జ్ఞాపకార్థ దినము తరువాత వారిని దర్శించండి
1 “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును” వచ్చెను. (మత్త. 20:28) భూమిమీద జీవించిన వ్యక్తులలో ఎవరుకూడా యేసుక్రీస్తు మానవజాతికి చేసినదానిని చేయలేకపోయారు. తన జీవితవిధానము, చివరకు హింసామ్రానుపై మరణించుట ద్వారా ఒకడు పొందగలిగిన అత్యంత గొప్పదైన వరమగు నిత్యజీవమును పొందు మార్గమునకు మనము నడిపించబడ్డాము. గాని ఎక్కువమంది ప్రజలకు క్రీస్తు చేసినదానియెడల ఎక్కువ మెప్పులేదు.
2 యేసు పదిమంది కుష్టరోగులను ఎదుర్కొనినప్పుడు జరిగినదానిని పరిశీలించుము. వారు యేసును చూచి “యేసూ, ప్రభువా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి.” (లూకా 17:13 ) ఆయనవారిపై కరుణచూపి, ధర్మశాస్త్రప్రకారము ఉపదేశించుచు, మీరువెళ్లి యాజకునికి కనపరచుకొనుడని చెప్పెను. మార్గమున వెళ్లుచుండగా ఆ పదిమంది కుష్టరోగులు శుద్ధులైరి.
3 అయితే ఒక్కడు మాత్రమే యేసుకు కృతజ్ఞతలు తెల్పుటకు తిరిగివచ్చెను. ఆ తక్కిన తొమ్మిదిమందో? వారు తమకు మేలుచేసినవానిని గూర్చి ఏమాత్రము తలంచక తమ మార్గమున తాము వెళ్లిపోయిరి. (లూకా 17:15-17) మనము ఎవరిని పోలియుండవలెను? తిరిగి వెనుకకు వెళ్లిన మనుష్యునివలె మనముండ గోరుదుము. అతను నిజమైన మెప్పును కలిగివుండెను. క్రీస్తు మరణమును గూర్చి మనమును ఆలాగే భావింతుమా?
4 మన మెప్పును చూపుట: జ్ఞాపకార్థదిన తారీఖునకు ముందు వారములో బైబిలులోని కొన్ని నిర్దిష్ట వచనములను చదవమని ప్రతిసంవత్సరము సొసైటి సూచిస్తుంది. ఈ సంవత్సరము చదువుటకు సూచించబడిన బైబిలు భాగములు 1992 యెహోవాసాక్షుల కేలండరులో ఏప్రిల్ 12-17 తారీఖులలో కన్పించును. యేసు మరణమునకు కేవలము కొంచెము ముందు జరిగిన సంఘటనలను చదువుట, ధ్యానించుటద్వారా నీవు నీ మెప్పును చూపించావా?
5 మన ప్రాంతీయ సేవాకార్యక్రమము జ్ఞాపకార్థదినము యెడలగల మనమెప్పుకు సంబంధం కలిగివుంది. పయినీర్లు, ప్రచారకులు ఏప్రిల్ మరియు మే మాసాలలో తమ ప్రాంతీయపనిని ఎక్కువగా చేయుటకు వీలుగా పెద్దలు మంచి క్రమబద్ధమైన ఏర్పాటులను చేసివుంటారు. ఈ మాసములలో అనేకులు సహాయ పయినీరు పనిలో పాల్గొందురు. గత సంవత్సరము ఏప్రిల్లో 877 మంది, మే లో 1052 మంది ఈ పనిలో భాగము వహించారు. మరి ఈ సంవత్సరము సంగతేమి? మే నెలలో మీరు ఆలాగుచేయగలరా? ఒకవేళ, సహాయ పయినీరుగా చేయలేకపోతే, పరిస్థితులు అనుమతించినంతవరకు ప్రకటించు పనిలో మీవంతును ఎక్కువ చేసికొనుటకు పథకము వేసికొనండి.
6 ఇతరులలో మెప్పును నిర్మించుము: ప్రతిసంవత్సరము జ్ఞాపకార్థదిన ఆచరణ సమయంలో ఆసక్తిగల అనేకులు మనతో కలియుదురు. ఉదాహరణకు గత ఏప్రిల్లో ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకార్థదినమునకు హాజరైన 1,06,50,158 మందిలో 63,70,000 మందికంటె ఎక్కువ ఆసక్తిగల వ్యక్తులే. సంస్థ పెరుగుటకు ఎంతో గొప్ప అవకాశమున్నదని ఇది చూపుతుంది.
7 జ్ఞాపకార్థదిన ఆచరణ తర్వాత వెళ్లి వారిని దర్శించుటకు మనము ఏమి చేయుదము? అనేకమంది క్రొత్తవారు ఆ సమయములో మనతో కూడుకొన్నారు. తద్వారా కలిగిన ఆసక్తిని మృతము కానివ్వొద్దు త్వరగా తిరిగివెళ్లి దర్శించండి. ఆసక్తిగలవారి యెదుటవున్న అద్భుతకర నిరీక్షణను చూపుటకు బహుశా మీరు, ప్రకటన 7:9, 10 ని ఉపయోగించ వచ్చును. ఈ పాతలోకము నుండి తప్పించబడువారు ఏమి చేయవలెనని కోరబడుతున్నారు? మరలా, ప్రకటన 7:10 కి త్రిప్పి, “విశ్వాసముంచవలె” నని గ్రహించునట్లు సహాయపడుము. కేవలము సంవత్సరానికొకసారి క్రీస్తు మరణ జ్ఞాపకార్థమునకు హాజరగుటయే దానికి సరిపోదని గ్రహించునట్లు కూడా వారికి సహాయపడుము.—యోహా. 3:16.
8 నిస్సంశయముగా, ప్రతి సంవత్సరము క్రీస్తు మరణ జ్ఞాపకార్థమనునది ఎంతో ప్రత్యేక సంఘటనయే. దానికొరకు బాగా సిద్ధపడుట ద్వారా, యెహోవా మరియు యేసుక్రీస్తు మనకొరకు చేసినదానంతటియెడల మనమెప్పును కనపర్చుదుము. అదే మెప్పును మన బైబిలు విద్యార్థులలోను, ఇతర ఆసక్తిగలవారిలోను నిర్మిస్తూనేవుండుడి. ఎందుకనగా యేసుక్రీస్తుద్వారా యెహోవా ఏర్పాటుచేసిన విమోచన క్రయధన ఏర్పాటునందు విశ్వాసమును కనబరుచుటకు వారికిది సహాయము చేయును.