ఇంటింటి పరిచర్యలో సవాలు నెదుర్కొనుట
1 స్వచ్ఛమైన ఆరాధన చేసేవారు ఇంటింటికి వెళ్లడం, క్రొత్తవారిని కలవడమనేది వారికి నిజంగా సవాలైయుంది. అయితే యెహోవా యెడల ఉన్న ప్రేమ ఒకవ్యక్తి ఆ సవాలునెదుర్కొనుటకు సహాయం చేస్తుంది. సహజంగా చాలామంది బిడియపడేవారు సహితం పూర్తికాల సువార్త సేవకులయ్యేంతగా అభివృద్ధి చెందగలిగారు.
2 తొలి క్రైస్తవులు ఇంటింటికి వెళ్లి దేవునిరాజ్య సువార్తను అందించారన్నది బైబిలు ప్రకారం విశదమౌతుంది. (అపొ. 5:42; 20:20, 21) ఈ ఇరవయో శతాబ్దమందున్న క్రైస్తవులుగా మనము కూడ ఈ పనిలో భాగం వహిస్తాము. అనాసక్తి, హింస, తిరస్కారం, లేక ప్రత్యక్ష వ్యతిరేకతను మనం ఎదుర్కొనప్పటికీ దేవుని యెడల, పొరుగువారి యెడల మనకున్న ప్రేమ ఈ పని చేయుటకు మనల్ని పురికొల్పుతుంది.
3 సవాలునెదుర్కొనుట వలన ఏమి సాధించవచ్చు: మనం ప్రకటించిన ప్రతిసారి, సత్యము రాజ్యఫలాలను ఫలిస్తుందనే ఉద్దేశంతో, కొన్ని సత్య విత్తనాలను నాటడానికి ప్రయత్నిస్తాము. (ప్రసంగి 11:6) వ్యక్తిగత పరిస్థితులు మారుతాయి. మనలో ఒకరు గుమ్మమునొద్ద చెప్పిన విషయాన్ని గూర్చి గృహస్థుడు ఆలోచించేలా చేసేదేదైనా జరగవచ్చు, మరోసారి అతను ఆసక్తితో వినవచ్చు.
4 సత్యాన్ని, నీతిని కావాలనుకునే వారికి యెహోవాను, ఆయన సంకల్పాలను గూర్చి తెలుసుకుని, నిత్యజీవ మార్గంలో పయనించడం ప్రారంభించటానికి మన ఇంటింటి పరిచర్య అవకాశాన్నిస్తుంది. యెహోవా అంగీకారం పొందాలంటే, లోకసంబంధమైన ఆనందాలను వెంటాడుతున్నవారు మారాల్సిన అవసరత వుందని ప్రేమపూర్వకంగా హెచ్చరింపబడుతున్నారు. గృహస్థుడు విన్నా, వినకపోయినా ఈ పరిచర్య యెహోవా నామాన్ని తెలియజేసి, ఆయనకు ఘనత తెస్తుంది.—యెహె. 3:11.
5 పరిచర్యలో భాగం వహించడం మనం నిస్వార్థప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం వంటి ఆత్మఫలాలను పెంపొందించు కోవడానికి మనకు సహాయం చేస్తుంది. (గలతీ. 5:22) అందులో ఇతరులకు మేలు చేయడం ఇమిడి వుంది గనుక మనం దీనత్వం, దయ కలిగివుండటానికి సహాయం చేస్తుంది. యెహోవా పనిలో లీనమై వుండడం లోకం నుండి మనల్ని కాపాడుతుంది.—1 కొరిం. 15:58.
6 సవాలు నెదుర్కొనుటకు సహాయం: ఈ అత్యంత ఉత్తేజకరమైన పనిలో ఎలా భాగం వహించాలనేది క్రొత్తవారు నేర్చుకోవలసిన అవసరత వుంది. వారికి ధైర్యముండదు గనుక వారు ఇంటింటికి వెళ్లడమన్న తలంపుకే నిరుత్సాహ పడవచ్చు. సాధారణంగా ఎదురయ్యే అభ్యంతరాలను గూర్చి, మనమివ్వ వలసిన సమాధానాలను గూర్చి క్రొత్తవారితో మనం చర్చించవచ్చును. సంభాషణను ఆటంకపరచువారికి ప్రత్యుత్తరమివ్వడం అనేదానిపై రీజనింగ్ పుస్తకంలో ఇవ్వబడిన కొన్ని మంచి సలహాలను ఉపయోగిస్తూ మనం అభ్యాసము చేయవచ్చు. ప్రాంతీయసేవ కొరకు సిద్ధపడుటకై వారికెందుకు సహాయం చేయకూడదు? ప్రాంతీయసేవ కొరకైన కూటములకు క్రమంగా హాజరగుట ద్వారా ఎక్కువ అనుభవంగల ప్రచారకులతో పనిచేయడం ద్వారా, కూడ వారు ఎంతో సహాయం పొందవచ్చు. గుంపుతో కలిసి పనిచేయడం ఎంతో ప్రోత్సాహకరంగా వుండగలదు.
7 మనం ఇంటింటికి వెళ్లినప్పుడు, మన దేవుడైన యెహోవాకు ప్రాతినిధ్యం వహించే ఆధిక్యత మనకుంటుంది. దేవుని జతపనివారు కాగల్గడం కంటే ఒకరు ఇంకే గొప్ప ఆధిక్యతను పొందగలరు? (1 కొరిం. 3:9) మనమాయనపై ఆధారపడినట్లయిన, ఇంటింటి పరిచర్యలో సవాలునెదుర్కొనుటకు ఆయన ఆత్మ మనకు సహాయం చేస్తుంది.—2 కొరిం. 3:5.