ది గ్రేటెస్ట్ మ్యాన్ హు ఎవర్ లివ్డ్ పుస్తక పఠనము
1 మే 10తో ప్రారంభమయ్యే వారంలో మనము ది గ్రేటెస్ట్ మ్యాన్ హు ఎవర్ లివ్డ్ అనే పుస్తకాన్ని సంఘ పుస్తక పఠనములలో ఉపయోగిస్తాము. యేసుక్రీస్తు జీవితాన్ని ఆయన పరిచర్యను పునఃసమీక్షించుట ఎంత ఆనందదాయకము! మనము పఠించిన ఇతర పుస్తకాలకంటే భిన్నంగా ఈ పుస్తకం కూర్చబడివున్నందున, ఇచ్చట ఇవ్వబడే కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉపయోగకరంగా ఉంటాయి.
2 ఈ పుస్తకానికి పేజీ నెంబర్లు లేనందున మన రాజ్య పరిచర్యలో ప్రచురించబడే పఠన పట్టిక వారానికి మూడు నుండి నాలుగు అధ్యాయాల వరకు ఉంటుంది. అధ్యాయాలు 35, 111, 116 పెద్దవి గనుక ఒక్కొక్కటి రెండు పఠనాలుగా విభజించబడతాయి. ఒక అర్హతగల సహోదరుడు ఒక అధ్యాయాన్నంతా, లేక (35, 111, 116 అధ్యాయాలలోనైతే ఒక ఉపశీర్షికనంతా) చదువుతాడు. తర్వాత పఠన నిర్వాహకుడు అధ్యాయం చివరలోనున్న ప్రశ్నలను అనగా చదవబడిన భాగానికి లేక అధ్యాయానికి తగిన ప్రశ్నలను అడుగుతాడు. జవాబులు ఎప్పుడూ అధ్యాయమందు వరుసరీతిగానే ఉండవు. క్లుప్తమైన సూటియైన వ్యాఖ్యానములు ఆ పాఠముపై ఆధారపడినవైయుండాలి.
3 ఆ తర్వాత సమయమనుమతించేకొలది, అధ్యాయం చివర సూచించబడిన లేఖనాలన్నిటిని చదవాలి. సూచించబడిన లేఖన భాగములు పెద్దవైతే అనేకమంది ప్రచారకులు చదువుటకు వీలుగా దాన్ని విభజించవచ్చును. తరువాత చదివిన భాగంపై వ్యాఖ్యానములు చేయవచ్చును. నిర్వాహకుడు సూటియైన ప్రశ్నలను తయారుచేసుకొన్నయెడల అవి మనము చదివే లేఖనములు పుస్తకములో ఉన్నతపరచబడిన భాగమునకు ఎలా సంబంధమును కలిగివున్నాయో చూపే వ్యాఖ్యానములను రాబట్టుటకు సహాయంచేస్తాయి. ప్రశ్నలన్నీ హాజరైన ప్రేక్షకులందరు యేసు జీవిత విధానము, ఆయన బోధలపై వారి అవధానమును నిలిపేలాగున ఉండాలి.
4 గ్రేటెస్ట్ మ్యాన్ పుస్తకము యేసు జీవితమును ఒక కాలక్రమ వరుసలో పరిశీలిస్తుంది. ఆ సంఘటనలను మనస్సులో దృష్టీకరిస్తూ, అవి ఎక్కడ జరిగాయో మనస్సులో నాటింపజేసుకొనడం వాటిని జ్ఞాపకముంచుకోవడానికి నిజంగా సహాయపడగలవు. కావున రంగులతో వర్ణించబడిన దృష్టాంతములను పరిశీలిస్తూ, ఉపోద్ఘాతము తర్వాత పుస్తకానికి మొదట్లో కనిపించే పటమును తరచుగా సూచించండి.
5 పుస్తకమునందలి ఉపోద్ఘాతము మొదటి వారంలో పరిశీలించబడుతుంది. ఉపశీర్షిక క్రిందవున్న పేరాలన్నిటిని చదివిన తరువాత తాను సిద్ధపడిన యుక్తమైన ప్రశ్నలను నిర్వాహకుడు అడుగుతాడు. ఈ మొదటి పఠనము, తర్వాతి పఠనముల గ్రహింపుకు మార్గం సరాళము చేస్తుంది. సమాచారమును ఎంతమేరకు పరిశీలిస్తామనేది హాజరయ్యే వారందరి సిద్ధపాటుమీద ఆధారపడివుంటుంది. జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి, మన రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తునుగూర్చి సమకూడిన వారందరు ఎక్కువగా నేర్చుకొనేలా సహాయపడేందుకు ముఖ్యంగా నిర్వాహకుడు ప్రతివారం బాగా సిద్ధపడాలి.