దైవపరిపాలనా వార్తలు
అంగోలా: డిశంబరు నెలలో యింతకు ముందటి శిఖరాగ్ర సంఖ్యకన్నా మొత్తం పత్రికల అందింపు 10,000కంటే ఎక్కువగా పెరిగింది. మొత్తం 21,965 మంది ప్రచారకులు 60,691 బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నారు.
ఈక్వటోరియల్ గినియా: డిశంబరు నెలలో ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమానికి 219 మంది ప్రచారకులు హాజరయ్యారు. శిఖరాగ్ర సంఖ్యగా 521 మంది హాజరు కాగా, ఏడుగురు బాప్తిస్మం తీసుకున్నారు.
గ్వాటిమాల: డిశంబరు నెలలోని “దైవిక బోధ” జిల్లా సమావేశాల పరంపరలో 32,911 మంది హాజరు కావడం చూసి అందలి 13,243 మంది ప్రచారకులు సంతోషించారు. ఆ సమావేశాల్లో 597 మంది బాప్తిస్మం తీసుకున్నారు.
లాట్వియా: లాట్వియాలోని పని మరింతగా ముందుకు కొనసాగుతుంది. గత డిశంబరులో శిఖరాగ్ర సంఖ్యగా 577 మంది ప్రచారకులు రిపోర్టు చేశారు. మొత్తం 1,816 గృహ బైబిలు పఠనాలు నిర్వహించబడ్డాయి, సంఘ ప్రచారకులు సగటున 20.5 పత్రికలు పంచిపెట్టారు.