మన ప్రాంతములోని యౌవనులకు సహాయపడుట
1 యౌవనులు ఎదుర్కొను సమస్యలు, ప్రశ్నలు నిజంగా వారిని గలిబిలిలో ముంచుతున్నవి. కీర్తన రచయిత అడిగినదేమనగా, “యౌవనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు?” మరో మాటలో చెప్పాలంటే, గలిబిలిలో ముంచుతున్న వారి ప్రశ్నలకు ఆచరణాత్మకమైన సమాధానములను పొందునట్లు యౌవనులకు సహాయమును ఎట్లు అందించవచ్చును? వారి ప్రశ్నలలో కొన్ని ఏమనగా, ‘మత్తుమందులను, మత్తుపానీయములను నేను వాడటం మంచిదా?, వివాహానికిముందే లైంగిక సంబంధమును అనుభవించకూడదా?, ఎటువంటి వృత్తిని నేను ఎన్నుకోవాలి?’. వీటికి కీర్తన రచయిత సమాధానము ఇలా ఉన్నది: “నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?”—కీర్తన 119:9.
2 అవును, యౌవనులకు సలహానిచ్చు అత్యంత శ్రేష్టమైన మూలము దేవుని వాక్యమైన బైబిలే. ఎందుకు? ఎందుకనగా “కలతను రేపు యౌవనేచ్ఛలను” గూర్చి బాగుగా ఎరిగినవాడైన యెహోవా దేవునివలన అది ప్రేరేపించబడినది. (2 తిమోతి 2:22, ఫిలిప్స్) అది యౌవనులకు చింతకలుగజేయు సమస్యల అసలు మూలమునకు వెళ్తూ, వారికి భవిష్యత్తు నిరీక్షణనందించును. బైబిలు సలహాను అనుసరించు వేలకొలది క్రైస్తవ యౌవనుల నిజజీవిత అనుభవాలు, దాని ఉపదేశము పనిచేస్తుందని రుజువు చేయుచున్నది. మనప్రాంతములోని యౌవనులైన వారికి సహాయముచేయుటకై ఏప్రిల్లో మనము కొశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్వర్క్ అను పుస్తకమును అందిస్తాము. అది యౌవనులు శ్రద్ధవహించు వివిధ విషయాలను పరిశీలించి, ఉపదేశమిచ్చును. దాని ఉపదేశము బైబిలుపై ఆధారపడినది!
3 యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకమునుగూర్చి యౌవనులెట్లు భావిస్తారు? ఒక పదహారేండ్ల బాలిక ఇట్లన్నది, “నేను విషయాంశముల పట్టికను చూచినప్పుడు, అది నా స్వంత జీవితములోకి చూసుకుంటున్నట్లుండెను. అందులోని చాలా ప్రశ్నలు ఎప్పుడెప్పుడో, నన్ను నేను అడుగుకొన్నవే. దానిచే ఆకర్షితురాలైన మరొక పదిహేనేండ్ల బాలిక “నేను అంత ఎక్కువగా చదువుట కిష్టపడను. అయితే ఈ పుస్తకం ఎంత బాగుందంటే, నేను దాన్ని చదువుటకు మొదలుపెట్టిన తరువాత, తిరిగి క్రింద పెట్టలేకపోయాను,” అని ఒప్పుకున్నది. పెద్దవారు కూడా ఈ పుస్తకముయెడల తమ మెప్పును వ్యక్తపరిచారు. ఒక ప్రయాణకాపరి భార్య ఈ విధంగా అన్నది, “మాకంటూ మాస్వంత పిల్లలులేరు. కానీ, సమాచారము అందించబడిన తీరు, మాక్కూడ ఎంతో విలువకరంగా ఉంది. ‘కొశ్చన్స్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్’ అనే పేరు దానికి పెడితే ఎంతో బాగుండేది.” అనేకమంది యంగ్పీపుల్ ఆస్క్ పుస్తకము చదివేటప్పుడు తమమట్టుకు తాము ప్రయోజనము పొందుతూ, దాన్ని చదువుటలో ఆనందిస్తున్నారు.
4 యంగ్పీపుల్ ఆస్క్ పుస్తకాన్ని అందరికి నిష్కపటంగా సిఫారసుచేయుము: ఏప్రిల్ మాసంలో ఇతరులతో మీరు లేఖన చర్చలలో పాల్గొనునప్పుడు, యౌవనులకైన, లేక వృద్ధులకైన యంగ్పీపుల్ ఆస్క్ పుస్తకమును చూపించుటకు సంశయించవద్దు. దాన్ని తీసుకొనువారితో వారికి అర్థంకాని భాగాలను గుర్తుచేసి ఉంచండనియు, నేను మరలా వచ్చినప్పుడు ఆ అంశాలను వారితో చర్చిస్తానని చెప్పవచ్చును. పునర్దర్శనముచేయుటకు ఇది ఎక్కువ అవకాశం కల్గించే మార్గం కాగలదు.
5 ఇంటింటిసేవలోనేగాక, ఈ యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకమును తటస్థంగా, బంధువులకు, పరిచయమున్నవారికి, వ్యాపార లావాదేవీలప్పుడు అందించవచ్చును. శక్తివంతమై దృష్టినాకర్షించు రంగురంగుల చిత్రములద్వారా నీవెట్లు ప్రయోజనము పొందావో సూచించుము. లేక విషయాంశముల పట్టిక, యౌవనులకు సంబంధించిన దానిలోని వివిధ ప్రశ్నలు, లేక ప్రతి అధ్యాయము చివరనున్న చర్చకొరకైన ప్రశ్నలను లేక ఇటాలిక్కులలోని సమాచారమునైనా సూచించుము. ఇవియేగాక మనరాజ్య పరిచర్య జనవరి 1991, పేజి 6 లో ఇవ్వబడిన సలహాలనుకూడ నీవు పునఃపరిశీలించవచ్చును.
6 యౌవనులకు, బైబిల్లోని ఆచరణాత్మక జ్ఞానముయెడల గౌరవముగల ఎవరికైనను సహాయముచేయుటకై, దేవుడు తాను ఏర్పాటుచేసుకొన్న ప్రత్యేకమార్గముద్వారా యీనాడు దేవుడు దయచేసిన ప్రచురణను కలిగియుండుట మనకు ఎంత ఆధిక్యత! యంగ్పీపుల్ ఆస్క్ పుస్తకము వంటి విలువైన సాధనమును కలిగియున్నవారమై, అనుకూల దృక్పథముతో మనము దాన్ని అందరికి అందిద్దాము. అలా చేయునప్పుడు, దేవుని నూతనలోకములో నిత్యజీవము పొందు నిరీక్షణను అనేకమంది యౌవనులు మరియు ఇతరులు చేపట్టుటకు సహాయముచేయబడి, మన సృష్టికర్తయొక్క చిత్తమును చేయుటలో మనతో వారును కలియుదురని నిరీక్షించవచ్చును.—ప్రక. 4:11.