కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/93 పేజీ 2
  • ఆగస్టు కొరకైన సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు కొరకైన సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఉపశీర్షికలు
  • ఆగస్టు 2తో ప్రారంభమగు వారము
  • ఆగస్టు 9తో ప్రారంభమగు వారము
  • ఆగస్టు 16తో ప్రారంభమగు వారము
  • ఆగస్టు 23తో ప్రారంభమగు వారము
  • ఆగస్టు 30తో ప్రారంభమగు వారము
మన రాజ్య పరిచర్య—1993
km 8/93 పేజీ 2

ఆగస్టు కొరకైన సేవా కూటములు

ఆగస్టు 2తో ప్రారంభమగు వారము

పాట 63 (32)

10 ని: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి తగిన ప్రకటనలు. క్రొత్త పత్రికలనుండి చర్చనీయాంశములను చర్చించుట. ఈ వారాంతమున క్షేత్రసేవలో పాల్గొనుమని అందరిని ప్రోత్సహించుము.

20 ని: “ప్రజలు ఆసక్తిగా వినునట్లు కృషిచేయుట.” ప్రేక్షకులతో చర్చించండి. ప్రతి ఇంటివారితోను చర్చించుటకు వీలవుతుందని ప్రతి ఒక్కరిని ఎంచుటను గూర్చిన ప్రాముఖ్యతను ఉన్నతపర్చండి. రెండు, మూడు పేరాలలోని సలహాలను ఆధారము చేసుకొని క్లుప్త అందింపులను ఇవ్వండి. క్షేత్ర సేవలో పత్రికలను క్రమముగా ఉపయోగించుటను నొక్కి చెప్పండి.

15 ని: “లాభసాటి ఫలితాలకు కరపత్రాలను ఉపయోగించడం.” ఇన్‌సర్ట్‌ నందలి మొదటి 8 పేరాలను ప్రశ్నా-సమాధానం రూపంలో పరిశీలించండి. అన్ని పేరాలను, సూచించబడిన లేఖనాలను చదివి, సరైన అన్వయింపు చేయండి. మరుసటి వారములో పరిశీలించుకు మిగిలిన ఎనిమిది పేరాలను సిద్ధపడి రావలసిందిగా సంఘానికి గుర్తుచేయండి.

పాట 193 (103) ముగింపు ప్రార్థన.

ఆగస్టు 9తో ప్రారంభమగు వారము

పాట 70 (39)

10 ని: స్థానిక ప్రకటనలు, అకౌంట్సు రిపోర్టు మరియు చందా ముట్టినట్లు పేర్కొన్నవాటిని చదవండి. ప్రాంతీయ సంఘ సేవ కొరకు ప్రపంచ వ్యాప్త సంస్థ సేవ నిమిత్తమై ఆర్థిక సహాయము ఇచ్చినందుకు సంఘాన్ని అభినందించండి.

15 ని: “లాభసాటి ఫలితాలకు కరపత్రాలను ఉపయోగించడం.” 9-16 పేరాలను ప్రశ్నా-సమాధానం రూపములో పరిశీలించండి. పేరాలన్నింటిని, సూచించబడిన లేఖనాలను చదివి, సరైన అన్వయింపు చేయండి. జూన్‌ 1993 మన రాజ్య పరిచర్య మొదటి పేజీ నుండి అదనపు అంశాలను ఉన్నతపర్చండి.

20 ని: “తామెలా నిరంతరము జీవించగలరో నేర్చుకొనుటకు ప్రజలకు సహాయము చేయుటకు తిరిగి దర్శించండి.” ప్రశ్నా-సమాధానం రూపములో పరిశీలించండి. పేరా 5, 6లందు చూపబడిన అందింపులపై ఆధారపడి పునర్దర్శనము నొకదానిని ప్రదర్శించండి.

పాట 71 (96) ముగింపు ప్రార్థన.

ఆగస్టు 16తో ప్రారంభమగు వారము

పాట 20 (55)

10 ని: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. ఇండియాలో వచ్చే నెలలో ప్రారంభమయ్యే “దైవిక బోధ” జిల్లా సమావేశాల పరంపరలో ఒక దానికి హాజరగుటకు పథకములు ముందే వేసుకొనవలెనని అందరిని ప్రోత్సహించండి. సమీపంగా జరుగు సమావేశము యొక్క తేదీని, స్థలాన్ని పేర్కొనండి. వారాంతపు క్షేత్రసేవలో పాల్గొనుటను కూడా ప్రోత్సహించండి.

15 ని: నిరంతరము జీవించగలరు అనే పుస్తకము యొక్క విలువను ఉన్నతపర్చండి. ఈ ప్రచురణ ఉపయోగించబడిన సంవత్సరములలోని పెరుగుదలను సూచించే అంకెలను చూపవచ్చు. ఈ పుస్తకాన్ని చదువుట వలననే చాలామంది సత్యమును నేర్చుకొనిరి. సత్యములోనికి వచ్చుటకు ఈ పుస్తకమును పఠించిన ఒకరు లేక ఇద్దరు ప్రచారకులను పరిచయం చేయండి. దానినుండి ఏమి నేర్చుకొనుటను వారు ఇష్టపడిరి మరియు దానిని క్షేత్రములో ఎలా ఉపయోగించవచ్చును అనునది వారిచేత చెప్పించండి. దానిని ఉత్తేజపూర్వకముగా అందించవలసిందిగా సహోదరులను ప్రోత్సహించండి.

20 ని: “క్రొత్తవానికి, అనుభవంగల పరిచారకునికి అవసరమైనవి.” పెద్ద ద్వారా ప్రశ్నా-మరియు-జవాబు రూపములో పరిశీలించబడాలి. ప్రాంతీయ సంఘానికి వర్తించు అంశాలను ప్రేమ పూర్వకముగా, కాని క్లుప్తముగా సమీక్షించవలెను.

పాట 6 (4) ముగింపు ప్రార్థన.

ఆగస్టు 23తో ప్రారంభమగు వారము

పాట 148 (28)

10 ని: స్థానిక ప్రకటనలు.

20 ని: “బైబిలు పఠనముల కొరకు పట్టుదలతో ప్రయత్నించండి.” సేవాధ్యక్షుని ద్వారా ప్రశ్నా-సమాధానముల రూపములో పరిశీలించాలి. సూచించబడిన అన్ని లేఖనాలను చదివి, అనువర్తించండి. సంఘము యొక్క గత ఐదు సంవత్సరాల బైబిలు పఠన పనిని పునఃపరిశీలించాలి, మరియు ముగింపు మాటలను ప్రాంతీయ అవసరతలకు అనుగుణంగా చెప్పాలి.

15 ని: మనము బైబిలును పఠించునప్పుడు తేదీల ప్రాముఖ్యత. రీజనింగ్‌ పుస్తకములోని 93వ పేజీలో “డెఫినీషన్‌” అను దాని క్రింది విషయాలపై చిన్న ప్రసంగము తరువాత, “డేట్స్‌” అను దాని క్రింది మిగతా సమాచారమును ప్రేక్షకులతో చర్చించండి. “దేవుని రాజ్యము 1914లో స్థాపించబడిందని యెహోవాసాక్షులు ఎందుకు చెబుతారు?” అనునది పరిశీలించండి. క్రొత్తవారు రాజ్యసువార్తను సమర్థించుటకు సిద్ధముగా ఉండుటకు ఈ సమాచారము ఎలా సహాయం చేస్తుందో ఉన్నతపర్చండి.

పాట 43 (11) మరియు ముగింపు ప్రార్థన.

ఆగస్టు 30తో ప్రారంభమగు వారము

పాట 156 (118)

5 ని: స్థానిక ప్రకటనలు.

15 ని: “మీ పరిచర్యను మనస్ఫూర్తిగా చేయండి.” పెద్దచే ప్రసంగము. రెండవ పేరాను చర్చించునప్పుడు, కావలికోట రెఫరెన్సుపై సరైన వ్యాఖ్యానం చేయాలి. ముగింపులో మలాకీ 3:10 చదివి అన్వయించండి.

10 ని: “లాభసాటి ఫలితాలకు కరపత్రాలను ఉపయోగించడం.” (2 నిమి.) ఆ శీర్షికలోని ఉన్నత అంశాలను క్లుప్తంగా పునఃపరిశీలించుట. ఘట్టం 1 (3 నిమి.) 5వ పేరాలోని సలహాలను ప్రదర్శించండి. ఘట్టం 2 (3 నిమి.) 8 లేక 14 పేరాలలోని పరిస్థితిని ఉపయోగిస్తూ, కరపత్రమును ఉపయోగించుట ద్వారా సంభాషణను మొదలుపెట్టుటను ప్రదర్శించండి. (2 నిమి.) ఇంటి వద్ద మరియు తటస్థ సాక్ష్యం ఇచ్చునప్పుడు కరపత్రాలను ఉపయోగించుటకుగల గొప్ప అవకాశములను పునఃపరిశీలిస్తూ ఉత్తేజకరమైన ముగింపును ఇవ్వండి.

15 ని: ప్రాంతీయ అవసరములు. ప్రాంతీయ కాపరి క్రితం దర్శనమందు అందించి ప్రోత్సాహమును గురించి చర్చించవచ్చు. 1993 సేవా సంవత్సరపు అన్ని రిపోర్టులు అందించబడినవో లేదో చూసుకొనవలసిందిగా సహోదరులకు గుర్తుచేయండి.

పాట 31 (51) ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి