ప్రకటనలు
◼ అందించవలసిన సాహిత్యాలు జూలై: ఏవైనా 32 పేజీల మూడు చిన్న పుస్తకాలను కలిపి రూ. 3.00 చందాకు అందించవచ్చు. ఈ క్రింది చిన్న పుస్తకాలు మా వద్ద సమృద్ధిగా ఉన్నాయి: ఇంగ్లీషు, మరాఠీ భాషల్లో సురక్షితమైన భవిష్యత్తును—నీవు ఎట్లు కనుగొందువు; ఇంగ్లీషు, ఫ్రెంచ్, మరాఠీ, పంజాబీ భాషల్లో కురుక్షేత్రం నుండి అర్మగెద్దోను వరకు—మరియు నీవు జీవముతో భద్రపరచబడుట; ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషల్లో ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ ఫాదర్ (బౌద్ధ మతస్థుల కొరకు); ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ, కొంకణీ (కన్నడా మరియు గోవా), మణిపురి, మలయాళం, పంజాబీ, తమిళ భాషల్లో సంరక్షించు దేవుడు ఉన్నాడా?; ఇంగ్లీషు, లుషాయ్, మలయాళం, తమిళ భాషల్లో విడుదలకు నడుపు దైవీక సత్య మార్గము; ఇంగ్లీషు, హిందీ, లుషాయ్, మరాఠీ, పంజాబీ భాషల్లో జీవితమునకు ఇంకను చాలా ఉన్నది!; గుజరాతీ, ఖాసీ, కొంకణీ (కన్నడ మరియు గోవా), లుషాయ్, మణిపురి, మరాఠీ, మలయాళం, తమిళ భాషల్లో “ఈ రాజ్య సువార్త”; ఇంగ్లీషు, ఫ్రెంచ్, హిందీ, నేపాలీ, పంజాబీ భాషల్లో విక్టరీ ఓవర్ డెత్—ఈజ్ ఇట్ పాజిబుల్ ఫర్ యు?, యితరములు మీ భాషలో చిన్న పుస్తకాలు ఏవి అందుబాటులో లేనట్లయితే, స్కూల్ బ్రోషూర్ తప్ప వేరే ఏ బ్రోషూర్‌నైనా రూ. 4.00 చందాకు అందించవచ్చు. ఆగస్టు: మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? అనే బ్రోషూర్‌ను రూ. 4.00 చందాకు అందించవచ్చు. ఇది లభ్యంకానిచోట, లేక వేరే అంశం మరింత ఉచితంగా ఉండే చోట, యీ క్రింద యివ్వబడిన 32 పేజీల బ్రోషూర్‌లలో వేటినైనా ఉపయోగించవచ్చు: భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, ది డివైన్ నేమ్ దట్ విల్ ఎండ్యూర్ ఫర్ ఎవర్, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” పరదైసును తీసుకొని వచ్చు ప్రభుత్వము, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలుసుకోగలరు? సెప్టెంబరు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకం రూ. 20.00 చందా (పెద్ద సైజు రూ. 40.00) అక్టోబరు: తేజరిల్లు! లేదా కావలికోట పత్రికలకు చందా సేకరణ. పక్షపత్రికలకు ఒక సంవత్సరం చందా రూ. 60.00. పక్షపత్రికలకు ఆరునెలల చందా, మాస పత్రికలకు సంవత్సరం చందా రూ. 30.00. మాస పత్రికలకు ఆరునెలల చందా లేదు.
◼ అక్టోబరు 3, 1994, నుండి రెవలేషన్—ఇట్స్ గ్రాండ్ క్లైమాక్స్ ఎట్ హాండ్! అనే పుస్తకం నుండి సంఘ పుస్తక పఠనం ప్రారంభించబడును.
◼ దయచేసి సమావేశ ప్రధాన స్థలాల చిరునామాల రెండు మార్పులను గమనించండి: Bombay (Hindi): c/o F.G. Dias, Post Bag 17723, Borivili West, Bombay, MAH 400 092. Calicut: c/o Saji Thomas, Chembukavu House, Kanimangalam P.O., Trichur, KER 680 007.
◼ ఇకముందు, ఒక సంఘం ప్రస్తుతం స్టాకులేని వాటిని లేదా లభ్యంకాబోయే క్యాలండర్లు, ఇయర్ బుక్‌లవంటి వాటికి ఆర్డరు చేసినట్లయితే ఆ ఆర్డరును సోసైటీ అంగీకరించి, దానిని పెండింగ్‌లో ఉంచుతుంది. అలాంటి వాటి వివరణ, పరిమాణం మీ తదుపరి లిటరేచర్ ఇన్‌వాయస్‌లో ఇవ్వబడుతుంది కాని వాటి వెల చూపించబడదు. ఇన్‌వాయస్‌లో వాటి పరిమాణం చూపించబడి ప్రస్తుతం వెల చూపకపోతే, అవి ప్రస్తుతం అందుబాటులో లేవని దాని భావము. కాబట్టి అవి మీకు అందలేదు అని చెపుతూ సోసైటీకి రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కన్‌సైన్‌మెంట్‌లో వాటిని మీరు పొందుతారని ఎదురు చూడకూడదు. మీ ఆర్డరును సోసైటీ గుర్తించిందని, దానిలో ఉన్న సాహిత్యాలు అందుబాటైనంతవరకు దానిని ‘పెండింగ్’ లో ఉంచుతుందనికూడ, దాని భావం. అందునుబట్టి అవి అందుబాటులో ఉన్నపుడు మీకు పంపబడతాయి. అవే సాహిత్యాలు మీకు ఎక్కువ పరిమాణంలో కావలసివస్తేనే తప్ప మరలా వాటిని ఆర్డరు చేయవద్దు.
◼ మేము 1995కు సంబంధించిన ప్రతిదినము లేఖనాలను పరిశీలించుట, క్యాలెండర్స్, ఇయర్‌బుక్స్ కొరకు ఇప్పుడు ఆర్డరులను అంగీకరిస్తున్నాము. దయచేసి మీ ఆర్డరును జూలై 6, 1994 లోపున అందునట్లు చేయండి. మీరు లిటరేచర్ ఆర్డరు ఫారమ్‌లో (ఎస్-ఎబి-14) ఈ ఐటమ్స్ ఆర్డరు చేస్తూ, దయచేసి దానిలోనే మరొక ఐటమ్ ఆర్డరు చెయ్యవద్దు. ఈ 1995కొరకు, ప్రతిదినము లేఖనాలను పరిశీలించుట ఇంగ్లీషు, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళము, నేపాలీ, తమిళం, మరియు తెలుగులో లభ్యమగును.
◼ యిప్పటివరకు ‘దైవ భయము’ సమావేశ బ్యాడ్జి కార్డులు ఇంకనూ ఆర్డరు చేయని సంఘాలు అవసరమైనన్ని తక్షణమే ఆర్డరు చేయాలని కోరుచున్నాం. బ్యాడ్జి కార్డులు ఇంగ్లీషు, మలయాళం మరియు తమిళంలో లభ్యమగును.
◼ మరలా లభ్యమయ్యే సాహిత్యాలు:
ఇంగ్లీషు: పరదైసును తీసుకొని వచ్చు ప్రభుత్వము, జీవించిన వారిలోకెల్లా మహా గొప్ప మనిషి; కన్నడ: భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!