యౌవనస్థులకు ఒక మంచి మాదిరి ఆవశ్యకము
1 పెరిగే సంఖ్యలలో ‘యెహోవా నామమును స్తుతించే’ యౌవనులు మనతో ఉన్నందుకు మనం సంతోషిస్తూన్నాం. (కీర్త. 148:12, 13) వారిలో చాలామంది ఇంకా పిన్న వయస్సులోనే ఉన్నారు. వారి అభివృద్ధి అనేది వారి తల్లిదండ్రులు, సంఘంలోని యితర పెద్దల మాదిరి, తర్ఫీదునుబట్టి నిశ్చయించబడుతుంది. అయినను, యితర యౌవనులు ప్రాముఖ్యంగా తమకంటే కొంచెం పెద్దవారిచే చూపబడిన ప్రభావమును అలక్ష్యం చేయకూడదు. మీరుకూడా ఆ వయస్సుకు సంబంధించినవారైతే, ఈ వ్యాఖ్యానాలు మీకు ప్రయోజనం ఇవ్వవచ్చును
2 బాలలు తమకంటే కొంచెము పెద్దవారైన యౌవనులను అనుసరించడానికి మొగ్గు చూపుతారు. వారు ఎవరిని అభిమానిస్తారో వారితోనే సన్నిహిత సాంగత్యం చేయాలనే సహజ కోరికను కలిగియుంటారు. వారు తమకంటే కొంచెము పెద్దవారైన జ్ఞానము కలిగి, ఎక్కువ ఉన్నతి గలవారిలా కన్పించే యితర యౌవనులను అభిమానిస్తారు. దాని ఫలితంగా, మీ మాటలను, ప్రవర్తనను, అలాగే ఆత్మీయ విలువలపై మీ మెప్పును, సంఘ కార్యకలపాలలో మీరు భాగం వహించడాన్ని వారు అనుకరించవచ్చును.
3 యౌవన దశలో ముందున్న వారిగా, మీకు ఆధిక్యతతోపాటు గొప్ప బాధ్యత కూడ ఉంది. సరిగ్గా యిప్పుడే, మీ మాదిరి మీకన్నా చిన్నగా ఉన్న సహవాసులపై ప్రభావం చూపుతుంది. మీకై మీరే యిలా ప్రశ్నించుకోండి, ‘నేను యౌవనస్థులపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాను? చెడ్డవైన “యౌవనేచ్ఛలను” అవివేకతను విసర్జిస్తూ, గంభీరమైన ఆలోచనగల వ్యక్తిగా నేనున్నానా? నా తల్లిదండ్రులకు, సంఘ పెద్దలకు, యితర పెద్దలకు విధేయతను, సరియైన గౌరవమును నేను ప్రదర్శిస్తున్నానా?’ (2 తిమో. 2:22; కొలొ. 3:20) మీ క్రియల్ని గమనించే యితర యౌవనస్థుల ఆత్మీయ అభివృద్ధిలో మీ మాటలు, క్రియలు ఒక ప్రముఖ భాగంగా ఉంటాయి.
4 రాజ్య వర్తమానాన్ని ప్రకటించటమే సంఘంయొక్క ప్రాముఖ్యమైనపనిగా ఉండాలి. మీ యిష్టత, క్రమంగా భాగం వహించటం మీ తోటివారు మరింత చురుకుగా ఉండేటట్లు ప్రోత్సహించగలదు. మీరు పయినీర్ సేవలో ప్రవేశించగల్గితే, అదేమాదిరిగా మీ స్నేహితులుకూడ చేయడానికి పురికొల్పబడతారు. కూటాలలో వ్యాఖ్యానాలను చేయటం, రాజ్యమందిరంలో అవసరమైన పనులు చేయడానికి మీరు స్వచ్ఛందముగా ముందుకు రావడం కూడా మంచి మాదిరి నుంచగలదు.
5 పౌలు ఆయనకు ఈ సలహాను యిచ్చినప్పుడు, తిమోతి యింకా యౌవన దశలో లేకపోయినప్పటికి, యౌవనస్థులైన మీరు దానిని అన్వయించుకోవచ్చు: “మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.” (1 తిమో. 4:12) మీ ఉత్సాహం, యెహోవా సేవలో పూర్ణాత్మతో భాగం వహించే విధానం మీతో సహవసించే వారిని పురికొల్పుతుంది అంతేకాక మిమ్మల్ని గమనిస్తున్న మీకన్నా చిన్నవారిని అనుకూలమైన మార్గంలో ఆత్మీయ పరిపక్వతగల వ్యక్తులుగా అభివృద్ధి పొందటానికి సహాయ పడుతుంది. (ఎఫె. 4:13) ఇపుడే బైబిలు పఠనాన్ని ప్రారంభించిన కుటుంబంలోని యౌవనులు మీలో వారు చూసిన దానినిబట్టి వారు సత్యానికి ఆకర్షించబడవచ్చును.
6 అతి ప్రాముఖ్యంగా, మీకున్న దైవిక లక్షణాలను ప్రదర్శించడంలో శ్రద్ధ, యెహోవాకు, ఆయన సంస్థకు ఘనతను తెస్తుంది. (సామె. 27:11) యథార్థవంతమైన పరిశీలకులు మీకు, లోకంలోని యౌవనస్థులకు స్పష్టమైన తారతమ్యతను చూసి ఆశ్చర్యపడతారు. కాబట్టి యెహోవా స్తుతికి అమూల్యమైన మద్దతునిస్తూనే, మీకంటే చిన్నవారికి సహాయంచేసే ఒక ఉత్కృష్టమైన అవకాశాన్ని మీరు కలిగియున్నారు.—కీర్త. 71:17.