సత్యాన్ని పంచుకోడానికి పత్రికలను ఉపయోగించండి
1 అతిశయోక్తిగా ఉండే ప్రకటనల వలన, తప్పుదోవ పట్టించే రాజకీయ వాగ్దానాల వలన, మోసపూరితమైన అంతర్జాతీయ ప్రతిజ్ఞలవలన నేటి సమాజంలో సత్యసంధమైన, యథార్థమైన సమాచార విలువ నిర్లక్ష్యం చేయబడింది. కావలికోట, తేజరిల్లు! మాత్రమే దేవుని రాజ్య సత్యాన్ని ప్రకటించి, అది తెచ్చే నిత్య ఆశీర్వాదాలను అనుభవించడానికి అందరూ ఏమి చేయాలో విశదపరుస్తూ సాటిలేనివిగా ఉన్నాయి.
2 ఒక దేశంలోని సమాచార శాఖా అధికారి యీ రెండు పత్రికల విలువను గుణగ్రహించి, వాటిని పంచిపెట్టుటకై అనుమతి పొందడానికి వెంటనే సహాయం చేశాడు. “కావలికోట శ్రేష్ఠమైన పత్రికల్లో ఒకటని నేను పరిగణిస్తున్నాను; సహాయం చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను,” అని ఆయన అన్నాడు. జీవాన్నిచ్చే జ్ఞానాన్ని అందించగల ఈ పత్రికలను పంచిపెడుతూ యితరులకు సహాయం చేయడం మన ఆధిక్యత. (యోహాను 17:3) మే నెలలో మీరు యీ పత్రికలను ఎలా అందిస్తారు, వాటికొరకు చందాలను ఎలా సేకరిస్తారు? బహుశ, యీ క్రింది సలహాలు సహాయపడతాయి.
3 మీరు మే 15, “కావలికోట”లోని మొదటి శీర్షికలను చూపిస్తున్నట్లయితే మీరిలా చెప్పవచ్చు:
◼ “మేము ప్రపంచంలో అత్యధికంగా అమ్మబడుతున్న పుస్తకాన్ని గూర్చి ప్రజలతో మాట్లాడుతున్నాం. అది ఏదో మీకు తెలుసా? [జవాబు చెప్పనివ్వండి.] మేము బైబిలును గూర్చి మాట్లాడుతున్నాం. అంతమంది ప్రజలు బైబిలు కొన్నందుకు, ఎంతో మంచి కారణం ఉండి ఉంటుంది. 2 తిమోతి 3:16లో ఆ కారణం కనిపిస్తుంది.” లేఖనాన్ని చదివిన తర్వాత, శీర్షికల్లో ఒకదానిలోని యుక్తమైన అంశాలను ఉన్నతపర్చండి.
4 లేదా చిన్న ఉపోద్ఘాతం తర్వాత, మీరీ విధంగా కూడా చెప్పవచ్చు:
◼ “ఇటీవల సంవత్సరాల్లో ప్రపంచమంతటా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను గూర్చిన ఆందోళన పెరుగుతుండడాన్ని బహుశ, మీరు గమనించి ఉంటారు. మీ ప్రాంతంలో పిల్లలకు సంబంధించిన, మీకు వ్యధకలిగించే ఏ సమస్యలను మీరు చూస్తున్నారు?” జవాబు చెప్పనివ్వండి. మే 8 తేజరిల్లు! లోని మొదటి శీర్షికల్లో చర్చించబడిన ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఎదుర్కొంటున్న గంభీరమైన సమస్యల్లో కొన్నింటిని సూచించండి. (పక్ష పత్రికల సంచికలు; మాసపత్రికల సంచికలను యిచ్చేటప్పుడు మాదక ద్రవ్యాలకు దాసులు కావడం వలన వచ్చే సమస్యను పేర్కొనండి) దేవుని రాజ్యం వాగ్దానం చేసిన పరిష్కారం వైపు అవధానాన్ని మళ్ళించండి.
5 మీ పునర్దర్శనాల రికార్డులో, మొదట్లో కొంత ఆసక్తి కనబరచి, తర్వాత అంతగా ఫలితం చూపని వారి పట్టిక ఉండవచ్చు. ఏదో కొద్దిగానే ప్రతిస్పందించినందువల్ల తిరిగి వెళ్తూ ఉండవలసిన అవసరం ఉందని మీరు భావించి ఉండకపోవచ్చు. కాని మ్యాగజిన్ రూట్‌ను ఏర్పాటు చేసుకోడానికి మీరు యీ పట్టికను ఉపయోగించవచ్చు. మీరు ఏదైనా ఒక శీర్షికను చదివినప్పుడు అది ఏదైనా ఒక వ్యక్తిని ఆకర్షిస్తుందని మీరు భావిస్తే, ఆ వ్యక్తిని తప్పకుండా దర్శించి, ఆ పత్రికను అందజేయండి.
6 తటస్థ సాక్ష్యం: పత్రికల్లో ఆసక్తిని రేకెత్తించడానికి యిది అత్యుత్తమ మార్గం. సంభాషణ ఆరంభించడానికి కంటినాకర్షించే మొదటి పేజీలను వివేచనతో ప్రదర్శిస్తే సరిపోతుంది. తన తోటి ఉద్యోగస్థులు అటు వెళ్తుండగా వారికి కన్పించే విధంగా ఒక సహోదరి కొన్ని సంచికలను తన బల్ల మీద ఉంచింది; ఆమె మరిన్ని పత్రికలను పంచిపెట్టగలిగింది. సరుకులు కొనడానికి వెళ్తున్నప్పుడు, పాఠశాలకు వెళ్ళేటప్పుడు, బస్సులో వెళ్తునప్పుడు, లేదా వేరే ఎక్కడైనా యితరులతో వ్యవహరించేటప్పుడు కొన్ని ప్రతులను మీ వెంట తీసుకు వెళ్ళి, యీ నెలలో వాటిని అందించడానికి మీరు చొరవ తీసుకోండి.
7 కావలికోట, తేజరిల్లు! సహాయంతో యెహోవాను గూర్చి, ఆయన ఆరాధనను గూర్చిన ముఖ్యమైన ప్రశ్నలకు మనం జవాబులు కనుగొన్నాం. “యెహోవా సత్య దేవుడు” అని యితరులు తెలుసుకొనేలా సహాయపడేందుకు సాధ్యమయ్యే ప్రతి అవకాశంలోను యీ పత్రికలను ఉపయోగించాలని మనం ఆశిస్తాము.—కీర్త. 31:5.