ఆసక్తిని రేకెత్తించు పరిచయ ప్రసంగములు
1 ప్రాంతీయ పరిచర్యలో కలిసే ప్రజలయెడల మనమెల్లప్పుడు ఆప్యాయకరమైన, వ్యక్తిగత శ్రద్ధను ప్రదర్శించాలి. ఆయా విషయాలపై వారి అభిప్రాయమును అడుగుట వారి దృక్పథముయెడల మన గౌరవాన్ని ప్రదర్శించును. మనము పరిచయముచేసే అంశాలు, లేవనెత్తే ప్రశ్నలు వారి ఆలోచనను పురికొల్పి, దేవుని గూర్చి మానవజాతియెడల ఆయన సంకల్పాన్నిగూర్చి వారు ఎక్కువగా నేర్చుకొనుటకు ఇష్టపడేలా చేయవచ్చును.
2 అక్టోబరు మాసంలో లైఫ్—హౌ డిడ్ ఇట్ గెట్ హియర్? బై ఎవల్యూషన్ ఆర్ బై క్రియేషన్? అను పుస్తకమును మనం అందించే కొలది వారి అవధానాన్ని సృష్టిని గూర్చిన సత్యముపై మళ్లించగల్గుదుము. ఈ ప్రచురణను వ్యక్తిగతంగా పునఃసమీక్షించుటకు సమయము తీసుకొని, ఉన్నతపరచుటకు నిర్దిష్టమైన అంశాలను ఎంపిక చేసుకొనుము. క్రియేషన్ పుస్తకములోని సమాచారమును చర్చించునప్పుడు దాన్ని తెరచి ఇంటివారి చేతికియ్యండి. నిర్దిష్టమైన అంశాలను లేక దృష్టాంతములను సూచించండి. మనస్సును ఆకట్టుకొనే ఈ ప్రచురణ విలువను చూపించేటప్పుడు ఉత్సాహంగా ఉండండి.
3 మిమ్మును మీరు ఉత్సాహపూరితంగా పరిచయము చేసుకొన్న తర్వాత మీరిలా చెప్పవచ్చును:
◼ “ఈ ఆధునిక, శాస్త్రీయ విజ్ఞానంగల లోకంలో మనలను, మనం నివసించే ఈ అందమైన భూమిని సృష్టించిన దేవుడున్నాడని నమ్ముట కారణసహితంగా ఉంటుందా? [జవాబు చెప్పనివ్వండి.] ఈ భూమిని, విశ్వమంతటి విశాలతను, వాటి అద్భుతములను పరిశీలించినప్పుడు వాటి క్రమము నిర్మాణమునుబట్టి మనం ముగ్ధులమౌతాము. సృష్టికర్త ఉన్నాడని ఇది సాక్ష్యమిచ్చుట లేదా? ఈ విషయంపై బైబిలెట్లు తర్కిస్తుందో గమనించండి. [హెబ్రీయులు 3:4 చదవండి.] సహేతుకంగా ప్రతినిర్మాణము దానిని రూపించిన వాన్ని, నిర్మాణకున్ని కల్గివుంటుంది. [క్రియేషన్ పుస్తకమును బయటకు తీసి 114వ పేజీలో ఉన్న దృష్టాంతమువైపు త్రిప్పండి.] మన విశ్వము ఎంతో ఆశ్చర్యాన్ని, భీతిని కల్గించేది! అది దానంతటదే ఉనికిలోకి వచ్చిందని మీరునుకుంటారా?” 122వ పేజీకి త్రిప్పి చేతిగడియారం పటం క్రిందనున్న ముఖ్య వాక్యాన్ని చదవండి. 127వ పేజీలో ఎత్తివ్రాయబడిన లేఖనాన్ని మరియు దృష్టాంతాన్ని కూడ ఉపయోగించవచ్చును. అదనంగా యితర సహాయకరమైన అంశాలను రీజనింగ్ పుస్తకము 84-8పేజీలలో చూడవచ్చును.
4 లేక మీరిలా చెప్పవచ్చును:
◼ “ఈ భూమిపై నిజమైన శాంతి సంతోషములను కనుగొనటానికి మానవజాతికి ఏమి అవసరమని మీరనుకుంటారు? [జవాబు చెప్పనివ్వండి.] మనము దేవునికి భయపడి ఆయనను భూమ్యాకాశములకు సృష్టికర్తగా ఒప్పుకోవాలని బైబిలు చెప్తుంది. ప్రకటన 14:7 చదివి, క్రియేషన్ పుస్తకం 140 మరియు 141 పేజీల వైపు త్రిప్పండి. సాధ్యమైనంత మట్టుకు, భూమి మానవ నివాసమునకే రూపించబడినదని వివరించే 24, 25 పేరాలను చదవండి. ఇంటివారి ఆసక్తినిబట్టి సంభాషణను ఇంకా పొడిగించాల్సి వస్తే, 19 అధ్యాయమువైపు త్రిప్పి త్వరలో భూపరదైసు ఎలా వాస్తవమౌతుందో వివరించండి.
5 ఇంటివారు సృష్టికర్త ఉనికిని గూర్చి సందేహాలను వ్యక్తంచేస్తే, మీరిలా చెప్పవచ్చును:
◼ “ప్రత్యేకంగా లోకములో ఉన్న బాధంతటిని బట్టి మీ భావాలనే అనేకమంది కల్గియున్నారు. దేవుడే ఉన్నట్లయితే, బాధనెందుకు ఆయన అనుమతించాలి? ఏదైన సహేతుకమైన వివరణనుగూర్చి మీరు ఆలోచించగలరా?” వచ్చే సమాధానాన్ని బట్టి, చర్చను కొనసాగించేందుకు క్రియేషన్ పుస్తకము 16వ అధ్యాయాన్ని మీరు ఉపయోగించవచ్చును. లేక అతడేదో కొంచెం ఆసక్తి చూపితే, ది వాచ్‌టవర్ సెప్టెంబరు 15, 1992 ఇంగ్లీషు సంచికలోని “వై డు గుడ్ పీపుల్ సఫర్?” (మంచివారు ఎందుకు బాధపడతారు?) అనే శీర్షికనుండి ఒకటి లేక రెండు అంశాలను మీరు ఉన్నత పర్చవచ్చును. ఈ ప్రశ్నకు అదనంగా సహాయకరమైన జవాబులు రీజనింగ్ పుస్తకములో 399-400 పేజీలలో చూడవచ్చును. కొన్నిసార్లు ఎందుకు నీవు బైబిలును నమ్మగలవు? అను కరపత్రాన్ని ఇచ్చుట కూడా సముచితంగా ఉంటుంది.
6 మన ఉద్దేశము రాజ్యవర్తమానము యెడల కేవలం ఆసక్తిని పురికొల్పుటయే గాక, బైబిలు పఠనములను కూడా ప్రారంభించుటైయున్నది. సృష్టిని గూర్చిన సత్యమును వివరిస్తూ, మన గొప్ప సృష్టికర్తను ఘనపరచు ఈ రమ్యమైన వర్ణనలుగల పుస్తకమును కలిగియుండుటకు మనమెంతగా సంతోషించెదము! అక్టోబరులో మనం కలిసే యథార్థ హృదయులైన ప్రజల ఆసక్తిని రేకెత్తించుటకు దానిని బాగా ఉపయోగించుదము.