కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/93 పేజీలు 5-6
  • దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—1993
మన రాజ్య పరిచర్య—1993
km 8/93 పేజీలు 5-6

దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష

జూన్‌ 21 నుండి అక్టోబరు 18, 1993 మధ్యవారములలోని నియామకముల సమాచారముపై ఆధారపడి, పుస్తకములను మూసివేసి చేయవలసిన పునఃసమీక్ష. అనుమతించిన సమయములోపల, మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు సమాధానము వ్రాయుటకు వేరే పేపరును ఉపయోగించండి.

[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయములో ఏ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకైనను కేవలము బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చును. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధనకై యివ్వబడినవి. ది వాచ్‌టవర్‌ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్‌ నెంబర్లు ఉండకపోవచ్చును.]

ఈ క్రింది వాక్యములు సత్యమో, అసత్యమో వ్రాయండి:

1. యోషియా బేతేలునందలి యరొబాము బలిపీఠాన్ని తీసివేస్తాడని 300 సంవత్సరాల ముందే చెప్పబడిన ప్రవచనానికి చెప్పుకోదగిన నెరవేర్పు ఉండెను. [యస్‌ఐ పే. 68 పేరా 25 (1983 ఎడి., పే. 68 పేరా 25)]

2. రెండవ రాజులలో, సా.శ.పూ. 1037 నుండి షుమారు సా.శ.పూ. 580 వరకున్న సొలొమోను పరిపాలనా వృత్తాంతమున్నది. [యస్‌ఐ పే. 69 పేరా 2 (పే. 69 పేరా 2)]

3. లేఖన భాగాన్ని చదివిన తరువాత దాన్ని అన్వయించడానికి కేవలం లేఖనాలను చర్చిస్తే సరిపోతుంది. [యస్‌జి పే. 129 పేరా 20]

4. పునరుచ్ఛరణ ఒక ప్రాముఖ్యమైన బోధనా పద్ధతైనప్పటికీ, అనవసరమైన పునరుచ్ఛరణ, మీ ప్రసంగాన్ని గలిబిలి చేసి నిస్సారంగా ఉండేటట్లు చేస్తుంది. [యస్‌జి పే. 131 పేరా 11]

5. మీరు అవుట్‌లైన్‌ నుండి మంచి నేర్పుతో ప్రసంగించగలిగినప్పుడు బహిరంగ ప్రసంగీకునిగా మీరు మంచి ప్రగతి సాధించినట్లే. [యస్‌జి పే. 140 పేరా 10]

6. అప్పటికప్పుడిచ్చే ప్రసంగం వలె పేరాలను చదవడం అసాధ్యము. [యస్‌ఐ పే. 146 పేరా 21]

7. ఒత్తిపలకడంలో భావాన్ని తెలియజేసే పదాలను గుర్తించడం, వాటి చుట్టూవున్న పదాలకు ప్రత్యేకంగా వుండేలా చేయడం ఇమిడివున్నాయి. [యస్‌ఐ పే. 159. పేరా 3]

8. బైబిలు కాలాల్లో కళ్లకాటుక వాడిన దాఖలాలేమి లేవు. [వారపు బైబిలు పఠనము; అవేక్‌! 77 9/22 పే. 20 చూడండి.]

9. ఇశ్రాయేలు ఉత్తర ప్రాంతపు రాజ్యాన్ని అష్షూరీయులు నాశనం చేయడాన్ని గూర్చి 2 రాజులు 17:6-18 నందున్న బైబిలు వృత్తాంతాన్ని పురాతత్వశాస్త్ర సాక్ష్యం గట్టిగా సమర్థిస్తున్నది. [వారపు బైబిలు పఠనము; జిఎం పేజి. 47-8 చూడండి.]

10. సృష్టారంభము నుండి యెహోవా పరిపాలిస్తున్నప్పటికీ, ఫలానా సమయంలో ఆయన ‘రాజయ్యాడని’ చెప్ప వీలగునట్లు ఆయన తన పరిపాలనను గూర్చి కొన్నిసార్లు నిర్దిష్టంగా పేర్కొన్నాడని 1 దినవృత్తాంతములను 16:31 లోని దావీదు మాటలు వివరిస్తున్నవి. [వారపు బైబిలు పఠనము; కా86 5/1 పే. 11 చూడండి.]

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిమ్ము:

11. గృహస్థుడు లేఖనాన్ని చదివినప్పుడు, దాని ముఖ్యాంశాలను ఎలా నీవు నొక్కిచెప్పగలవు? [యస్‌జి పే. 128 పేరా 13]

12. ఒక ప్రసంగీకునికి అభినయంలోని సహజ అలవాట్లలో సమస్యవుంటే అతడేమి చేయాలి? [యస్‌జి పే. 133 పేరా 20]

13. చదవడంలో ధారాళతా లోపాన్ని సవరించుకొనుటకు మీరేమి చేయవచ్చు? [యస్‌జి పే. 143 పేరా 7]

14. దినవృత్తాంతములు ఎందుకు వ్రాయబడినవి? [యస్‌ఐ పే. 75 పేరా 2 (పే. 75 పేరా 2)]

15. హేతుబద్ధమైన వాదనను, లేక తర్కించే పద్ధతిని పెంపొందించుటకు ఓ ముఖ్య మార్గమేది? [యస్‌జి పే. 151 పేరా 11]

16. రెండవ రాజులు 11:12 నందలి “ప్రమాణం” ఏమిటి? [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 91 2/1 పే. 31]

17. రెండవ రాజులు 19:32, 33 వచనాలకు అనుగుణంగా అష్షూరు రాజు యెరూషలేము లోపలికి రాకుండా ఎలా నిరోధించబడ్డాడు? [వారపు బైబిలు పఠనము; కా89 8/1 పే. 30. చూడండి.]

18. మొదటి దినవృత్తాంతములు 19:2-4 నందున్న హానూనుతో దావీదుకు గల అనుభవం ద్వారా మనమేమి నేర్చుకోవచ్చు? [వారపు బైబిలు పఠనము; కా74 పే. 82 చూడండి.]

19. ప్రకటన 4:4 నందు చెప్పబడిన 24 యాజక విభాగాలు “పెద్దల” గుర్తింపును అర్థం చేసుకొనుటకు మనకెలా సహాయం చేస్తాయి? (1 దినవృత్తాంతములు 24:4) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 73 పే. 62 చూడండి.]

20. ఈనాటి యెహోవా ప్రజలలో 1 దినవృత్తాంతములు 29:5 నెరవేర్పును కల్గివుందన్న విషయం మనమెలా అర్థం చేసుకొనగలము? [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 90 7/1 పే. 31.]

ఈ క్రింది వాక్యములను పూరించుటకు అవసరమైన పదములను లేక మాటలను చేర్చండి:

21. ప్రతి ప్రసంగం, ఒక పంథాలో వెళ్లడానికి, దాని కీలక భాగాలన్ని పసందుగా సమన్వయ పరచడానికి, దానికి _________________________ అవసరం. [యస్‌ఐ పే. 133 పేరా 1]

22. నైపుణ్యంగల ప్రసంగీకుడు తన నోట్సువైపు ఎక్కువసేపు చూడడం లేదా తగని సమయంలో దానివైపు చూడడం ద్వారా, తన ప్రేక్షకులతో గల _________________________ పోగొట్టుకోడు. [యస్‌జి పే. 138 పేరా 1]

23. తన అధికారిక సేవకులను అగౌరవపరచడాన్ని తాను సహించలేనని చూపించుటకు, యెహోవా ప్రవక్తగా _________________________ వెక్కిరించిన అపరాధుల పైకి యెహోవా తీవ్ర పరిణామాన్ని తీసుకువచ్చాడు. [యస్‌ఐ పే. 74 పేరా 34 (పే. 74 పేరా 34)]

24. ప్రసంగీకునిగా, _________________________ అనే ప్రశ్నకు సమాధానమివ్వ వలసిన బాధ్యత ఎప్పుడూ నీదే. [యస్‌జి పే. 155 పేరా 7]

25. మత్తయి మరియు లూకా యేసే మెస్సీయ అయివుండెనని స్పష్టంగా ధృవపరచడానికి _________________________ వంశావళుల నుండి తెలిపారు. [యస్‌ఐ పే. 78 పేరా 23 (పే. 78 పేరా 23)]

26. చాలా ప్రసంగాలలో, ఒక విషయాన్ని ఇంకొక దానితో కలుపుటకు _________________________ అవసరమైయుంటుంది. [యస్‌జి పే 149 పేరా 2]

ఈ క్రింది వాక్యాల నుండి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:

27. మీ ప్రసంగం యొక్క మూలాంశాన్ని నిర్ణయించుకొన్న తరువాత మీరు ఉపయోగించాలను కుంటున్న (లేఖనాలను; ఉపమానాలను; ముఖ్యాంశాలను) ఎంపిక చేసుకోవాలి. [యస్‌జి పే. 135 పేరా 9]

28. ఒక ప్రసంగంలో ఒకే కారణం ఉండేలా చూచుటకు, మీరు (స్పష్టంగా మాట్లాడాలి; ప్రేక్షకుల దృష్టిని మనస్సులో ఉంచుకోవాలి; ఉత్సాహవంతంగా ఉండాలి). [యస్‌జి పే. 156 పేరా 17]

29. “యోతాము యొక్క ఇరవయవ సంవత్సరము” అంటే (ఆయన జీవితం; ఆయన అసలైన పరిపాలన; ఆయన రాజైన నాటినుండి గడిచిన కాలం) యొక్క ఇరవయవ సంవత్సరం అని అర్థం. (2 రాజులు 15:30) [వారపు బైబిలు పఠనం; డబ్ల్యు 80 9/15 పే. 8.]

30. “దావీదుకు సహాయం చేయుటకు” ఆయన యొద్దకు వచ్చిన వారు (స్వార్థపూరితులు; దావీదు రాజరికాన్ని పూర్ణ హృదయంతో సమర్థించినవారు; సులభమార్గం అవలంభించేవారు). (1 దిన. 12:22) [వారపు బైబిలు పఠనం; కా84 11/1 పే. 25 చూడండి.]

ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ లేఖనాలను జతచేయండి:

1 రాజులు 22:19-22; 2 రాజులు 1:2, 7, 8; 5:1-5; 25:27-30; 1 దిన. 9:26, 27

31. మనం వస్త్రాలు ధరించే విధానం, మనల్ని ఫలానా గుంపుతో లేక వర్గంతో మనల్ని జత చేయవచ్చు. [వారపు బైబిలు పఠనం; డబ్ల్యు 72 పే. 666.]

32. లేవి ద్వారపాలకులు ఒక విశిష్ట సేవాధిక్యత కల్గియుండిరి. [వారపు బైబిలు పఠనం; డబ్ల్యు 88 12/1 పే. 21.]

33. పరిస్థితులను చక్కబరిచే విధానం తమకు తెలుసని పెద్దలు భావించినప్పటికి, వారు యెహోవా మాదిరి నుండి నేర్చుకుని, ఇతరులు చెప్పేదాన్ని విని హృదయంలోకి తీసుకోవాలి. [వారపు బైబిలు పఠనం; డబ్ల్యు 74 పే. 436.]

34. బబులోనులో చెరలోనున్న ఒక యూదా రాజు జైలు నుండి విడుదల చేయబడి ఆహారాన్ని భత్యంగా పొందాడన్న వాస్తవాన్ని పురావస్తుశాఖ దృఢపరుస్తున్నది. [వారపు బైబిలు పఠనం; జియం పే. 48 చూడండి.]

35. పిల్లలు, పెద్దలు చర్యలు గైకొనేలా చేయగలరు. [వారపు బైబిలు పఠనం; డబ్ల్యు 74 పే. 402 చూడండి.]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి