తప్పక తిరిగి దర్శించండి
1 పందొమ్మిది వందల తొంభైరెండు, ఏప్రిల్ 22, అవేక్! 32పేజిలో నివేదించబడిన ప్రకారము, ఒక సెమి-రిటైర్డ్ అటార్ని ఇలా వ్రాశాడు: “గత రెండు సంవత్సరాలలో నేను నాలుగు సార్లు [క్రియేషన్ పుస్తకమును] చదివాను. కానీ దాని లోతైన పఠనము, పాండిత్యము, సాక్ష్యాధార వివరణా పద్ధతిని బట్టి ఇంకా ముగ్ధుడనౌతూనే ఉన్నాను. దయచేసి దాన్ని ప్రచురిస్తూనే ఉండండి. ఇది ప్రపంచంలోని ప్రతి వ్యక్తి చేతిలో ఉండాలి. అలా ఉన్నట్లయితే, మన పుట్టుకను గూర్చిన గందరగోళం, అవాచ్యమైన విమర్శతోపాటు, దేవుడులేడనే నమ్మకాలు వెంటనే తొలగిపోతాయి.”
2 ఇంత మంచి ఆమోద ముద్ర కలిగిన మంచి ప్రచురణను, సాధ్యమైనంత ఎక్కువమంది ఆసక్తిగలవారికి అందేలా చేయటంలో మనం హృదయపూర్వక మద్దతునివ్వాలను కోవద్దా? అయితే ఈ ప్రచురణపట్ల వారి ఆసక్తిని ఎడతెగక పురికొల్పునట్లు మనం తప్పక పునర్దర్శనములను చేయాలి.
3 మనలో అనేకమంది పరిణామ సిద్ధాంతికుల వలన లేవదీయబడిన అనేక క్రొత్తక్రొత్త సిద్ధాంతాలను గూర్చి బాగా లోతుగా పఠించలేదు. అయినప్పటికి, మానవజాతి సృష్టికర్తయైన, యెహోవా దేవున్ని అగౌరపరచుటకు ఈ పరిణామ సిద్ధాంత బోధను ఒక మార్గంగా సాతాను ఉపయోగిస్తున్నాడని కావల్సినంత నిదర్శనమును యథార్థ హృదయులైన వ్యక్తులకు చూపించటానికి అది అవసరంలేదు. కొంతమంది గృహస్థులు అడిగే సాంకేతిక పరమైన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేనేమోనని భయపడి తిరిగి దర్శించటానికి వెనుకాడ వద్దు. ఈ ప్రచురణ చేసే ప్రతి వ్యాఖ్యానానికి తగినంత సాక్ష్యాధార వివరణను అదే ఇస్తున్నది.
4 అదనంగా, 16 నుండి 20 అధ్యాయముల వరకు మానవజాతి పుట్టుక, భూమి మరియు మానవుని యెడల దేవుని సంకల్పము, నేడు మానవజాతి ముందున్న అవకాశాన్ని గూర్చి ఎంతో అధికమైన సమాచారం ఉన్నది. కావున పునర్దర్శనములు చేయుటకు ఎంతో శ్రేష్టమైన సమాచారం అందుబాటులో ఉన్నది.
5 మీరు ప్రచురణలు అందించిన కొన్నిచోట్ల పునర్దర్శనములు చేయుటకు కొంత వెనుకాడుతున్నట్లయిన, సంఘములో అనుభవముగలవారిని లేక ఈ పరిణామ బోధనుగూర్చి బాగా తెలిసిన ఒకరిని మీ వెంట తీసుకొని వెళ్లవచ్చును. దీనికొరకు పాఠశాలలో ఈ సబ్జెక్ట్‌ను చదువుతూ, దాని ప్రస్తుత సిద్ధాంతాలతో పరిచయమున్న అట్టి పాఠశాల వయస్కులైన సహోదరుడు, లేక సహోదరిని ఉపయోగించు కొనవచ్చును. లేక మీ సంఘములో ఒకప్పుడు పరిణామ సిద్ధాంతాన్ని నమ్మి, తరువాత బైబిలు సత్యమును నేర్చుకొని పరిణామ సిద్ధాంతపు అబద్ధ బోధలను ఖండించుటలో ప్రస్తుతం బాగా తోడ్పడగల మరెవరినైనా ఉపయోగించు కొనవచ్చును.
6 క్రియేషన్ పుస్తకంలోని 19 అధ్యాయం వైపు అవధానమును మళ్లించి, మీ పునర్దర్శనానికి ఆధారంగా బైబిలు యిచ్చే భవిష్యత్ నిరీక్షణను ఉపయోగించుటకు వెనుకాడ వద్దు. ఒక వ్యక్తి భవిష్యత్తుకొరకైన బైబిలు ప్రవచనములకు అవధానమిచ్చేలాగున ప్రోత్సహించే అనేక అంశాలు ఆ అధ్యాయములో ఉన్నవి. బహుశా మీరు 236 పేజీలో “ది ఎర్త్ ట్రాన్స్‌ఫార్మ్‌డ్” అనే ఉపశీర్షిక క్రింద ప్రారంభమయ్యే భాగాన్ని, దాని తరువాత 238-9 పేజీలలో “ఏన్ ఎండ్ టు పావర్టీ” మరియు “నో మోర్ సిక్‌నెస్” అనే వాటిని ఉపయోగించవచ్చును.
7 ఈ మంచి ప్రచురణ అనేకమంది ప్రజలు జీవమార్గమును కనుగొనేందుకు సహాయపడింది. ఈ క్రియేషన్ పుస్తకము జీవము మరియు అదేలా వచ్చింది అనే అంశంమీద చెప్పేదాన్ని చదివి, పరిశీలించమని ప్రోత్సహించుట ద్వారా ఇంకను ఇతరులను ప్రోత్సహించగలము.