యెహోవా మన సృష్టికర్త
1 జీవాన్ని దేవుడు సృజించాడని లక్షలాది మంది ప్రజలు నమ్ముతారు. ఇతరులనేకులు పరిణామాన్ని నమ్ముతారు. దేనిని నమ్మాలో తెలియక కొందరు తికమకపడుతున్నారు. జీవం—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టిద్వారానా? అనే (ఆంగ్లం) పుస్తకం ఇలాంటి ప్రజలందరి కొరకే. ఇక్కడికి జీవమెలా వచ్చింది, మన భవిష్యత్తును గూర్చిన దీని భావమేమిటనే దాన్ని గూర్చి బాగా పరిశోధించి తెలుసుకున్న వివరణను ఈ ప్రచురణ అందిస్తుంది. జూన్ నెలలో మనం సాధ్యమైనప్పుడెల్లా ఈ పుస్తకాన్ని అందిస్తాము. గృహస్థునికి ఆంగ్లం తెలియని చోట, వేరే 192 పేజీల ఏ క్రొత్త పుస్తకాన్నైనా అందించాలి.
2 విజ్ఞానశాస్త్ర సమాజంలో ప్రముఖులు కూడా ఈ పుస్తకం యొక్క సహేతుకతను గుర్తించారు. నెదర్లాండ్స్‌లోని ఒక విజ్ఞానశాస్త్ర పరిశోధకుడు ఈ విధంగా వ్రాశాడు: “ఈ పుస్తకం నిజంగానే అన్ని అంచనాలను మించిపోయింది. అధ్యాయాల మరియు చిత్రాల సహేతుకమైన అమరిక విజ్ఞానశాస్త్రపరంగా ఎంత కాలానుగుణంగా ఉందంటే మీరు దానికి ఏ అభ్యంతరాలు చెప్పలేరు.” ఒక న్యాయవాది ఈ విధంగా ప్రకటించాడు: “నేను దీనిని నాలుగు సార్లు చదివాను, అయినప్పటికీ, దాని పరిశోధనతో, పాండిత్యంతో మరియు దాని రచనలో ఆధారంగా తీసుకొనబడిన రుజువులతోను ఇంకా ఆకర్షణీయంగానే ఉంది.” కాబట్టి ఇతరులు కూడా ఈ పుస్తకాన్ని మెచ్చుకుంటారని మనం నమ్మకం కలిగి ఉండగలము.
3 మీరీ విధమైన ఒక క్లుప్త అందింపును తయారు చేయాలని తీర్మానించుకోవచ్చు:
◼ ఆరవ పేజీ తెరిచి ఈ విధంగా చెప్పండి: “మన అందమైన భూమి మరియు దానిపై ఉన్న జీవము అకస్మాత్తుగా వచ్చాయని అనేకమంది ప్రజలు అనుకుంటారు. ఇదంతా ఎలా వచ్చిందనే దానికి ఏది సహేతుకమైన వివరణయని మీరనుకుంటారు? [జవాబు చెప్పనివ్వండి.] సృష్టికర్త శక్తిమంతుడు మాత్రమే కాదు గాని, మనల్ని ఎంతో ప్రేమిస్తాడు కూడా అని చెప్పే బైబిలు వృత్తాంతాన్ని అనేక రుజువులు ధృవీకరిస్తున్నాయి. ఆయన పేరు యెహోవా అని బైబిలు చెబుతుంది.” కీర్తన 83:18 చదివి, భూమియంతటిని పరదైసుగా మార్చాలనే ఆయన సంకల్పం ఎలాంటిదో క్లుప్తంగా వివరించండి.
4 మీరు త్వరగా ముఖ్యాంశానికి రావాలనుకుంటే, మీరు ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “ఈ ప్రశ్నను గూర్చి మీరెప్పుడైనా ఆలోచించారా?” పుస్తకం పేరును చూపి, ఏడవ పేజీకి త్రిప్పి, రెండవ పేరాలోని ప్రశ్నలను చదివి, ఈ పుస్తకం బైబిలు నుండి సంతృప్తికరమైన జవాబులనిస్తుందని వివరించండి.
5 మీరు ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నించవచ్చు:
◼ “భూమి ఉనికిలోకి ఎలా వచ్చిందని మీరెన్నడైనా ఆలోచించారా? ఇది ఓ పెద్ద విశ్వ విస్ఫోట ఫలితమేనని చాలా మంది వాదిస్తారు. మీరేమనుకుంటారు? [జవాబు చెప్పనివ్వండి.] దేవుడు భూమిని మన శాశ్వత గృహంగా సృజించాడని బైబిలు బోధిస్తుంది. అది మన సౌరమండల వ్యవస్థలోని ఇతర గ్రహాల నుండి భిన్నమైనది. మనకు తెలిసినంత వరకు, విశ్వంలో భూమి మీద మాత్రమే ప్రాణాలను నిలబెట్టేందుకు అవసరమైన సంకీర్ణమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి.” పేజీ 130 లోని 5వ పేరాకు త్రిప్పి, భూమి గొప్ప నిర్మాణకుని పనే ఎందుకై ఉండవచ్చునో వివరించండి.
6 మరొక విధానం ఇలాంటిదేదైనా అయి ఉండవచ్చు:
◼ “మనం ఏప్-మెన్ నుండి పరిణామం చెందామని కొందరనుకుంటారు. మన పూర్వికులు ఇలాగే ఉండేవారని వారు వాదిస్తారు. [పేజీ 89లోని చిత్రాన్ని చూపించండి.] దాన్ని గూర్చి మీరు ఏమనుకుంటున్నారు?” జవాబు చెప్పనివ్వండి. పేరా 20లో చెప్పబడిన దానిని చూపించి, యెహోవా మన సృష్టికర్తయని, జీవదాతయని సూచిస్తున్న అపొస్తలుల కార్యములు 4:24 చదవండి. “బైబిలులో చెప్పబడినదానికి అనుబంధంగా పరిణామ సిద్ధాంతాన్నంతటినీ ఈ పుస్తకం పరిశీలిస్తుంది.” పేజీ 5లోని విషయ సూచికను చూపించి, 1, 7, 15 మరియు 19 వంటి కొన్ని అధ్యాయాల శీర్షికలను సూచించండి.
7 యెహోవాయందు గాని లేక ఆయన వాక్యమునందు గాని విశ్వాసములేని వారి చేత మోసగించబడిన చిత్తశుద్ధి గల ప్రజలకు ఈ పుస్తకం ఆశీర్వాదకరం కాగలదు. మనపై ప్రేమపూర్వకంగా శ్రద్ధ చూపించే సృష్టికర్తయెడల మెప్పుకలిగి ఉండడంలో అలాంటివారు ఎదగడానికి సృష్టి అనే ఈ పుస్తకంలోని వాస్తవిక సమాచారం సహాయపడుతుంది.