మానవజాతి సృష్టికర్తయందు విశ్వాసాన్ని నిర్మించుట
1 జీవం ప్రారంభాన్ని, అర్థాన్ని గురించి అనేకమంది ప్రజలు ఏదో ఒక ముగింపుకు వచ్చారు. అయితే బాధాకరంగా, పరిణామ క్రమమే జవాబని అంగీకరించడానికి అనేకులు తప్పుగా ప్రభావితం చేయబడ్డారు. ఈ విషయాన్ని గురించిన రెండు వైపులను కూలంకషంగా పరిశీలించి, బైబిలును సమర్థించే గణనీయమైన రుజువులను క్రియేషన్ పుస్తకం అందిస్తుంది. వినడానికి యిష్టత కనపర్చిన యథార్థమైన ప్రజలకు మనమెలా సహాయం చేయగలం? పునర్దర్శనాలను చేయడం ద్వారా చేయగలం. మనం మరలా వెళ్లినప్పుడు, మన సృష్టికర్తగా యెహోవా యందు విశ్వాసాన్ని నిర్మించేటట్లు చెప్పగల ఏదైనా ఒక విషయాన్ని మన మనస్సులో నిర్దిష్టంగా కలిగి ఉండడం ఎల్లప్పుడు మంచిది.
2 ఒకవేళ ఆ వ్యక్తి బైబిలులో విశ్వాసాన్ని కనబరిస్తే, మీ సంభాషణను ప్రారంభించడానికి ఈ విధంగా మాట్లాడడం ప్రభావవంతంగా ఉండగలదు:
◼ “విశ్వం యొక్క ఆరంభాన్ని గురించి యెషయా 45:18 ఒక శక్తివంతమైన వ్యాఖ్యానం చేస్తుంది; దాన్ని గురించి మీరేమని భావిస్తారో నేను తెలుసుకొనగోరుతున్నాను. [చదివి, వ్యాఖ్యానించనివ్వండి.] ఆకాశానికి, భూమికి సృష్టికర్త తానేనని యెహోవా తనను తాను తెలియజేసుకుంటున్నాడు. ఈ భూమిపై ఉన్న జీవం విషయమేంటి? దాన్ని గురించి కూడ యెషయా 42:5 ఆయనకే ఘనతను ఆపాదిస్తుంది. [చదవండి.] ఒకవేళ బైబిలు చెబుతున్నది సత్యమైతే, పరిణామ క్రమం తప్పక అబద్ధమైయుండాలి. బైబిలును మీరు నమ్మగలరని భావిస్తున్నారా?” క్రియేషన్ పుస్తకంలోని 17వ అధ్యాయాన్ని తెరచి, యెహోవాను సృష్టికర్తయని నమ్మడానికి ఇతర కారణాలను చూపించండి.
3 మీరు మీ సంభాషణను ఈ విధంగా ప్రారంభించవచ్చు:
◼ “నేను క్రితంసారి దర్శించినప్పుడు, మానవుని యొక్క, భూమి యొక్క భవిష్యత్తేమిటి? అనే ప్రశ్న లేవదీయబడింది. నేను మీ వద్ద వదిలి వెళ్లిన పుస్తకం ఆ ప్రశ్నకు ఎలా సమాధానమిస్తుందో గమనించండి.” క్రియేషన్ పుస్తకంలోని 234-5 పేజీలను తెరచి, 6, 7 పేరాలను చదవమని అతన్ని ప్రోత్సహించండి. ఒకవేళ ఇంకా ఎక్కువ ఆసక్తి కనపరిస్తే, మీరిలా అడగవచ్చు: “ఈ భూమిపై ఎలాంటి ఆకస్మిక మార్పులు వస్తాయని మీరు భావిస్తున్నారు?” సరైనట్లు తోచితే ఈ విషయాన్ని ఆ సమయంలోనే చర్చించవచ్చు లేక క్రియేషన్ పుస్తకంలోని అదే అధ్యాయంలోని తదుపరి పేరాను మీ తరువాతి దర్శనంలో చర్చించడానికి ఏర్పాటు చేసుకోవచ్చు.
4 ఒకవేళ ఇంటి యజమాని “మహాగొప్ప మనిషి” పుస్తకాన్ని తీసుకొని వున్నట్లైతే మీరిలా అడగవచ్చు:
◼ “అనేకమంది వారు వెదుకుతున్న ఆనందాన్ని పొందలేకపోతున్నారని మీరు గమనించారా? సంతోషాన్ని ఎలా కనుగొనాలో యేసుక్రీస్తు తన బోధల ద్వారా నేర్పించటమే గాక, అలా సరైనది చేయడం వలన కలిగే ఆనందాన్ని తన జీవితంలో ప్రతిబింబించాడు.” మత్తయి 5:3-12లో చెప్పబడిన ‘ధన్యతల’ వైపు అవధానాన్ని మళ్లించండి, అందులోనివి కొన్ని మహాగొప్ప మనిషి పుస్తకంలోని 35వ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి తన ఆత్మీయ అవసరతలందు శ్రద్ధ కలిగి ఉండడం ఎలా సంతోషాన్ని తెస్తుందో చూపించండి, ఈ అవసరతను తీర్చడానికి గృహ బైబిలు పఠనాన్ని కలిగి ఉండడం ఒక మంచి మెట్టు ఎలాగో వివరించండి.
5 ఈ విధంగా చెప్పడం ద్వారా కూడా మీరు మరొక విధంగా పునర్దర్శనాన్ని ప్రారంభించవచ్చు:
◼ “చెడుతనము, దుష్టత్వంవలన మానవజాతి చాలా బాధను, దుఃఖాన్ని అనుభవించింది. అయితే ఈ భూమికి సృష్టికర్తయైన యెహోవా ఈ పరిస్థితులు అంతమవుతాయని వాగ్దానం చేశాడు. [133వ అధ్యాయాన్ని తెరిచి, సామెతలు 2:21, 22 చదవండి.] యేసు మాదిరి, బోధల ద్వారా యెహోవా నేర్పిన వాటిని నేర్చుకుని, లోబడేవారు అద్భుతమైన ఆశీర్వాదాలను పొందడానికి ఎదురుచూడగలరు.” అటువంటి నిరీక్షణ కొరకు మనకు దృఢమైన ఆధారం ఎలా ఉందో, 25, 26, 37, 44, 46, 47, 52, 58, 70 అధ్యాయాల్లో చెప్పబడిన ఒకటి లేక రెండు అద్భుతాలవైపు అవధానాన్ని మళ్లించడం ద్వారా చూపండి.
6 పునర్దర్శనాల కొరకు ప్రత్యేక సమయాన్ని నియమించుకోవడం మంచిదని అనుభవంగల ప్రచారకులు తెలుసుకున్నారు. ఈ పని కొరకు కచ్చితమైన ఏర్పాట్లను కలిగి ఉండడం, ఆసక్తిని కనపర్చిన వ్యక్తుల దగ్గరికి క్రమంగా వెళ్లడానికి సహాయం చేస్తుంది. మీకు, మీ ప్రాంతానికి తగిన మంచి సమయాన్ని నిర్ణయించుకోండి. ఈ పనిలో మీరు క్రమంగా పాల్గొనడం ద్వారా, “శిష్యులనుగా” చేయాలన్న ఆజ్ఞను నెరవేర్చడంలో మీరు ఆనందాన్ని కనుగొంటారు.”—మత్త. 28:19, 20.