ఎక్కువ జాగ్రత్త—మంచి సేవ
◼ చందాదారులకు పత్రికలను వేగముగా పంపించుటకు ఈ క్రింది అంశములకు మీరు ఎక్కువ జాగ్రత్తనిచ్చినట్లయిన ఎంతో సహాయకరంగా ఉండగలదు:
1. చందాదారుడు పత్రికలను పొందుట ఆరంభమగుటకు 8-10 వారములు పట్టును.
2. దయచేసి అడ్రసును చదువుటకు స్పష్టంగా ఉండులాగున విడి అక్షరాలలో వ్రాయండి లేక టైపు చేయండి.
3. చందా చీటీలపై తప్పని సరిగా పిన్‌కోడ్ మరియు పత్రిక కావలసిన భాష పేరు ఉండవలెను.
3. అడ్రసు మీ సంఘ ప్రాంతమునకు వెలుపలిదైన సంఘ నెంబరు కోసం విడువబడిన ఖాళీ స్థలమున అడ్డముగా గీతగీయండి. (బహుమతిగా పంపు పత్రిక చందాలపై మీ సంఘ నెంబరు ఉండవచ్చును.)
5. పత్రికచందాలను తిరిగి నూతనపరచునప్పుడు దయచేసి ఎక్స్పైరింగ్ సబ్స్క్రిప్ష్న్ స్లిప్‌నే (M-91 మరియు M-191) ఉపయోగించి, సంఘములో ఇవ్వండి. సంఘము వాటినే సొసైటికి తిరిగి పంపును.
6. చందా పత్రికను పంపు అడ్రసును మార్చమని కోరినప్పుడు, సబ్స్ర్కిప్ష్న్ ఛేంజ్ ఆఫ్ అడ్రసు ఫారంను (M-205) ఉపయోగించండి.
◼ సెక్రెటరీలు దయచేసి క్రిందివాటిని గుర్తించగలరు:
1. సొసైటికి పంపించే స్లిప్పై వేయబడు వెల, M-203 ఫారంపై ఉండు వెలకు సమానంగా ఉండవలెను.
2. సబ్స్క్రిప్ష్న్ స్లిప్‌లను కలిపి పిన్ చేయవద్దు.
3. డిస్ట్రిబ్యూటర్ ఆర్డర్ ఫారంపై (M-AB-202) సంఘ పోస్టల్ అడ్రసు ఉండకూడదు. దానిపై కేవలము మీ సంఘము పేరు, నెంబరు ఉండవలెను. మార్పు అవసరమైనయెడల “డిస్ట్రిబ్యూటర్స్ మ్యాగజైన్స్ ఛేంజ్ ఆఫ్ అడ్రస్ ఓన్లీ” ఫారం (M-206) పంపండి.
పైన పేర్కొనబడిన అంశములకు శ్రద్ధగా అవధానమిచ్చినట్లయిన, మన పత్రికలకు చందాకట్టువారికి మంచి సేవలనందించుటకు అలాగే ది వాచ్‌టవర్, అవేక్! పత్రికల డిస్ట్రిబ్యూటర్స్ ఆర్డర్స్‌ను బాగుగా నిర్వహించుటకు గొప్పగా సహాయపడగలదు.