్కొనండి. [యుడబ్ల్యు పుట 27]
16. కీర్తన 2:12 లో చెబుతున్నట్లు “కుమారుని ముద్దు పెట్టుకొనుడి” అనే ఆజ్ఞ అర్థమేమిటి? [వారపు బైబిలు పఠనం; w86 9⁄15 పుట 20 చూడండి.]
17. యోహాను 8:32 లో యేసు ఏ విధమైన స్వాతంత్ర్యాన్ని గూర్చి చర్చిస్తున్నాడు? [యుడబ్ల్యు పుట 40 పేరా 6]
18. ఆదికాండము 3:15 లో చిత్రీకరించబడిన “స్త్రీ” ఎవరు? [యుడబ్ల్యు పుట 30 పేరా 3.]
19. తాను చేసిన పాపము తోటి మానవులకు విరోధమైనదని తెలిసినప్పటికీ, కీర్తన 51:4 లో దావీదు యెహోవాతో “నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను” అని ఎందుకు అనగల్గాడు? [వారపు బైబిలు పఠనం; w 93 3⁄15 పుట 11 పేరా 13 చూడండి.]
20. తొలి శతాబ్దంలో “నాశనకరమైన హేయ వస్తువు” ఏది, యీనాడు అది ఏది? (మత్తయి 24:15) [జిటి అధ్యాయం 111]
క్రింది వాక్యములను పూరించడానికి అవసరమైన పదాలను లేదా మాటలను చేర్చండి:
21. సాక్ష్యాధారంగా, యోబు 40:15 లోని “నీటి గుఱ్ఱము” _________________________ ను సూచిస్తుంది. యోబు 41:1 లోని “మకరము” అనే మాట _________________________ కి చక్కగా సరిపోతుంది. [వారపు బైబిలు పఠనం; ఐటి-1 పుట 280, ఐటి-2 పుట 240 చూడండి.]
22. యేసు _________________________ పొందినప్పుడు, _________________________ చెందిన సమయంలో సా. శ. 33, నీసాన్ 10 న యెరూషలేము _________________________ లో ఆయన తన తండ్రితో ప్రార్థన చేసినప్పుడు నిజంగా యెహోవా స్వరం వినబడింది. [జిటి అధ్యాయం 104]
23. _________________________ ఆచారబద్ధంగా అపవిత్రమైనది కాబట్టి, పరిసయ్యులు తమ ద్రాక్షారసం నుండి దానిని వడగట్టి తొలగించేవారు గాని, ఆచారబద్ధంగా అపవిత్రమైన మరో జంతువైన _________________________ ను మింగడంతో పోల్చదగినంతగా వారు న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేసేవారు. [జిటి అధ్యాయం 109]
24. మన మొదటి తల్లిదండ్రులను పాపంలోనికి నడిపేందుకు సాతాను అబద్ధం చెప్పాడు కనుక, యేసు అతన్ని _________________________ అని పిలిచాడు. [యుడబ్ల్యు పుట 53 పేరా 13 (1)]
25. యేసు మాత్రమే యెహోవాచేత సృష్టించబడ్డాడు గనుక, ఆయన దేవుని _________________________ . [యుడబ్ల్యు పుట 29 పేరా 1]
క్రింది వాక్యాల నుండి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
26. యోబు 42:5 లో వ్రాయబడినట్లు, అతడు దేవుని చూశాడు, అంటే (సుడిగాలిలో దేవుని దర్శనం కలిగింది; తన ముందు ప్రత్యక్షమైన దూతను చూశాడు; యెహోవాను మరింత సన్నిహితంగా తెలుసుకోగలిగాడు). [వారపు బైబిలు పఠనం; w89 11⁄1 పుట 12 చూడండి.]
27. మత్తయి 26:13 లో యేసు చెప్పిన స్త్రీ (లాజరు సహోదరియైన మరియ; క్లోపా భార్యయైన మరియ; మగ్దలేనే మరియ). [జిటి అధ్యాయం 101]
28. కీర్తన 11:3 లో వ్రాయబడిన పాడైన పునాదులు (యెరూషలేము లోని ఆలయ పునాదులను; పునాది మూలరాయిగా యేసు క్రీస్తును; న్యాయము, నియమము, క్రమము అనేవాటిపై ఆధారపడి ఉండే సమాజపు పునాదులను) సూచిస్తున్నాయి. [వారపు బైబిలు పఠనం; కా 86 9⁄1 పుట 28 చూడండి.]
29. వారి ఉగ్ర స్వభావమును బట్టి “ఉరిమెడువారు” అని యేసు పిలిచిన అపొస్తలులు (పేతురు, అంద్రెయ; ఫిలిప్పు, బర్తొలొమయి; యాకోబు, యోహాను). [జిటి అధ్యాయం 98]
30. పరిపాలించడానికి యెహోవాకు గల హక్కును, ఆయన పరిపాలించే విధానాన్ని సవాలు చేసినప్పుడు సాతాను లేవదీసిన పెద్ద వివాదంలో వాస్తవానికి (మానవ హక్కులు; ఎవరు ఎక్కువ శక్తిమంతుడన్న ప్రశ్న; దేవుని విశ్వ సర్వాధిపత్యం) చేరి ఉంది. [యుడబ్ల్యు పుట 46 పేరా 1]
క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ లేఖనాలను జతచేయండి:
ఆది. 3:1-5; కీర్త. 24:1; అపొ. 8:32-38; హెబ్రీ. 10:26, 27; 1 పేతు. 4:3, 4
31. మానవుడు, భూమి దేవుని సృష్టియని, సమస్తము యెహోవాకు చెందినవని గ్రహించడం, మనం సాత్వికులుగా విధేయులుగా ఉండడానికి తోడ్పడాలి. [యుడబ్ల్యు పుట 39 పేరా 4.]
32. యెహోవాకు కోపం కలిగించేదని మనకు తెలిసిన దేన్నైనా చేయడానికి అలవాటుపడకుండా ఉండేందుకు మనం చాలా జాగ్రత్త వహించాలి. [యుడబ్ల్యు పుట 33 పేరా 8 (3) 8 (4)]
33. సరైన బైబిలు జ్ఞానము, దాని సందేశంయెడల గల మెప్పు గొర్రె వంటి ప్రజలు బాప్తిస్మం పొందడానికి పురికొల్పుతాయి. [యుడబ్ల్యు పుట 32 పేరా 7]
34. మీరు అవిశ్వాసులతో పని చేస్తున్నప్పటికీ, లేదా వారితో పాఠశాలకు వెళ్తున్నప్పటికీ, వారితో అనవసరమైన సహవాసాన్ని విసర్జించడం ద్వారా మీరు వారిని సహవాసులుగా ఎన్నుకోవడం లేదని తెలుపుతారు. [యుడబ్ల్యు పుట 44 పేరా 13]
35. జీవితంలో తమ స్వంత ప్రమాణాలను నిర్ణయించుకోలేనట్లయితే తాము ఏదో కోల్పోయినట్లు ప్రజలు నమ్మేలా ప్రభావితం చేసే లౌకిక తలంపును విసర్జించడం ప్రాముఖ్యమై యున్నది. [యుడబ్ల్యు పుట 46 పేరా 1]