వేసవిలో దైవపరిపాలనా పనులను వెంబడిస్తూ ఉండండి
1 వేసవికాలం వివిధ రకాల పనుల్లో పాల్గొనడానికి అవకాశాలనిస్తుంది. మనలో అనేకులం పాఠశాల సెలవుల సమయంలో సాధారణ దినచర్యల నుండి భిన్నమైన దాన్ని చేస్తూ, సేదదీర్చుకొంటూ ప్రయోజనం పొందడానికి యిష్టపడతాము. అయినప్పటికీ, దైవ పరిపాలనా సంబంధమైన మన క్రమపద్ధతికి భంగంకలుగకుండా మనం జాగ్రత్తపడాలి.—ఫిలి. 3:16.
2 ప్రాంతీయ సమావేశాలకొరకు, ప్రత్యేక సమావేశ దినాల కొరకు మనం ఆతురతతో ఎదురు చూస్తాం. వీటిలో ఒకటి వేసవి కాలంలో జరిగేటట్లయితే, ప్రయాణానికి, అక్కడ కావలసిన వసతివంటి ఏర్పాట్లు చేసుకొంటూ దానికి హాజరయ్యేందుకు మీరు కచ్ఛితమైన పథకాలు వేసుకున్నారా? మీ సంఘంలో వ్యక్తిగత సహాయం అవసరమున్న వారెవరైనా ఉంటే వారికొరకు కూడా ఆలోచించారా? అలాంటి దయతోకూడిన మంచి పని పరస్పర ఆశీర్వాదాలను తీసుకు వస్తుంది.
3 పాఠశాల సెలవురోజుల్లో మీకు సమయం ఉండేటట్లయితే, పరిచర్యలో ఎక్కువగా పాల్గొనడాన్ని గూర్చి మీరు ఆలోచించారా? సహాయ పయినీర్లుగా పాల్గొనడానికి యిదే మంచి సమయమని అనేకులు తెలుసుకున్నారు. తరచూ యిది మరి గొప్ప సేవాధిక్యతలకు దారి తీసింది. పగలంతా కలిసి పరిచర్యలో గడపడంలో కుటుంబాలు నిజమైన సంతోషం అనుభవించగలవు. పరిస్థితులు ఏవైనప్పటికీ, మీరు పరిచర్యలో గడుపుతూ ఉన్న సమయాన్ని హెచ్చించగలరా? పగటి సమయం ఎక్కువగా ఉన్నందున, సాయంకాల సాక్ష్యపు పనిలో పాల్గొనడంవల్ల ఎక్కువ మంది ప్రయోజనాన్ని పొందగల్గాలి.
4 తన ప్రాంతాన్ని పూర్తి చేయడానికి సహాయం అవసరమున్న సంఘానికి సహాయపడే విషయమేమిటి? ఎక్కడ అవసరత ఎక్కువగా ఉందో అక్కడ ఒక వారమో రెండు వారాలో సేవ చేయడానికి మీతో పాటు మీ సంఘంలోని యితరులు కూడా కలవడానికి యిష్టపడవచ్చు. మీ గుంపు చిన్నదైతే, బహుశ పొరుగు సంఘంలోని ప్రచారకులు మీతోపాటు వెళ్ళడానికి యిష్టపడవచ్చు. మీరు కొంత దూరమే ప్రయాణం చేయగలిగినట్లయితే, మీ సహాయాన్ని ప్రశంసించే దగ్గరలో ఉన్న సంఘాన్ని ప్రాంతీయ కాపరి బహుశ మీకు సిఫారసు చేయగలరు.
5 సెలవుల్లో యింటి నుండి మరో స్థలానికి వెళ్ళేందుకు మీరు పథకం వేసుకుంటున్నారా? అలాగైతే, మీరు వెళ్ళేచోట కూటాలకు హాజరు కావడానికి మీరు పథకం వేసుకుంటున్నారా? అక్కడి సహోదరులతో ప్రాంతీయ పరిచర్యలో పని చేయడాన్ని గూర్చిన విషయమేమిటి? మీ సెలవుల్లో దీన్ని కూడా చేర్చడం మీకును, యితరులకును ఎంతో ప్రతిఫలదాయకంగా ఉండగలదు. (రోమా. 1:11, 12) అలాగే మీరు ప్రయాణం చేస్తుండగా తటస్థ సాక్ష్యమిస్తారా? మీతో పాటు మీ బైబిలును, లభ్యమయ్యే సాహిత్యాలను కచ్ఛితంగా తీసుకువెళ్ళండి. చదవడంలో వెనకబడివున్న భాగాలను, బైబిలును పఠిస్తూ కొత్త వివరాలను తెలుసుకోడానికి మీరు ఖాళీగా ఉన్న సమయాన్ని ఉపయోగించండి. లౌకిక పనుల నుండి మనకు అప్పుడప్పుడు విశ్రాంతి అవసరం ఉన్నప్పటికీ, యెహోవాను సేవించడం నుండి విశ్రాంతి తీసుకోవాలని మనం అనుకోకూడదని గుర్తుంచుకోండి.
6 సంఘ కార్యక్రమాలను బాగా వ్యవస్థీకరించబడినవిగా ఉంచేందుకు పెద్దలు అప్రమత్తంగా ఉండాలి. పెద్దలెవరైనా లేదా పరిచారకులెవరైనా దూరంగా వెళ్ళబోతున్నట్లయితే, తమ బాధ్యతలను నిర్వర్తించడానికి యితరులను ఏర్పాటు చేయాలి. తాము వెళ్ళే తారీఖులను చాలా ముందుగానే సంఘాధ్యక్షునికి తెలిపినట్లయితే, ఆయన అవసరమైన సర్దుబాట్లు చేయబడేలా పర్యవేక్షించడానికి అది సహాయపడుతుంది.
7 అవును, వేసవికాలం ఎంతో రద్దీగా ఉండే సమయం కాగలదు. అయితే, యితర పనులు రాజ్య పరిచర్యలోని మీ మంచి కార్యక్రమాన్ని సులభంగా భంగపరచగలవు. వేసవిలోని మీ అవకాశాలన్నింటిని ఉపయోగించండి. మీ ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆధిక్యతలను నిర్ణయించుకొని వాటిని హత్తుకొనండి.—ఫిలి. 1:9.