తామెలా నిరంతరము జీవించగలరో నేర్చుకొనుటకు ప్రజలకు సహాయము చేయుటకు తిరిగి దర్శించండి
1 నిరంతరము జీవించగలరు అనే పుస్తకము విడుదల అయినప్పటి నుండి, 115 భాషలలో 6 కోట్ల 50 లక్షల ప్రతులు ఉత్పత్తి చేయబడినవి. ఈనాడు యెహోవా సేవకులుగా ఉన్న చాలామంది ఈ చక్కని ఉపకరణము ద్వారానే బైబిలు మూల సత్యాలను నేర్చుకున్నారు. ఈ నెల మరియు వచ్చే నెల, మనము ఈ బైబిలు పఠన సహాయక పుస్తకాన్ని ప్రజలకు అందిస్తుంటాము, లేక తమ వద్ద దానిని ముందే కల్గి ఉన్న వారిని మన ప్రాంతంలో కలుసుకోవచ్చును.
2 పుస్తకము కలిగియున్న వారిని తిరిగి దర్శించుట: విషయ సూచికవైపు వారి అవధానాన్ని మరల్చి ఆసక్తిగలవారిని తమకు ఏ విషయం ఎక్కువ ఆసక్తిని కలిగిస్తుందని అడగడం ద్వారా చాలామంది ప్రచారకులు మంచి ఫలితాలను పొందారు. ఇంటివారు ఒక విషయాన్ని ఎన్నుకున్న తరువాత, మీ తదుపరి దర్శనమునకు ముందు పుస్తకములోని ఆ అధ్యాయాన్ని చదివి ఉంచుమని సలహా ఇవ్వండి.
3 వీలైనప్పుడు, తిరిగి దర్శించుటకు మనం కచ్చితమైన ఏర్పాటు చేసుకోవాలి. దర్శించుటకు ముందు గృహస్థుడు ఎన్నుకొనిన అధ్యాయంలోని కొన్ని పేరాలను మనం సిద్ధపడాలి. ఒకవేళ అతను ఎన్నుకొనకపోతే మొదటి అధ్యాయము నుండి చర్చించుట మొదలు పెట్టవచ్చు. కొన్ని పేరాలు చర్చించిన తరువాత, రాబోవు పేరాలలో వివరించబడు ఒక ప్రశ్నను మనము లేవదీయవచ్చు. మనము నిరంతరము జీవించగలరు అనే పుస్తకములో పఠనము కొనసాగించునప్పుడు, ఇది పునర్దర్శనమునకు సహాయకంగా పనిచేయగలదు.
4 ఒకవేళ, ఇంటివారికి ప్రశ్నలుంటే, వాటిని మొదట పరిశీలించడం మంచిది. చాలామట్టుకు అతని ప్రశ్నలకు పుస్తకములోనే జవాబులు దొరుకుతాయి. పుస్తకములోని విషయాలతో మనం పరిచయం కలిగియుంటే సరైన పేరాలకు త్రిప్పి, ఆ సమాచారాన్ని ఉపయోగించి అడగబడిన ప్రశ్నలకు జవాబులను ఇవ్వగలము.
5 మనం కరపత్రం యిచ్చి వెళ్లిన వారిని తిరిగి దర్శించుట: మనము మొదటిసారి దర్శించినప్పుడు బహుశ ఇంటివారు పనితొందరలో ఉంటే మనము అతని వద్ద పీస్ఫుల్ న్యూ వరల్డ్ అనే కరపత్రాన్ని వదిలి వెళ్లుండవచ్చు. తిరిగి దర్శించినప్పుడు, కరపత్రము నందలి మొదటి పేరాలను చర్చించవచ్చు.
మూడవ పేజీలోని మొదటి పేరా చివరలో కీర్తన 37:29 సూచించబడిన చోటికి వచ్చినప్పుడు, మనమిలా చెప్పవచ్చు:
◼ “మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే ఈ పుస్తకములో చర్చించబడుచున్న విషయాలను ఈ వాక్యాలు ఉన్నతపరుస్తున్నవి. మొదటి అధ్యాయములో ‘మనమెందుకు నమ్మగలము’ అనే ఉపశీర్షిక క్రింద ఉన్న 3వ పేరాలోని అంశాన్ని గమనించండి.” మనము తరువాత 3వ పేరాను చదివి, దానికి సంబంధించిన ప్రశ్నను అడిగి, అదే మాదిరిగా 4, 5 పేరాలు కొనసాగించవచ్చు. తరువాత మనమిలా అనవచ్చు: “దేవుని సంకల్పంతో పరిస్థితులు ప్రస్తుతం ఎందుకింత అసంబద్ధంగా ఉన్నాయి? తరువాత ఉన్న కొన్ని పేరాలు దాన్ని వివరిస్తున్నాయి, మరి నేను వచ్చే వారము ఇదే సమయానికి మళ్లీ వచ్చి ఈ ప్రశ్నకు జవాబిస్తాను.” ఈ సందర్భంలో మనము పుస్తకమును అందించవచ్చు.
6 “నిరంతరము జీవించగలరు” అనే పుస్తకాన్ని అందించడానికి, మనమిలా చెప్పవచ్చు:
◼ “ఈ ప్రచురణను ఒక దానిని మీరు స్వంతంగా కలిగియుండుటకు సంతోషిస్తారని నేను భావిస్తున్నాను. తద్వారా మీరు ముందుగానే చదువుకొని ఉంటే తర్వాత మన చర్చనుండి ఎక్కువ ప్రయోజనము పొందవచ్చు. మేము ఈ పుస్తకాన్ని రూ. 20.00 లకు ఇస్తాము.” (పెద్ద సైజుకు రూ. 40.00)
7 వారెలా నిరంతరము జీవించగలరో నేర్చుకొనుటకు ప్రజలకు సహాయము చేయ తిరిగి వారినిదర్శించడం చాలా ముఖ్యమైన పని. తాము ఏయే విషయాలను నేర్చుకున్నారో వాటిని ఇతరులకు బోధించాల్సిందిగా యేసు తన శిష్యులకు తెలియజేసెను. ఎక్కువమంది పనివారిని పంపించుమని మనము యెహోవాకు ప్రార్థన చేస్తాము. కావున, ఆసక్తిగల వారిని కనుగొని, కోతపనిలో సహపనివారిగా ఉండుటకు వారికి నేర్పుటలో మనవంతు భాగము మనము చేద్దాము.—మత్తయి 9:37; 28:19, 20.