మీరు మళ్ళీ పయినీరు సేవ చేయగలరా?
1 గత ఐదు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వేలకొలది క్రమ పయినీర్లు పయినీరు సేవను విడిచి పెట్టడం అవసరమని కనుగొన్నారు. మీరు వారిలో ఒకరా? అలాగైతే, మీరు యీ ఆధిక్యతను వదిలి పెట్టడానికి మీకు కారణముందనడంలో సందేహం లేదు. బహుశా ఆ పరిస్థితి మీరు నిరీక్షించనిదై ఉండవచ్చు, అది మీ సామర్థ్యానికి ఉండవచ్చు. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉందా? ఆరోగ్య సమస్య, ఆర్ధిక యిబ్బందులు లేదా కుటుంబ బాధ్యతల వలన మీరు పయినీరింగ్ మానుకోవలసివస్తే యిప్పుడు మీ పరిస్థితులు మెరుగయ్యాయా? మళ్ళీ మీరు క్రమ పయినీరింగ్ చేయడంలోని దీవెనలను పొందడానికి మిమ్మల్ని అనుమతించే కొన్ని సహేతుకమైన సర్దుబాట్లు చేసుకోగలరా? మళ్ళీ దరఖాస్తు చేయడాన్ని గూర్చి మీరు తలంచారా?
2 మీకు తెలిసినట్లుగా, పయినీరుగా మీరు కృతకృత్యులవ్వాలంటే, చక్కని వ్యవస్థీకరణ మరియు జాగ్రత్తగా పట్టికవేసుకోవడం అనేవి అవసరం. సాధారణంగా వినోదంలో ఎక్కువ సమయం గడపడానికి ఉండదు, గనుక ఒక పయినీరు విశ్రాంతి తీసుకొనే కొద్దిపాటి సమయం తరచూ, ఎంతో సంతృప్తికరమైనదని, ఫలవంతమైనదని నిరూపించబడుతుంది. (సామె. 19:17; అపొ. 20:35) సేవలో రద్దీగా ఉండడం ద్వారా, లోకం వెంబడించే విలాస జీవిత విధానం నుండి, స్వార్థపూరిత ప్రభావం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. మీరు స్వయం త్యాగం చేసి, రాజ్యాసక్తులను మొదట ఉంచినట్లయితే, యెహోవా మిమ్మల్ని ఆత్మీయంగా ధనవంతులను చేస్తానని వాగ్దానం చేశాడు. పూర్ణహృదయంతో యెహోవా సేవ చేయడం ద్వారా మీరు నిశ్చయంగా నిజమైన సంతోషాన్ని సంతృప్తిని పొందుతారు.—సామె. 10:22; కొలొ. 3:23, 24.
3 పూర్తికాల సేవ అనేది ప్రత్యేకంగా కొందరికి మాత్రమే లభించే ఆధిక్యతయని దృష్టించాలా? దృష్టించనవసరం లేదు. మన జీవితాలను యెహోవాకు సమర్పించుకున్నప్పుడు చేసిన ప్రతిజ్ఞ దృష్ట్యా, పరిస్థితులు ఆటంకపర్చనట్లయితే, ప్రతి క్రైస్తవుడు పూర్తికాల సేవను గంభీరంగా తలంచాలి.—మార్కు 12:30.
4 మీ ఆరోగ్యం, లేఖనాధారమైన మీ బాధ్యతలు ప్రస్తుతం పయినీరింగ్ చేయడానికి మిమ్మల్ని నిజంగా అనుమతించనట్లయితే, అది యెహోవాకు తెలుసని, ఆయన అర్థం చేసుకుంటాడని మీరు నమ్మకం కలిగి ఉండగలరు. మీ పరిస్థితులు అనుమతించిన దానిని బట్టి మీరు చూపించిన యథార్థతకు ఆయన ప్రతిఫలమిస్తాడు. (1 కొరిం. 4:2; 2 కొరిం. 8:12) అయినను, మీరు మళ్ళీ పయినీరింగ్ చేయడానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే, అధ్యక్షుని దగ్గరకు వెళ్ళి, దరఖాస్తు ఎందుకు అడగకూడదు?
5 మీ కుటుంబం సహాయపడగలదా? మీ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించవలసిన అవసరం ఉన్నందుకే మీరు పయినీరు సేవను వదిలి పెట్టి ఉండవచ్చు. ఇప్పుడు మీ కుటుంబంలోని యితర సభ్యులు, మీరు పయినీరు సేవలో తిరిగి ప్రవేశించేలా మీకు సహాయపడే స్థితిలో ఉన్నారా? కొందరికైతే, కొన్ని బాధ్యతలను నిర్వహించడానికి కొంత చేయూత లభిస్తే చాలు, మళ్ళీ పయినీరు సేవ చేయగలరు.
6 కుటుంబ సభ్యుల మంచి సహకారం, కొంత అదనపు ప్రయత్నం దీన్ని సాధ్యం చేస్తాయి. ఆర్థిక సహాయం చేయడం ద్వారా, లేదా వాళ్ళకు రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా, అలాగే, కలిసి పని చేయడానికి క్రమంగా ఏర్పాట్లు చేసుకోడం ద్వారా సహాయం చేయవచ్చు. బహుశా వేరే విధాల్లో కూడా వారు సహాయపడగలరు. మీరు యీ సేవాధిక్యతను మళ్ళీ చేపట్టడానికి పరిస్థితులు అనుమతించనట్లయితే, బహుశా, కుటుంబంలో అలా చేయగల మరో సభ్యునికి సహాయం అందించగలరు.
7 కుటుంబసమేతంగా యీ విషయాలను ఎందుకు చర్చించకూడదు? మీరు ఏకగ్రీవంగా ఒక పద్ధతిని చేపట్టినట్లయితే మీ కుటుంబంలో ఒకరు పయినీరు అయ్యే అవకాశముంటుంది. మరొకరు కూడా పయినీరింగ్ చేయగలిగినట్లయితే, కుటుంబమంతా తమకు భాగం ఉందని నిజాయితీగానే భావించవచ్చు. ఇలాంటి ఉదార స్వభావం ఆ ప్రాంతంలో రాజ్యసాక్ష్యానికి దోహదపడడమే కాక, కుటుంబాన్నంతటినీ ఆత్మీయంగా మరింత సన్నిహితం చేస్తుంది.—లూకా 6:38; ఫిలి. 2:2-4.