ఆసక్తిని తిరిగి రేకెత్తించవచ్చా?
1 “ఆత్మవిషయమై దీనులైనవారు (ఆత్మీయ అవసరతలయెడల మనస్సుగలవారు NW) ధన్యులు.” (మత్త. 5:3) కొండమీది ప్రసంగములో యేసు చెప్పిన ఆ మాటలు ఎంతో అర్థంతో నిండియున్నవి. మానవజాతిలో అనేకమంది తమ జీవితములను సంతోషంగాను, సంకల్పసహితంగాను చేసుకొనుటకు వారికి ఆత్మీయ విషయాలు అవసరమనే విషయాన్ని గుర్తించటంలేదు. ఒక సమయములో ఆత్మీయవిషయములందు మనస్సుగలవారై తరువాత దాన్ని పోగొట్టుకొన్నవారు కొందరున్నారు. ఏదో ఒకటి వారిని ఆత్మీయ విషయాలలో చల్లబడిపోవునట్లు చేసింది. తమకు నిజముగా ప్రయోజనకరమైన దానినుండి వారు తొలగిపోయారు. అయితే ప్రశ్న ఏమంటే, అటువంటి వారి ఆసక్తిని తిరిగి రేకెత్తించవచ్చా? సంతోషదాయకంగా, కొందరి విషయంలో అలా చేయవచ్చును.
2 మీకు కొన్ని సంవత్సరముల క్రితము, బహుశా బాలునిగానైనను యెహోవాసాక్షులతో బైబిలు పఠించి, దేవుని ప్రజలతో సహవాసమును కొనసాగించని ఎవరైనా తెలిసియుండవచ్చును. కొన్ని బైబిలు బోధలు, నీతియుక్తమైన సూత్రములు వారి మనస్సులలో ముద్రవేసి వారికింకా జ్ఞాపకముండి యుండవచ్చును. ప్రపంచ పరిస్థితులు చెడిపోతూ, జీవిత పరిస్థితులలో మార్పులు జరిగేకొలది, గతంలో నేర్చుకొనిన సంగతులను ఒక వ్యక్తి తిరిగి జ్ఞాపకం చేసుకొని దేవునివైపు తిరిగి, బైబిలును గూర్చిన జ్ఞానమును ఎక్కువగా నేర్చుకొనుటకు సంసిద్ధత కలిగియుండవచ్చును. అటువంటి వ్యక్తులను బైబిలు పఠనము పునఃప్రారంభించే ఉద్దేశముతో దర్శించుట ఎంతో ప్రతిఫలదాయకము కాగలదు.
3 నిశ్చయంగా అప్పుడప్పుడు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారిని దర్శించుటకు ప్రయత్నము చేయవలెను. నిజముగా నీవు వారి ఆత్మీయ క్షేమము కొరకై శ్రద్ధకలిగియున్నావని వారు తెలుసుకునేలాజేసి, వారితో బైబిలు పఠించే అవకాశాన్ని చూపుము. “వెలుగు ప్రకాశకుల” జిల్లా సమావేశములకు హాజరయ్యేవారికి సహాయం చేయటానికి ప్రత్యేకంగా కృషిచేయవలెను. కొన్ని సందర్భాలలో అభివృద్ధి చూపనందున పఠనము కొనసాగనట్టి వ్యక్తిని మరో ప్రచారకుడు దర్శించుట ప్రయోజనకరంగా ఉండగలదు.
4 అవును, మనము పఠనముచేయు ప్రజలు యెహోవా ఆరాధనను గంభీరంగా తీసుకొని, బైబిలు పఠనములో కొంత పట్టుదలను వారు కనపరచాలని మనము ఆశిస్తాము. అయితే మనమట్టుకు మనమైతే వారికి సహాయపడటానికి తగినంత కృషిచేసి అపొస్తలుడైన పౌలు చెప్పినట్లే “నేను అందరి రక్తము విషయములో నిర్దోషిని” అని మనము కచ్చితంగా చూసుకొనవలెను.—అపొ. 20:26.