మే నెల కొరకు సేవా కూటములు
మే 3తో ప్రారంభమయ్యే వారం
పాట 209 (39)
10 నిమి: స్థానిక ప్రకటనలు. “బ్రోషూర్లను ఉపయోగించుటకు జ్ఞాపకముంచుకోండి.” అనే బాక్సు నుండి విషయాలను పరిశీలించండి.
20 నిమి: “జీవాన్ని కాపాడే మన పరిచర్యలో విజయవంతంగా పొల్గొనుట.” క్లుప్త ఉపోద్ఘాతం తరువాత, 2-5 పేరాలను ఆధారం చేసుకుని మూడు ప్రదర్శనలు చేయండి. ప్రతి ప్రదర్శన తరువాత, స్థానిక ప్రాంతంలోని వివిధ పరిస్థితులకు తగినట్లు చెప్పే అంశాన్ని ఎలా మలుచుకో వచ్చో ప్రేక్షకులను అడగండి. ఈ వారాంతమందు పరిచర్యలో సంపూర్ణంగా భాగం వహించమని ప్రోత్సహిస్తూ ముగించండి.
15 నిమి: కుటుంబ ఆత్మీయత యొక్క ప్రాధాన్యత. పెద్ద యిచ్చే ప్రసంగం. దినవచనాన్ని కుటుంబసమేతంగా పరిశీలించుటలో గల అవసరతను గూర్చి చర్చించండి. వేర్వేరు కుటుంబ క్రమపట్టికనుబట్టి, వివిధ సమయాలలో దీనిని ఎలా చేయవచ్చో తెలియజేయండి. రోజుకు ఒక్కసారైనా కుటుంబ ప్రార్థన చేయవలసిన అవసరతను గూర్చి నొక్కితెల్పండి. ఇది రాత్రి పడుకునే సమయంలో చేయవచ్చు. విడిపోయిన కుటుంబాలకు, తల్లి లేక తండ్రి మాత్రమే వున్న కుటుంబాలకు, పిల్లలులేని కుటుంబాలకు ఇవే సూత్రాలు వర్తిస్తాయి. ప్రతివారం సంఘ కూటాల నుండి ఎంతో నేర్చుకొనుటకు, అలాగే యితరుల విశ్వాసాన్ని బలపర్చగల్గుటకు కుటుంబ సిద్ధపాటు ఎంతో సహాయం చేస్తుంది.—హెబ్రీ. 10:23-25.
పాట 104 (57) ముగింపు ప్రార్థన.
మే 10తో ప్రారంభమయ్యే వారం
పాట 27 (7)
10 నిమి: స్థానిక ప్రకటనలు. పత్రికలు, బ్రోషూర్లను అందించడంలో పొందిన ఇటీవలి అనుభవాలు. చందాలు సేకరించడంలో ఎక్కువమంది ప్రచారకులు సఫలులయ్యారా? ఈ విషయంలో, ఒకరు లేక యిద్దరిని వారి అనుభవం చెప్పనివ్వండి. (సంఘంలో పత్రిక చందాలను చూసే సహోదరుని సహాయంతో ఇది ముందే ఏర్పాటు చేసుకోవచ్చు.)
15 నిమి: “ఇంటింటి పరిచర్యలో సవాలు నెదుర్కొనుట.” ప్రశ్న సమాధానముల చర్చ. సూచించబడిన లేఖనాలను చదివి, అన్వయించండి.
20 నిమి: మనమెవర్ని అభిమానించాలి, దేవుని అనుగ్రహం ఎవరికుంది? ది వాచ్‌టవర్ డిశంబరు 1, 1992లోని 3-6 పేజీల నందలి ముఖచిత్ర శీర్షిక ఆధారంగా, ప్రేక్షకులతో చర్చిస్తూ ఒక పెద్ద ప్రసంగిస్తాడు. వాచ్‌టవర్ యొక్క ఇతర భాషాసంచికలలోని పక్ష పత్రికలయితే మార్చి 1, 1993 సంచికలోనూ, మాసపత్రికలయితే మే 1, 1993 సంచికలోనూ అవే పేజీలలో ఈ శీర్షిక వుంటుంది. స్థానిక అవసరతకు తగినట్లు మలచండి కాని, ఎవరూ అభ్యంతర పడకుండ జాగ్రత్త వహించండి. మీ ప్రాంతంలో సాధారణమైవున్న లేఖనాధారంలేని నమ్మకాలను యుక్తిగా వివరిస్తూ వాటిలో క్రైస్తవులు భాగం వహించరాదని తెలియజేయండి.
పాట 134 (62) ముగింపు ప్రార్థన.
మే 17తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (25)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్సు రిపోర్టు. విరాళముల కొరకు కృతజ్ఞతలు తెల్పండి. సంస్థ ప్రపంచవ్యాప్త పనికొరకు అలాగే స్థానికసంఘం కొరకు ఆర్థికమద్దతు యిస్తున్నందుకు సంఘాన్ని అభినందించండి.
20 నిమి: “ఆసక్తి గలవారికి సహాయం చేయుటకై సంతోషంగా తిరిగి దర్శించండి.” ప్రేక్షకులతో చర్చ, ప్రదర్శనలు. ఆసక్తి గలవారిని గూర్చిన మంచి రికార్డు వుంచుకోవలసిన అవసరతను నొక్కితెల్పండి. మూడు నుండి ఆరు పేరాలలోని విషయాన్ననుసరించి రెండు ప్రదర్శనలు ఏర్పాటు చేయండి. వీటిలో స్థానిక పరిస్థితులు ప్రతిబింబిస్తుండాలి, అవసరాన్ని బట్టి అన్వయించుకోవాలి.
15 నిమి: “తిరిగి జన్మించుట.” రీజనింగ్ పుస్తకం, 76-80 పేజీలు. ఇంటింటి పరిచర్యలో “మీరు తిరిగి జన్మించారా?” అని అడిగిన వ్యక్తిని ఇద్దరు ప్రచారకులు కలవడాన్ని గూర్చిన ప్రదర్శన. డెబ్భైతొమ్మిది, ఎనభై పేజీలలో ఇవ్వబడిన వాటిలో ఒకవిధంగా ప్రచారకులు ప్రతిస్పందిస్తారు. అటు తరువాత పునర్దర్శనం చేసి 78వ పేజీనందలి 1-3 పేరాలలో ఇవ్వబడిన లేఖనాలనుండి విషయాలు ఉపయోగిస్తూ చర్చిస్తారు.
పాట 54 (18) ముగింపు ప్రార్థన.
మే 24తో ప్రారంభమయ్యే వారం
పాట 141 (64)
10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు, మన రాజ్య పరిచర్య నుండి ఎన్నుకోబడిన ప్రకటనలు. వారాంతం కొరకు ప్రాంతీయసేవా ఏర్పాట్లను గూర్చి తెలియజేయండి.
20 నిమి: “యౌవనులారా—నేర్పుతో నడవండి.” ప్రశ్న సమాధానముల చర్చ. 3వ పేరా తరువాత ఒక చిన్నవయస్సున్న ప్రచారకుడు ప్రాంతీయ సేవలో తనతో కలిసి పనిచేయమని పెద్దవయస్సున్న ప్రచారకుని కోరుతున్నట్లు క్లుప్త ప్రదర్శన చేయించండి. పెద్దవయస్సున్న ప్రచారకుడు ఆనందంగా అంగీకరించి, కలిసిపని చేయటానికి ముందు తాము చెప్పబోయే అంశాలను పునఃపరిశీలించు కుందామని సలహాయిస్తాడు.
15 నిమి: స్థానిక అవసరతలు, లేక డిశంబరు 15, 1992 ది వాచ్‌టవర్‌లో 21-3 పేజీలలోని “అబద్ధమాడటం ఎందుకంత సులభం” అనే అంశంమీద పెద్ద ఇచ్చే ప్రసంగం. ది వాచ్‌టవర్ యొక్క ఇతర భాషాసంచికలలో పక్ష పత్రికలైతే మార్చి 15, 1993 సంచికలోనూ, మాసపత్రికలైతే మార్చి 1, 1993 సంచికలోనూ అదే పేజీలల్లో ఈ శీర్షిక వుంటుంది.
పాట 223 (58) ముగింపు ప్రార్థన.
మే 31తో ప్రారంభమయ్యే వారం
పాట 207 (112)
10 నిమి: స్థానిక ప్రకటనలు. జూన్ నెలలో ఉపయోగించగల మహాగొప్ప మనిషి అనే పుస్తకం నుండి కొన్ని మాట్లాడదగిన విషయాలను సూచించండి. జూన్ 1993 మన రాజ్య పరిచర్య వెనుక పేజీలో వున్న ప్రాంతీయ సేవ కొరకైన సలహాలను పునఃపరిశీలించమని ప్రచారకులను ప్రోత్సహించండి.
15 నిమి: “సాహిత్యం యెడల మెప్పు కనుపర్చుట.” ప్రశ్నాసమాధానముల చర్చ. ప్రచారకుడు పత్రికలందిస్తున్నట్లు ప్రదర్శించండి. బైబిలు అందింపు, పత్రికల వివరణను గృహస్థుడు మెచ్చుకొని, అయినా అవి ఉచితంగా పంచిపెట్టబడనందుకు ఆశ్చర్యం వ్యక్తపరచవచ్చు. అప్పుడు ప్రచారకుడు, మన పత్రికలు ప్రచారం కొరకు లేక ప్రకటనల కొరకు పంచిపెట్టబడటంలేదని దయాపూర్వకంగా చెప్తాడు. ఇవి వెలకట్టలేని సమాచారము కలిగివున్న విద్యాసంబంధిత పత్రికలని వివరిస్తాడు. స్వల్పమైన వెల వాటికి నిర్ణయించబడినప్పటికీ, ఇది వ్యాపారంకాదు, అలా పొందిన డబ్బునుండి ఎవరూ లాభం పొందరు. ఇంకా విద్యాసంబంధిత పనికొరకు, ముఖ్యంగా ఎక్కువ సాహిత్యాలను ప్రచురించటానికి దానిని ఉపయోగిస్తారు. అప్పుడు గృహస్థుడు సంతోషంగా ఒకొక్క పత్రిక రూ. 3.00కు తీసుకుంటాడు.
10 నిమి: రాబోయే నెలల్లో మీరు సహాయ పయినీరు సేవ చేస్తారా? గత సంవత్సరం వేసవిలో లేక వర్షాకాలంలో సహాయ పయినీరుసేవ చేసిన కొంతమందిని ఇంటర్‌వ్యూ చేయండి. సెలవుకాలాన్ని సరిగ్గా ఉపయోగించుకొనే అవకాశంగల యౌవనులను, ఇతరులను ప్రోత్సహించండి. ఎప్పుడో చేసిన ప్రాంతంలో లేక విడిగా ఉన్న ప్రాంతంలో సేవ చేయటానికి కొందరికి వీలుండవచ్చు. పాఠశాల చదువు ముగించబోతున్న వారిని క్రమపయినీరు సేవ చేయమని లేక అట్టి ఆశయం కొరకు కృషి చేయుమని ప్రోత్సహించండి.—2 కొరిం. 9:6.
10 నిమి: దేవుడు మన పాపాలను క్షమిస్తాడా? ఇద్దరు పెద్దలు కాపరి సందర్శనం కొరకు సిద్ధపడతారు. తన గత పాపాల విషయంలో బాధపడుతూ, దేవుడు క్షమించాడా లేదా అని సందిగ్థంలోవున్న సహోదరునికి ఎలా సహాయం చేయాలి అనేది వారు చర్చించుకుంటారు. రీజనింగ్ పుస్తకం, 81-4 పేజీలు, ఇన్‌సైట్ పుస్తకం వాల్యూం 1, 861-2 పేజీలలోని విషయాన్ని ఆ పెద్దలు పునఃపరిశీలిస్తారు. యెహోవా దయను, క్షమించాలనే ఆయన యిష్టతను ఉన్నతపరుస్తూ, ఆ సహోదరునితో దయతో వ్యవహరించాలన్న అవసరతను గూర్చి వారు పరిశీలిస్తారు. తప్పొప్పుకోవడమే కాకుండా ఆ సహోదరుని విషయంలో వ్యక్తిగత ప్రయత్నం అవసరమని నొక్కిచెప్పటానికి కూడ వారు సంసిద్ధులౌతారు. ఆ సహోదరున్ని అప్పుడప్పుడు దర్శిస్తూ అతనికి ఆత్మీయ సహాయాన్నందించాలని నిర్ణయించుకుంటారు.
పాట 214 (82) ముగింపు ప్రార్థన.