బ్రోషర్లను ఉపయోగించుటకు జ్ఞాపకముంచుకోండి
ఇంటింటికి లేక తటస్థంగా సాక్ష్యమిస్తున్నప్పుడు, మన ఆకర్షణీయమైన బ్రోషర్లలో ఒకదానియందు వ్రాయబడిన విషయం వైపుకు అనేకసార్లు మన సంభాషణ మరలవచ్చు. మేనెలలో వాచ్‌టవర్, అవేక్! చందాలను సేకరిస్తున్నప్పుడు ఇది మన మనస్సులో వుంచుకోవచ్చు. మీ పరిచర్యలో మీరుపయోగించే పత్రికలతోపాటు రకరకాల బ్రోషర్లనుంచు కోవడం ద్వారా సమర్థవంతమైన సాక్ష్యమివ్వటానికి అవసరమైన దానిని అందజేయుటకు సిద్ధంగా వుండగల్గుతారు. ముఖ్యంగా మన సమస్యలు అనే బ్రోషర్ మన ప్రాంతంలో వున్న వ్యక్తులకు సహాయం చేయటానికి తయారు చేయబడింది. చందా చేయటానికి ఒక వ్యక్తి ఆసక్తి చూపించని యెడల, మేనెలలో బ్రోషర్లలో ఏదైనా ఒకదాన్ని (స్కూలు బ్రోషర్ కాదు) మీరు అందజేస్తున్న పత్రికలతో పాటు లేక పత్రికలకు బదులు రూ. 4.00కు అందజేయటానికి వెనుకాడకండి.—సామెతలు 15:23 పోల్చండి.