జూలై కొరకైన సేవా కూటాలు
జూలై 4తో ప్రారంభమయ్యే వారం
పాట 141 (64)
10 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్య నుండి స్థానికంగా అన్వయించే ప్రకటనలు. సంఘం స్టాకులో ఉన్న చిన్నపుస్తకాల పేర్లను పేర్కొనండి; సేవలో ఉపయోగించడానికి అవసరమైన సాహిత్యాలను పొందమని ప్రచారకులను ప్రోత్సహించండి. సంఘానికి అవసరమైన భాషలో చిన్నపుస్తకాలు లేనట్లైతే, ఆ భాషలో ఉన్న బ్రోషూర్లను ఉపయోగించమని సలహానివ్వండి.
17 నిమి: “విడువక ఇంటింట ప్రకటించుట.” ప్రశ్నా సమాధానాలు. మొదట యింటింటి సువార్త సేవలో కలవటంద్వారా సత్యం నేర్చుకొన్న కొంతమందిని తమ ప్రశంసను వ్యక్తపరచమని ఆహ్వానించండి.
18 నిమి: “సత్యాన్ని నేర్చుకొనటానికి ఇతరులకు సహాయపడండి.” ప్రేక్షకులతో చర్చ. రెండు లేక మూడు సలహా ఇవ్వబడిన అందింపులను ప్రదర్శించుటకు సామర్థ్యంగల ప్రచారకులను ఏర్పాటు చేయాలి. క్లుప్తంగా, సరళంగా యితరులను సమీపించుటలోగల ప్రయోజనాన్ని నొక్కి చెప్పండి.
పాట 120 (26) ముగింపు ప్రార్థన.
జూలై 11తో ప్రారంభమయ్యే వారం
పాట 115 (15)
12 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టులను, సొసైటీకి చందా పంపిన వివరాలను చదవండి. చందాలను యిచ్చినందుకు మెచ్చుకోండి. (నిర్గ. 35:29) సాయంకాలం సాక్ష్యమివ్వడం—ఇంటింటి పరిచర్యకు, పునర్దర్శనాలు చేయడానికి అది మంచి సమయమని, దానిని పరిగణించమని ప్రచారకులను ప్రోత్సహించండి.
15 నిమి: స్థానిక అవసరతలు. లేదా “అపాయం వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి,” ఫిబ్రవరి 15, 1994, కావలికోట, పేజీలు 22-5 నందు యివ్వబడిన శీర్షిక ఆధారంగా అనుభవంగల సంఘ పెద్ద ప్రసంగించే ఏర్పాటు చేయండి.
18 నిమి: “మనము తిరిగి వెళ్లనిదే వాళ్లు ఎలా వింటారు?” ప్రేక్షకులతో చర్చ. మూడు, నాలుగు పేరాల్లో ఇవ్వబడిన సలహాలను ప్రదర్శించండి. బైబిలు పఠనాలు ప్రారంభించే లక్ష్యంతో ఎందుకు పునర్దర్శనాలు చేయాలో చూపించే అదనపు వ్యాఖ్యానాలివ్వండి.
పాట 123 (63) ముగింపు ప్రార్థన.
జూలై 18తో ప్రారంభమయ్యే వారం
పాట 125 (44)
15 నిమి: స్థానిక ప్రకటనలు. వారాంతము కొరకైన ప్రాంతీయ సేవా ఏర్పాట్లు తెలియజేసి, పత్రిక అందింపులో పాల్గొనమని ప్రోత్సహించండి.
8 నిమి: ప్రశ్నా భాగము. ప్రశ్న-జవాబుల చర్చ.
22 నిమి: “ప్రభావవంతమైన వీధి సాక్ష్యమివ్వడంద్వారా ఆసక్తిగల వారిని కనుగొనుట.” సేవాధ్యక్షుడు లేదా వీధి సాక్ష్యాన్ని ప్రభావవంతంగా చేయగల సామర్థ్యం ఉన్న సంఘ పెద్ద వీధి సాక్ష్యంలో అనుభవంగల ఒకరు లేక యిద్దరు ప్రచారకులతో ఈ అంశాన్ని చర్చిస్తాడు. రెండు లేక మూడు క్లుప్తమైన అనుభవాలనుకూడ చర్చలో మిళితం చేయవచ్చు. క్రొత్త పత్రికలతో సమీపించే విధానాన్ని ప్రదర్శించండి.
పాట 134 (33) ముగింపు ప్రార్థన
జూలై 25తో ప్రారంభమయ్యే వారం
పాట 140 (77)
10 నిమి: స్థానిక ప్రకటనలు. పత్రికల క్రొత్త సంచికల అందింపును ప్రదర్శించండి. అందరిని పత్రికల అందింపునందు పాల్గొనమని ప్రోత్సహించండి.
15 నిమి: “యౌవనస్థులకు ఒక మంచి మాదిరి ఆవశ్యకము.” ప్రశ్నా-జవాబులు. మంచి మాదిరిగా ఉన్న ఒకరు లేక యిద్దరిని ఇంటర్‌వ్యూ చేయండి. వాళ్లు ఏ ఆత్మీయమైన లక్ష్యాలను వారి ముందు ఉంచుకొన్నారో వివరిస్తూ, వారి ప్రయత్నాలద్వారా పొందిన అధిక ఆశీర్వాదాలను చెప్పమని అడగండి.
20 నిమి: మన అందింపులను అధిక ఫలవంతంగా చేసుకొనుట. స్కూలు గైడుబుక్, పేజీ 99, పేరా 9 నందు యివ్వబడిన సలహాలతో కుటుంబంలో అభ్యాసాన్ని సిద్ధపర్చండి. కుటుంబంలో ఒక వ్యక్తి అందింపును ప్రదర్శిస్తే, మిగిలినవారు దానిని మెచ్చుకొని, అభివృద్ధి సాధించడానికి సలహానుకూడ యిస్తారు. మీ ప్రాంతంలో ఉన్న సాధారణ అవరోధాన్నికూడ చేర్చి, దానిని ఎలా అధికమించవచ్చో చర్చించండి.
పాట 187 (93) ముగింపు ప్రార్థన.