దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి పూర్తి ప్రయోజనం పొందుట
1 మనం బైబిలు సత్యాలను యితరులకు ఫలవంతమైన రీతిలో తెలిపేలా “బోధనా కళలో“ మనకు తర్ఫీదివ్వడానికి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ఉపకరణంగా ఉంటూవచ్చింది. (2 తిమో. 4:2, NW) మనం ప్రతివారం విభిన్న బైబిలు అంశాలను గూర్చిన విలువైన పరిజ్ఞానాన్ని పొందుతాం. ఈ పాఠశాల యిచ్చే ముఖ్య ఉపదేశం నుండి మనం పూర్తి ప్రయోజనాన్ని పొందుతున్నామని మనమెలా రూఢి చేసుకోగలం?
2 ఆ కూటంలో పాఠశాల అధ్యక్షుడు తన ప్రారంభ వ్యాఖ్యానాల్లో మీరు నేర్చుకోగల ఆసక్తికరమైన అంశాల్లో కొన్నింటిని ఉన్నతపరుస్తుండగా వాటిని శ్రద్ధగా వినండి. ఆయన లేవదీసే ఏవైనా ప్రశ్నలను గూర్చి, మీ పరిచర్యలో వాటి జవాబులను ఎలా అన్వయించాలన్న విషయాన్ని గూర్చి తలంచండి.
3 ఉపదేశ ప్రసంగం అంటే కేవలం ముద్రించబడిన సమాచారాన్ని పునఃసమీక్షించడం కాదు. అది సమాచారం యొక్క ఆచరణాత్మక విలువను గూర్చి, అది మీకు వ్యక్తిగతంగా ఎలా ప్రయోజనం చేయగలదన్న దాని గూర్చి స్పష్టపరుస్తుంది. దానిని ముందుగా సిద్ధపడడం, ముఖ్య అంశాలపై మరింత శ్రద్ధ కేంద్రీకరించడానికి, ఆ తరువాత జరిగే మౌఖిక పునఃసమీక్షలో పాల్గొనడానికి మీకు తోడ్పడుతుంది.
4 క్రమంగా వారపు బైబిలు పఠనం చేయడం దేవుని వాక్యం యెడల మీ మెప్పును వృద్ధిచేయగలదు. అదనపు పరిశోధన, సత్యాన్ని గూర్చిన మీ వివేచనను వృద్ధి చేసే కొత్త మరియు ఆసక్తికరమైన వివరాల క్రమాన్ని తెలియజేస్తుంది. బైబిలు ఉన్నతాంశాల వివరణ అంటే బైబిలు వృత్తాంతాన్ని తిరిగి చెప్పడం మాత్రమే కాదు. మొత్తం మీద క్లుప్తంగా పునఃసమీక్షించిన తర్వాత, ప్రసంగీకుడు నియమించబడిన భాగం నుండి విశేషమైన అంశాలను ఉన్నతపరిచి, అవి మన జీవితాలకు, ఆరాధనకు ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూపిస్తాడు. బైబిలు ఉపదేశాలను మీరు ఎంత చక్కగా అన్వయించవచ్చో నేర్చుకోగల్గేలా శ్రద్ధగా వినేవారై ఉండండి.—కీర్త. 119:105.
5 మీకొక విద్యార్థి ప్రసంగం నియమించబడినట్లయితే, మీరు ప్రస్తుతం కృషి చేస్తున్న సలహా అంశాన్ని పరిశీలించండి. స్కూల్ గైడ్ బుక్‌లో యివ్వబడిన ఆ ప్రసంగ లక్షణాన్ని గూర్చిన సలహాలను చదివి, వాటిని అన్వయించడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రసంగానికి విషయాన్ని ఎన్నిక చేసుకునేటప్పుడు, ప్రాంతీయ సేవకు సరిపడే ఆచరణాత్మకమైన అంశాలను నొక్కి చెప్పడానికి ప్రయత్నం చేయండి.—ఎస్.జి. పేజీ 96-9.
6 మీరు ప్రసంగం నెం. 3, లేదా నెం. 4 నియమించబడిన సహోదరి అయితే అంశాన్ని వాస్తవమైన విధంలో వివరించడానికి ప్రయత్నం చేయాలి. మీరు చెప్పే ప్రతిదానితోను గృహస్థురాలు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు; అందులోని ప్రాథమిక బైబిలు సూత్రాలను గూర్చి తర్కించడానికి ఆ వ్యక్తికి ఎలా సహాయం చేస్తారో చూపించడానికి ప్రయత్నం చేయండి. (ఎస్.జి. పేజి 153-8) ప్రాంతీయ సేవలో యిలాంటి అభ్యంతరాలు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలో ప్రేక్షకులు తెలుసుకోడానికి అది సహాయపడుతుంది. ముందే సిద్ధపడి, మీ గృహస్థురాలితో ముందుగా రిహార్సల్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. కూటం ఆరంభమైన తర్వాత రిహార్సల్ చేయవలసిన అవసరం ఉండకూడదు.
7 ప్రసంగాలిచ్చే విద్యార్థులు హాలు ముందు వైపు కూర్చోవాలని ప్రోత్సహించబడుతున్నారు. ఇది సమయాన్ని మిగిల్చి, పాఠశాల అధ్యక్షుడు వ్యక్తిగతంగా అనిపించేలా వ్యాఖ్యానం చెప్పడానికి వీలు కలిగిస్తుంది. స్కూల్ గైడ్‌బుక్ ఆధారంగా ఆయన యిచ్చే దయతోకూడిన, ప్రత్యేక సలహాల నుండి అందరూ ప్రయోజనం పొందగలరు. అయన స్పీచ్ కౌన్సిల్ స్లిప్‌లోని ప్రసంగ అంశాలన్నింటిని క్రమంగా చూడకపోవచ్చు; మీరు మంచి అభివృద్ధి సాధించడానికి మీకు ప్రస్తుతం అవసరమున్న దానికి అనుగుణంగా సలహా అంశాన్ని ఎంపిక చేస్తాడు.
8 ప్రతివారం దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు సిద్ధపడి, హాజరు కావడానికి యివన్నీ చక్కని కారణాలే. మనకు లభించే ఉపదేశం మనం మన పరిచర్యలో జ్ఞానులుగాను, సామర్థ్యంగలవారిగాను ఉండడానికి తోడ్పడగలదు.—సామె. 1:5.