మన నిర్మాణకున్ని ఘనపర్చడానికి ఇతరులకు సహాయం చేయడం
1 “యెహోవా, . . . నీయొద్ద జీవపు ఊట కలదు,” అని కీర్తనల గ్రంథకర్త అనినప్పుడు ఆయన భావించిన విధంగానే మనంకూడా భావిస్తామా? (కీర్త. 36:5, 9) ఆ తర్వాత మనం, మరి యితరులు యెహోవాను గుణగ్రహించి, ఆయనను ఘనపర్చడానికి ఎలా సహాయం చేయగలం? జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి లేక లైఫ్—హౌ డిడ్ ఇట్ గెట్ హియర్? బై ఎవల్యూషన్ ఆర్ బై క్రియేషన్? అనే పుస్తకాన్ని జూన్ నెలలో అందించడం ద్వారా అలా చేయగలము. ఈ పుస్తకాలు వాస్తవంగా ఉన్నతమైనవి. దేవుడు, క్రీస్తు మన కొరకు చేసిన దాన్నిబట్టి వారిని విశ్వసించే వారి మెప్పును ఒకటి అధికం చేయగా, మరొకటి దేవుని ఉనికిని గురించి దృఢమైన సాక్ష్యాన్ని అందించి, పరిణామ క్రమం ఎందుకు సత్యం కాదో స్పష్టంగా చూపిస్తుంది. ఇవి రెండూ కూడ బైబిలు దేవుని వాక్యమనే నమ్మకాన్ని పెంచుతాయి. యేసు జీవితం, పరిచర్య ద్వారా దేవుడు బయల్పర్చబడ్డాడని, అలాగే పరిణామ క్రమం కాదుగాని సృష్టియే యెహోవా దేవునికి ఎలా ఘనతను తెస్తుందో ప్రతివారు తెలుసుకోవాలని మనం నిశ్చయంగా కోరుతాము.
2 వహాగొప్ప మనిషి పుస్తకం కొరకు సాధారణమైన, సూటియైన ఒక అందింపు ఇక్కడ ఉంది.
ఇంటివారిని అభినందించిన తరువాత మీరిలా అడగవచ్చు:
◼ “అనేకమంది నమ్ముతునట్లు మీరు కూడా యేసుక్రీస్తు ఒక చారిత్రాత్మక వ్యక్తియని, ఒక మంచి మనిషియని, నమ్ముతారా? అలాగైతే, ఆయన జీవితం, బోధలను గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని యిష్టపడతారా? యేసు ఏమి నేర్పాడు, ఏమి చేశాడు అని బైబిలు చెబుతుందో వాటిని ఈ పుస్తకం స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వివరిస్తుంది. మేము దాన్ని ప్రజలకు 40.00 రూ చందాకు యిస్తున్నాము.”
3 లేక, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్న తర్వాత, మీరిలా చెప్పవచ్చు:
◼ “యేసుక్రీస్తు ఏమి బోధించాడో బహుశా మీకు కొంత తెలిసి ఉండవచ్చు, కాని మనం యేసు జీవితం, పరిచర్య వైపు ఏకాగ్రతతో చూడాలని బైబిలు చెబుతుందని మీకు తెలుసా? [హెబ్రీయులు 12:2 చదవండి.] తండ్రిని చేరడానికి తానొక్కడే మార్గమని, అలాగే ఆయనను ఆయన తండ్రిని గురించిన కచ్చితమైన జ్ఞానము కలిగి ఉండడం ద్వారానే ఒకడు నిత్యజీవాన్ని పొందగలడని యేసు తానే చెప్పాడు గనుక, మనమలా చూడాలి. [యోహాను 14:6 లేక 17:3ను చూపండి.] మీరు జీవానిచ్చే అటువంటి జ్ఞానాన్ని పొందడానికి ఈ పుస్తకం మీకు సహాయం చేస్తుంది.
4 ఒకవేళ “క్రియేషన్” పుస్తకాన్ని అందిస్తున్నట్లైతే, మీరిలా చెప్పగలరు:
◼ “మన పూర్వికుల్లో మొదటివారు ఎలా ఉండి ఉంటారని మీరు భావిస్తున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] వారు ఈ ‘కోతిమనిషిలా’ వుండి ఉండవచ్చా? [క్రియేషన్ పుస్తకంలోని 83వ పేజిని తెరవండి.] అపొ. 17:26లో బైబిలేమని చెబుతుందో గమనించండి. [చదవండి.] కాబట్టి, ‘కోతిమనిషి’ చిత్రపటాలు దేనిమీద ఆధారపడి ఉన్నాయి?” దానిలో 89వ పేజిలోని చిత్ర పటం క్రిందనున్న క్యాప్షన్ వైపు అవధానాన్ని మళ్లించండి. ఆ పుస్తకాన్ని చదివి, ఈ ప్రశ్నకు జవాబు కనుగొనడం ద్వారా ఇంటి యజమాని ప్రయోజనం పొందవచ్చని అతనికి చెప్పండి.
5 “క్రియేషన్” పుస్తకం కవరును చూపించి యిలా చెప్పడం ద్వారా మరొక అందింపును ప్రయత్నించవచ్చు:
◼ “మనిషి ఉనికిలోకి పరిణామ క్రమం ద్వారా వచ్చాడా లేక సృష్టి ద్వారా వచ్చాడా?, అని మేము మా ఇరుగుపొరుగు వారిని నేడు అడుగుతున్నాము. మీరేమని భావిస్తారు? [జవాబు చెప్పనివ్వండి.] ఉన్నత విద్యను అభ్యసించిన అనేకులు పరిణామ క్రమాన్ని ఒక వాస్తవమని అంగీకరించినా, ఉన్నత విద్యను అభ్యసించినవారిలోనే ఇతరులు మాత్రం దాన్ని నమ్మరు. ఒక మునుపటి వ్యోమగామి నిర్థారించినది గమనించండి. [122-3 పేజీల్లోని విషయాలను ఉన్నతపర్చండి.] మనం పరిణామ క్రమాన్నా లేక సృష్టినా—దేన్ని విశ్వసించాలనేదాన్ని చూడడానికి మనం సాక్ష్యాలను వ్యక్తిగతంగా పరిశీలించాలి.” ఒకవేళ ఇంటి యజమాని పుస్తకాన్ని అంగీకరిస్తే, మీరు మళ్లీ వెళ్లినప్పుడు జవాబివ్వగల ప్రశ్నను ఒకదాన్ని వేయండి.
6 మన సృష్టికర్తను గురించి, తన సృష్టిపట్ల ఆయన కలిగివున్న ప్రేమపూర్వక సంకల్పాలను గురించిన అద్భుతమైన సత్యాలను ఇతరులు తెలుసుకోడానికి వారికి సహాయం చేయాలని మీరు ఎక్కువ యిష్టపడుతున్నారా? అలా చేయడానికి మహాగొప్ప మనిషి, క్రియేషన్ పుస్తకాలు మీకు సహాయం చేయగలవు. ఆయన కార్యాలను ఉన్నతపర్చడం ద్వారా, క్రీస్తు రాజ్యం ద్వారా తన నామాన్ని పరిశుద్ధపరచి, మానవజాతిని ఆశీర్వదించాలనే తన అద్భుతమైన సంకల్పాలను తెలియజేయడం ద్వారా అవి మన గొప్ప సృష్టికర్త, సర్వాధికారి అయిన ప్రభువగు యెహోవాను ఘనపరుస్తాయి.