ది వాచ్‌టవర్‌తో సువార్తను ప్రకటించుము
1 దివాచ్‌టవర్ (కావలికోట) నిజంగా సాటిలేనిది. ఎందుకనగా అది సువార్తను అందించునది. అందుకు భిన్నంగా, పెక్కు లోకప్రచురణలైతే హృదయమును కృంగదీయునట్టి చెడువార్తలను అందించును. వాచ్‌టవర్ ప్రత్యేకమైనదని, అది నిజంగా తెప్పరిల్లజేయు వర్తమానమును కలిగివుందని మనము ఇతరులకు ఎట్లు చూపగలము?
2 ఇందుకు మనము పత్రిక రెండవ పేజీలోని “పర్పస్ ఆఫ్ ది వాచ్‌టవర్ (కావలికోట ఉద్దేశ్యము)” అను దానివైపు అవధానమును మళ్లించవచ్చును. దాని ఉద్దేశ్యము యెహోవాను సార్వభౌముడైన పరిపాలకునిగా ఘనపరచుట, బైబిలు ప్రవచనములను నెరవేర్చుచున్న ప్రపంచ సంఘటనలను పరిశీలించుట, బాధించబడు వారికి ఓదార్పుకరమైన వర్తమానమును అందించుట, మనరక్షణ కొరకు దేవుడు చేసిన ఏర్పాటులందు విశ్వాసమును బలపరచుట అని చూపించుము.
3 వాచ్‌టవర్ ను, గూర్చిన మన వ్యాఖ్యానములు అట్టి తలంపులను ఒప్పింపజేయురీతిలో వ్యక్తపరుస్తున్నవా? మనము చెప్పేది, కేవలము క్షణికకాల ఆసక్తిని రేకెత్తింపజేయు ఆకర్షణీయమైన మాటగా ఉండకూడదు; దానిలో సారముండాలి, అది ఎక్కువగా నేర్చుకోవాలను కోరికను కలుగజేయగల నమ్మకమును ప్రేరేపించేదై ఉండాలి.
4 సిద్ధపాటు అవసరము: ప్రతి పత్రికను, దానిలోని భిన్నమైన అందింపులను మన ప్రాంతమును మనసులో పెట్టుకొని అందుకు తగినట్లుగా విశ్లేషించుకొంటూ జాగ్రత్తగా చదవాలి. సూచించబడిన లేఖనములను చూచుట మన స్వంత అవగాహనను వృద్ధిచేస్తుంది. ఇది సత్యముయెడల మనమెప్పును అధికముచేసి దానిని ఇతరులతో పంచుకొనునట్లు పురికొల్పుతుంది. సత్యము మన హృదయములో లేనట్లయిన, దానిని బయటకు మాట్లాడగలిగిన ప్రేరణ మనలో ఎక్కువవుండదు.
5 సాధారణంగా అనుకూల దృక్పదము కలిగియుండుట ఎంతో మంచిది, సాధ్యమైనంతవరకు చందాను కట్టుటకు ఆహ్వానించుము. ఆ పత్రిక ఒక మంచి లోకమును ఎదురుచూచే ప్రజల అవసరతను ఎంతగానో తీర్చునట్టిదని నొక్కిచూపుము. ఆ సమయానికి చందాకట్టుటకు నిధులులేనందున, అంగీకరించకపోతే, అనుకూలమైన మరొక సమయములో తిరిగివచ్చి చందా ఏర్పాటును చేయుటకు యిష్టపడుదునని తెలుపుము. దానికికూడ కాదంటే, రెండు పత్రికలు ఒక బ్రొషూర్ను కలిపి 9.00 రూ. అందించుటకు ప్రయత్నించుము.
6 అత్యంత నూతనమైన వాచ్‌టవర్ లోని శీర్షికలను మీరు చదువునప్పుడు, గతములో ఇంటివారితో జరిపిన చర్చలందు ఈ అంశములలో ఏవి వారి ఆసక్తిని పురికొల్పాయో జ్ఞాపకమునకు తెచ్చుకొనుటకు ప్రయత్నించుము. ఇంకా ఎక్కువగా చర్చించుటకు ఆ సంచికను నీ వెంటతీసికొని తిరిగి వెళ్లుము.
7 సువార్త ఇంకా ఎంతకాలము, ఎంత విస్తారంగా ప్రకటించబడవలెనో మనకు తెలియదు. కానీ జరుగబోవు పనిలో వాచ్‌టవర్ ఎంతో గొప్పపాత్ర కలిగియుంటుందను నిశ్చయతను మనము కలిగియుండగలము. ఈ ఏర్పాటును ఉపయోగిస్తూ, ‘యెహోవా వాక్యమును పట్టుదలతో బోధించుచు, ప్రకటించుటలో’ అపొస్తలులను మనము అనుకరించవలెను.—అపొ. కా. 15:35.