కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/94 పేజీ 5
  • దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—1994
మన రాజ్య పరిచర్య—1994
km 4/94 పేజీ 5

దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష

ఫిబ్రవరి 28 నుండి 13, 1994 మధ్య వారాల్లోని ప్రసంగాల్లోని సమాచారంపై ఆధారపడిన, పుస్తకాలను మూసివేసి చేయవలసిన పునఃసమీక్ష. అనుమతించిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడానికి వేరే పేపరును ఉపయోగించండి.

[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నకు సమాధానం వ్రాయడానికైనా బైబిలును మాత్రమే ఉపయోగించాలి. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధనకొరకు యివ్వబడ్డాయి. ది వాచ్‌టవర్‌ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్‌ నెంబర్లు ఉండకపోవచ్చు.]

ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:

1. దేవుని అంగీకారమున్న ప్రజలు ఎన్నడూ కష్టమనుభవించరు. [వారపు బైబిలు పఠనం; కా w92 12/15 పుట 4 చూడండి.]

2. నెహెమ్యా 10:34 ప్రకారం కట్టెలు అర్పించాలని ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించబడింది. [వారపు బైబిలు పఠనం; w86 2/15 పుట 28 చూడండి.]

3. యోబు 31:1 లో యోబు యిచ్చిన ప్రత్యుత్తరం మత్తయి 5:27, 28లోని యేసు బోధకు అనుగుణంగా ఉంది. [వారపు బైబిలు పఠనం; w78 12/15 పుట 32 చూడండి.]

4. క్రీస్తుకు పూర్వం 1,500 సంవత్సరాలకంటే ముందే యోబు పునరుత్థాన నిరీక్షణను వెలిబుచ్చాడు. [వారపు బైబిలు పఠనం; యోబు 14:13, w93 4/15 పుట 11 చూడండి.]

5. పరిసయ్యులు, శాస్త్రులు సామాన్య ప్రజలను మురికిలా పరిగణిస్తూ, వారిని సూచించడానికి “నేల [మట్టి] మనుష్యులు,” అనే భావమున్న ‘ఆమ్‌ హారేట్స్‌’ అనే హెబ్రీ పదాన్ని ఉపయోగించారు. [జిటి అధ్యాయం 85]

6. ఎస్తేరు 1:10-12 లోని వివరణ, సౌందర్యం కలిగివుండడంకన్నా లోబడియుండడం, విధేయత చూపించడమే ఎక్కువ విలువగలిగినవని, వివేచించే వ్యక్తి గుణగ్రహించడానికి తోడ్పడుతుంది. [వారపు బైబిలు పఠనం; w79 3/15 పుట 14 చూడండి.]

7. యెహోవాయెడల, ఆయన మార్గాలయెడలగల మెప్పు కారణంగా, ఆయనను ప్రేమపూర్వకంగా హత్తుకొని ఉండడాన్ని దైవ భక్తి సూచిస్తుంది. [యుడబ్ల్యు పుట 19 పేరా 15]

8. లూకా 16:19-31 లోని ధనవంతుడు, లాజరును గూర్చిన బైబిలు వృత్తాంతం నిజమైన-జీవిత కథయే. [జిటి అధ్యాయం 88]

9. లూకా 16:9 లో యేసు “అన్యాయపు సిరి” అని చెప్పినప్పుడు, చట్టవిరుద్ధంగా సంపాదించిన ధనాన్ని గూర్చి ఆయన మాట్లాడాడు. [జిటి అధ్యాయం 87]

10. లూకా 17:34, 35 లో చెప్పబడిన “కొనిపోబడును” అన్న పదానికి నాశనమని అర్థం. [జిటి అధ్యాయం 93]

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి:

11. యోబు గ్రంథం ప్రధానమైన ఏ రెండు ప్రశ్నలను చర్చిస్తుంది? [ఎస్‌ఐ పుట 95 పేరా 1]

12. యోబు 1:8 లోని వివరణ యోబు శోధనా కాలాన్ని నిర్ణయించడానికి మనకెలా తోడ్పడుతుంది? [ఎస్‌ఐ పుట 95 పేరా 4]

13. తన అనుచరులు వారి బంధువులను “ద్వేషించాలి” అని యేసు అన్నపుడు ఆయన భావమేమి? (లూకా 14:26) [జిటి అధ్యాయం 84]

14. యోహాను 11:26 లో యేసు చెప్పిన మాటలు ఎప్పుడు, ఎవరికి అక్షరార్థమైన భావంలో నిజమని నిరూపించబడతాయి? [జిటి అధ్యాయం 90]

15. మరణం నుండి లాజరును లేపడం ప్రత్యేకంగా సద్దూకయ్యులకు ఎందుకొక పెద్దదెబ్బ తగిలినట్లయింది? [జిటి అధ్యాయం 91]

16. యేసు పరిసయ్యులకు జవాబిస్తూ “దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది” అని చెప్పిన మాటలను మనమెలా అర్థం చేసుకోగలం? (లూకా 17:21) [జిటి అధ్యాయం 93]

17. లూకా 18:11, 12 లో చూపించబడిన పరిసయ్యుల ఏ వైఖరిని క్రైస్తవులు విసర్జించాలి? [జిటి అధ్యాయం 94]

18. ఎన్నడూ పాపం చేయని యేసు పరిపూర్ణ మనుష్యుడైనప్పటికీ, ధనవంతుడైన ఒక యువ అధికారి “సద్బోధకుడా” అని పిలిచినప్పుడు ఆయన ఎందుకు అభ్యంతరం చెప్పాడు? (మార్కు 10:17, 18) [జిటి అధ్యాయం 96]

19. నిజమైన క్రైస్తవ ఐక్యమత్యానికి దోహదపడే రెండు కీలకాలేవి? [యుడబ్ల్యు పుట 8 పేరా 8]

20. ఒక వ్యక్తి తాను త్రిత్వంలో నమ్ముతున్నానని చెబుతున్నట్లయితే, త్రిత్వం తప్పని నిరూపించే ముందు త్రిత్వాన్ని గూర్చి ఆయనను తన అభిప్రాయం చెప్పమనడం ఎందుకు జ్ఞానయుక్తంగా ఉంటుంది? [యుడబ్ల్యు పుట 16 పేరా 10]

క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని లేక మాటను చేర్చండి:

21. యోబు 3:14లోనున్న “బీడుభూములు”_________________________ను సూచిస్తున్నాయి. [వారపు బైబిలు పఠనం; w79 4/15 పుట 31]

22. ఎస్తేరు దినాల్లోని యూదుల్లాగే, యెహోవాసాక్షులు శత్రువుల నుండి సంరక్షణ కొరకు_________________________కు సముచితంగా అప్పీలు చేస్తారు. [వారపు బైబిలు పఠనం; w86 3/15 పుట 25 చూడండి.]

23. బైబిలును వ్రాయడానికి_________________________మంది “సెక్రటరీలను” ఉపయోగించినప్పటికీ, _________________________ దాని రచయిత. [యుడబ్ల్యు పుట 20 పేరా 2]

24. స్వాతంత్ర్యేచ్ఛ _________________________నుండి ఉద్భవించింది. [యుడబ్ల్యు పుట 10 పేరా 10]

25. _________________________అనే సాధారణమైన, వినయమైన విజ్ఞప్తితో నెహెమ్యా తన పుస్తకాన్ని ముగించాడు. [వారపు బైబిలు పఠనం]

క్రింది వాక్యాల నుండి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:

26. యేసు శిష్యులు లోకానికి ఉప్పైయున్నారు అంటే (వారు శ్రమలననుభవించాలి; సాత్వికంగా మాట్లాడాలి; ప్రజలను పరిరక్షించే ప్రభావాన్ని కలిగివుండాలి). [జిటి అధ్యాయం 84]

27. యోహాను 1:1 నందలి వచనం (ఒకరు; ఇద్దరు; ముగ్గురు) వ్యక్తులను సూచిస్తుంది. [యుడబ్ల్యు పుట 16 పేరా 11 (3)]

28. కీర్తనలు 9:10 ప్రకారం, దేవుని నామాన్ని తెలుసుకోవడమంటే (కేవలం యెహోవా నామాన్ని తెలుసుకోవడం; ఆయన సంకల్పాలను గూర్చి కొంతవరకు తెలుసుకోవడం; ఆయన అధికారాన్ని గౌరవించి, ఆయన ఆజ్ఞలను విధేయులు కావడం). [యుడబ్ల్యు పుట 18 పేరా 14]

29. లాజరు, మార్తా, మరియ (యెరూషలేములో, బెత్లేహేములో, బేతనియాలో) నివసించారు. [జిటి అధ్యాయం 89]

30. ఆదికాండము 1:1, 26 లో “దేవుడు” అని అనువదించబడిన హెబ్రీ పదం (అదొనాయ్‌’; ‘ఏలోహిం’; ‘షాదాయ్‌’). [యుడబ్ల్యు పుట 17 పేరా 11 (4)]

క్రింద ఇవ్వబడిన వాక్యాలతో లేఖనాలను జతచేయండి: నెహె. 13:23-27; ఎస్తేరు 1:17-20; యోబు 14:14, 15; 26:7; సామె. 3:5, 6

31. భూమిని నిలబెట్టడానికి దృశ్యమైన ఏ ఆధారమూ లేదు. [వారపు బైబిలు పఠనం; కా w92 8/15 పుట 5]

32. వివాహజత కొరకు వెదుకుతున్న సత్యదేవుని ఆరాధికులు, యెహోవాతో సమర్పిత సంబంధం కల్గిన సహవిశ్వాసులనే వివాహం చేసుకోవాలి. [వారపు బైబిలు పఠనం; w89 6/1 పుట 14 చూడండి.]

33. చనిపోయినవారిని పునరుజ్జీవింపజేయాలని యెహోవా అత్యధికంగా ఆశిస్తున్నాడు. [వారపు బైబిలు పఠనం; కా w91 12/1 పుట 7 చూడండి.]

34. మన తలంపులకు మన లక్ష్యాలకు దేవుని నడిపింపు ఉందని మన జీవిత విధానమంతా రుజువుపర్చాలి. [యుడబ్ల్యు పుట 10 పేరా 11]

35. అధికారం యెడల అగౌరవాన్ని చూపడం ఇతరులపై చెడ్డ ప్రభావాన్ని చూపించగలదు? [వారపు బైబిలు పఠనం w79 3/15 పుట 14 చూడండి.]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి