ప్రజలు ఆసక్తిగా వినునట్లు కృషిచేయుట
1 ఇంటింటి పరిచర్యలో మనము కలుసుకొను ప్రజలలో చాలా మందికి వారి మనస్సులలో ఆత్మీయ విషయాలు ఉండవు. వారి కుటుంబ సభ్యులు, ఆర్థిక ఇబ్బందులు, లేక వ్యక్తిగత సమస్యలు వాటిలో ముందే చోటుచేసుకొని ఉంటాయి. సంభాషణను ప్రారంభించుటకు, మన ప్రాంతంలోని చాలామందికి ఆసక్తి కలుగజేయు విషయాల గురించి మాట్లాడడం మంచిది. ప్రశ్నలు ఇంటివారిని సంభాషణలోనికి దింపుతాయి గనుక, ఆసక్తిని రేకెత్తించుటకు వాటిని అడగవచ్చు. ప్రజలను ఇబ్బంది పెట్టని, అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రశ్నలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
2 ఈ విధంగా చెప్పుట ద్వారా వారు ఆసక్తిగా వినేట్టు చేయవచ్చు:
◼ “నమస్తే. నా పేరు ________. నేను ఈ ప్రాంతంలోనే జీవిస్తున్నాను. ఈ ఉదయం నేను మాట్లాడిన వారిలో చాలామంది ఈ విషయంపై [ఈ మధ్యే జరిగిన ఆ ప్రాంతపు వార్తా విషయాన్ని లేక ప్రాంతీయ విషయాన్ని చెప్పండి] ఆసక్తి చూపించారు. లోకం ఇలా ఉండాలని దేవుడు ఆశించాడని మీకు అనిపిస్తుందా?” వారిని జవాబు చెప్పనివ్వండి. ఈ సందర్భంలో లైఫ్ ఇన్ ఏ పీస్ఫుల్ న్యూ వరల్డ్ అనే కరపత్రాన్ని చూపించవచ్చు. మొదటి పేజీలోని దృష్టాంతాన్ని, సమయం ఉంటే 1-3 పేరాలలోని విషయాన్ని క్లుప్తంగా పరిశీలించి, నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అందించవచ్చు. లేక నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని మొదట్లోనే అందించండి. అందులో 157వ పేజీనందు ఉదహరించబడిన కీర్తన 37:9, 10 వైపుకు అవధానాన్ని మళ్లించి దాన్ని చదువవచ్చు. మరి 156-7 పేజీలలోని చిత్ర పటాన్ని ఉపయోగిస్తూ, దుష్టత్వం తీసివేయబడినప్పుడు భూవ్యాప్తంగా ఉండే నీతియుక్తమైన పరిస్థితులను వివరించండి.
3 పుస్తక అందింపును నిరాకరించినా లేక గృహస్థుడు పనితొందరలో ఉన్నా, కావలికోట మరియు అవేక్!ను అందించుటకు అన్నివేళలా సిద్ధంగా ఉండండి. నైతిక విలువలు పడిపోవడం విషయంలో ప్రజలందరూ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 8 అవేక్! సంచిక చదువుతు, మీరు మీ ప్రాంతంలోని ప్రజల ఆసక్తిని రేకేత్తిస్తుందని మీకు అనిపించిన కొన్ని అంశాలను ఎన్నుకొనండి. ప్రస్తుత చెడు పరిస్థితులపై ఎక్కువ అవధానమునుంచక, ఈ అవేక్! సంపుటిలోని “ది పర్ఫెక్ట్ మోరల్ గైడ్,” అనే అంశం వైపు ఇంటివారి అవధానాన్ని త్రిప్పి, దేవుని వాక్యంలోని సలహాలకు హత్తుకొనడంలోని లాభాల గురించి అనుకూలంగా మాట్లాడండి. నెలలో ఆ తరువాత, ఆగష్టు 22 అవేక్! సంచికను పరిచయం చేస్తున్నప్పుడు “వెన్ ఆల్ రేసెస్ లివ్ టుగెదర్ ఇన్ పీస్” అనే అంశంవైపు అవధానాన్ని మరల్చాలి. వేర్వేరు జాతుల ప్రజల మధ్య శాంతియుత సంబంధాలను నెలకొల్పడానికి బైబిలిస్తున్న సలహాలను ఎత్తిచూపించండి. ఆగస్టు 8 అవేక్! ప్రాంతీయ భాషా సంచికలోని మొదటి శీర్షిక “దేవుడు యుద్ధంలో ఇరుపక్షాలు వహిస్తాడా” అని చాలామంది అడుగు ప్రశ్ననే వేస్తున్నది. అదే సంచికలో “యుద్ధాంతమునకు ఏమి నిరీక్షణ?” అను రెండవ శీర్షికనందు చర్చించబడిన, మనయెదుట ఉంచబడిన అద్భుత ఉత్తరాపేక్ష వైపుకు ఇంటివారి అవధానమును మరల్చవచ్చు. పత్రికలను అందించుటకు ప్రత్యేకించబడిన దినాలతోపాటు ఇతర సమయాలలో కూడా కావలికోట మరియు అవేక్!ల ఇటీవల సంచికలను పాత సంచికలను అందించవచ్చు.
4 రాజ్య వర్తమానములో ఆసక్తిని రేకెత్తించుటే మన ధ్యేయమని గుర్తుంచుకొనండి. ఆసక్తిగా వినేటట్లు చేయుటకు మీరు ముందు ఇంటివారి అవధానాన్ని పొంది అతని ఆలోచనను రేకెత్తించాలి. “దేవుడైన యెహోవా” మానవ జాతిపట్ల తన సంకల్పాలను గురించి “సెలవిచ్చుమాటను . . . చెవిని బెట్టుటకు” గొర్రెవంటి వారు వినునట్లు ఇది చేయును.—కీర్తన 85:8.