కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/94 పేజీ 2
  • మే కొరకైన సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే కొరకైన సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1994
  • ఉపశీర్షికలు
  • మే 2తో ప్రారంభమయ్యే వారం
  • మే 9తో ప్రారంభమయ్యే వారం
  • మే 16తో ప్రారంభమయ్యే వారం
  • మే 23తో ప్రారంభమయ్యే వారం
  • మే 30తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1994
km 5/94 పేజీ 2

మే కొరకైన సేవా కూటాలు

మే 2తో ప్రారంభమయ్యే వారం

పాట 20 (74)

5 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్య నుండి యుక్తమైన ప్రకటనలు. ప్రాంతీయ పరిచర్య కార్యక్రమాన్ని విస్తృతపరచడానికి, వీధి సాక్ష్యం, లేక సాయంకాల సాక్ష్యం వంటి ఏర్పాట్లు ఏమైనా ఉంటే పునఃసమీక్షించండి.

15 నిమి: “వేసవిలో దైవపరిపాలనా పనులను వెంబడిస్తూ ఉండండి.” ప్రశ్నా జవాబులు. సహాయ పయినీరింగ్‌ చేసినప్పుడు లేదా తటస్థ సాక్ష్యమిచ్చినప్పుడు సంతోషం అనుభవించిన కొందరి అనుభవాలను చెప్పండి.

10 నిమి: “నేను మారుతూ ఉండవలసిన అవసరముందా?” ఇద్దరు పెద్దల మధ్య చర్చ. ప్రాంతీయ పరిచర్యలో క్రమంగా పాల్గొనడం వలన కలిగే ప్రయోజనాలను నొక్కిచెప్పండి.

15 నిమి: “సత్యాన్ని పంచుకోడానికి పత్రికలను ఉపయోగించండి.” ప్రేక్షకులతో చర్చించండి. మన పత్రికలను ప్రత్యేకమైనవిగా చేసేదేమిటో మనకు లభించే ప్రతి అవకాశంలోను వాటిని అందించడానికది మనల్నెందుకు పురికొల్పాలో వివరించండి. రెండు క్లుప్త ప్రదర్శనలను ఏర్పాటు చేయండి.

పాట 128 (89), ముగింపు ప్రార్థన.

మే 9తో ప్రారంభమయ్యే వారం

పాట 214 (82)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఇంటింటి పనిలో వాటిని అందించేటప్పుడు, అన్ని అవకాశాల్లోను చందాలు పొందడానికి మెలకువగా ఉండాలి. సబ్‌స్క్రిప్షన్‌ స్లిప్‌లను మూడింటిని ఎలా నింపాలో వివరించండి.

20 నిమి: “బైబిలు విద్యార్థులను పరిచర్యకు సిద్ధం చేయండి.” ప్రశ్నలు, జవాబులు. ఇండ్లవద్ద సాక్ష్యమిచ్చేలా సిద్ధపడడానికి విద్యార్థికి ఎలా సహాయం చేయాలో చూపిస్తూ, 4, 5 పేరాలతో క్లుప్త ప్రదర్శన ఉండాలి. విద్యార్థి కీర్తన 37:11ను ఉపయోగిస్తూ సాధారణంగా చెప్పనారంభిస్తాడు. బైబిలు పఠన నిర్వాహకుడు “నాకు నా స్వంత మతముంది” అని అంటూ, అభ్యంతరం తెలుపుతాడు. ఏం చెప్పాలో విద్యార్థికి తెలియదు. ఇద్దరు కలిసి రీజనింగ్‌ పుస్తకంలోని 18-19 పేజీలు తెరిచి అక్కడ చెప్పబడిన జవాబులను పునఃసమీక్షిస్తారు. విద్యార్థికి సులభంగా అనిపించే ఒకదానిని తీసుకుంటాడు. విద్యార్థి తిరిగి ఆరంభిస్తాడు, మంచి స్పందన కనిపిస్తుంది. మంచి ఫలితాలతో ప్రోత్సహించబడినట్లు భావిస్తాడు.

15 నిమి: కొత్త ఇయర్‌ బుక్‌ను కుటుంబం ఉపయోగించుట. కుటుంబ యజమాని 1994 ఇయర్‌ బుక్‌లోని 33వ పేజీలోని ప్రారంభ అంశాన్ని పురికొల్పేవిధంగా పునఃసమీక్షించడంలో కుటుంబాన్ని నడుపుతాడు. ప్రతి వారం ఇయర్‌ బుక్‌లోని కొన్ని పేజీలను కుటుంబం చదవడం కొరకైన ఏర్పాట్లను తెలుపుతూ ముగిస్తాడు.

పాట 139 (74), ముగింపు ప్రార్థన.

మే 16తో ప్రారంభమయ్యే వారం

పాట 173 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్సు రిపోర్టులను, ఏవైనా చందా వివరాలు ఉంటే వాటిని చదవండి. ప్రస్తుతం ఉన్న తాజా పత్రికలనుండి మాట్లాడే అంశాలను పేర్కొనండి.

17 నిమి: “మీకు ఆసక్తి కనిపించిన చోటికి తిరిగి వెళ్ళండి.” ప్రశ్నలు, జవాబులు. సూచించబడిన విధంగా క్లుప్త ప్రసంగాలను ఉపయోగిస్తూ ఒకటో రెండో ప్రదర్శనలు చూపండి.

18 నిమి: “దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి పూర్తి ప్రయోజనం పొందుట.” ప్రసంగం, ప్రేక్షకులతో పాఠశాల అధ్యక్షుని చర్చ. నియామకాలను అంగీకరించి, వాటిని నిర్వహించాలని అందరినీ ప్రోత్సహించండి. వారపు బైబిలు పఠన భాగాన్ని క్రమం తప్పక చదవవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి. విద్యార్థులకిచ్చే ఉపదేశం నుండి సంఘమంతా ఎలా ప్రయోజనం పొందవచ్చో వివరించండి.

పాట 53 (27), ముగింపు ప్రార్థన.

మే 23తో ప్రారంభమయ్యే వారం

పాట 192 (103)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఇటీవలి పత్రికల్లోని ముఖ్యమైన శీర్షికలను పునఃసమీక్షించి, ఒకటో రెండో క్లుప్తమైన ప్రదర్శనలను ఏర్పాటు చేయండి. వారాంతంలో ప్రాంతీయ పరిచర్య కొరకైన ఏర్పాట్లను తెలియజేయండి.

20 నిమి: ఫిబ్రవరి 1, 1994, కావలికోట 25-9 పేజీల (పక్షపత్రిక సంచికలు) ఆధారంగా “సలహా ఇచ్చేటప్పుడు మీరు ఇతరులను గౌరవిస్తారా?” అనే ప్రసంగాన్ని పెద్ద యిస్తాడు.

15 నిమి: పందొమ్మిది వందల తొంభైనాలుగు ఇయర్‌ బుక్‌ నుండి ప్రయోజనం. పందొమ్మిది వందల తొంభైనాలుగు ఇయర్‌ బుక్‌, 10-18 పేజీల్లోని సమాచారంపై శ్రద్ధ మళ్ళిస్తూ, పెద్ద మరియు పరిచారకుడు దైవపరిపాలనా సంస్థయెడల మెప్పును కలిగించడానికి ఉపయోగపడే ప్రోత్సాహకరమైన అంశాలను చర్చిస్తారు.

పాట 19 (111), ముగింపు ప్రార్థన.

మే 30తో ప్రారంభమయ్యే వారం

పాట 204 (109)

10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు.

15 నిమి: జూన్‌ నెలలో అందించే పుస్తకాలను పునఃసమీక్షించండి: జీవించిన వారిలోకెల్లా మహా గొప్ప మనిషి లేదా లైఫ్‌—హౌ డిడ్‌ యిట్‌ గెట్‌ హియర్‌? బై ఎవల్యూషన్‌, ఆర్‌ బై క్రియేషన్‌? ఈ రెండు పుస్తకాల్లోని ఆకర్షణీయమైన చిత్రాలవైపు శ్రద్ధ మళ్ళించండి. ఉదాహరణకు, క్రియేషన్‌ పుస్తకంలోని 6, 236, 245 పేజీలు. ప్రకటన 21:4ను ఉపయోగిస్తూ ఆ చిత్రాల ఆధారంగా సామర్థ్యమున్న ఒక ప్రచారకుడు క్లుప్తమైన ప్రదర్శననివ్వాలి. రాబోయే వారం కొరకైన ప్రాంతీయ పరిచర్య ఏర్పాట్లను గూర్చి తెలపండి.

20 నిమి: స్థానిక అవసరాలు లేదా ఏప్రిల్‌ 15, కావలికోటలోని (పక్ష-పత్రికల సంచికలు) 19వ పేజీలోని “ఇది నిజంగా దొంగతనమేనా?” అనే శీర్షిక ఆధారంగా అర్హతగల పెద్ద ప్రసంగమివ్వాలి. అదే శీర్షిక మాసపత్రికల్లో ఏప్రిల్‌ 1వ సంచికలోని 31వ పేజీలో వచ్చింది.

పాట 12 (52), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి