మీ పరిచర్యలో నిపుణులు కమ్ము
1 అపొస్తలుడైన పౌలు పరిచర్యలో నిపుణతను వృద్ధి చేసుకొనుటను ప్రోత్సహించెను. ఆయన వ్రాసినదేమనగా: “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు నీ శక్తికొలది పనిచేయుము.”—2 తిమో. 2:15, NW.
2 పరిచర్యలో నిపుణత సంపాదిస్తే వచ్చేది. కావున నిపుణతగల పరిచారకులముగా కావాలనిన మనము ‘మన శక్తి కొలది’ పనిచేయవలెను—అనగా మనఃపూర్వక ప్రయత్నమును చేయవలెను. అయితే మనకు సహాయము చేయునదేమి?
దేవుని వాక్యము నుండి నేర్చుకొనుము
3 లేఖనములయొక్క మన వ్యక్తిగత జ్ఞానము మనము పరిచారకులుగా ఫలభరితమగుటపై ప్రత్యక్ష ప్రభావమును కలిగియుండును. బైబిలు బోధించు దానిని మనము ఎంత బాగా ఎరిగియుంటే “సత్యవాక్యమును సరిగా ఉపదేశించుటలో” అంత ఫలవంతముగా ఉండగలము. కావున వ్యక్తిగత పఠనమునకై సమయమును కేటాయించుకొనుట చాలా ముఖ్యము.—1 తిమో. 4:15, 16.
4 దేవుని వాక్యముతో పరిచయము కలిగియుండు మరొక విధమేమనగా బైబిలు ఆధారిత ఉపదేశమును పొందు సంఘకూటములయందు “మరి విశేష అవధానమును” నిలుపుటయైయున్నది. (హెబ్రీ. 2:1, NW) మాట్లాడదగు బహు శ్రేష్టమైన అంశములు బహిరంగ ప్రసంగములలో చర్చించబడుచున్నవి. లేక సంఘ పుస్తకపఠనమునుండి వాటిని ఎన్నుకొనవచ్చును. నిపుణతగల బోధకులగుటకు దైవపరిపాలనా పాఠశాల మనకు విలువైన తర్ఫీదునిచ్చుచున్నది. సేవాకూటము పరిచారకులుగా ఎక్కువ ప్రవీణులమగునట్లు తోడ్పడుటకు సహాయకరమగు సలహాలను, ఆచరణయోగ్యమైన ప్రదర్శనలను అందించుచున్నది. ఏమైనను, ఎక్కువ ప్రయోజనము పొందుటకు మనము బాగుగా సిద్ధపడి, కూటములలో చురుకుగా పాల్గొనవలసియున్నాము.
సలహాలను అన్వయించుము
5 పౌలు ఫిలిప్పీ సంఘమునకు తన వలన నేర్చుకొనిన వాటిని చేయుడని చెప్పెను. (ఫిలి. 4:9) అలాగే మనమును యెహోవా సంస్థనుండి నేర్చుకొనినవాటిని అభ్యాసములో పెట్టవలసియున్నాము. ఉదాహరణకు 1988, జూలై 15, ది వాచ్‌టవర్ సంచిక, 15-20 పేజీలలో తరచుగా పనిచేయబడిన స్థలములలో “క్రొత్త” ప్రాంతమును వృద్ధిచేయు మార్గములనుగూర్చి నేర్చుకొనియున్నాము. నూతనమైన, ప్రీతికరమైన, మరియు అనుకూలమైనరీతిలో సమీపించుటను నొక్కి తెలుపుటతోపాటు తమ యొద్దకు మనము క్రమముగా వస్తామని యింటివారు భావించుకొనునట్లు చేయుటకు ఆ శీర్షిక మనలను ప్రోత్సహించినది. ఒకే యింటిలోని వేరువేరు భాగములలో నివసించు వివిధ వ్యక్తులకొరకు చూచుచు యోగ్యులైనవారిని బాగా వెదకు విషయములో సలహాయివ్వబడినది. ఈ సలహాలను అన్వయించుట ద్వారా నేర్చుకొన్న వాటిని చేయుచు పరిచర్యలో మన నిపుణతలను వృద్ధి చేసుకొనుచున్నాము.
6 ప్రాంతీయ పరిచర్యలో మనము క్రమముగా రీజనింగ్ పుస్తకమును ఉపయోగించుదుమా? అందు సూచించబడిన ఉపోద్ఘాతములు మరియు సంభాషణను నిలిపివేయు వ్యక్తులకు ఎట్లు ప్రత్యుత్తరమియ్యవలెనను భాగము సాక్ష్యమిచ్చు మన నైపుణ్యములను పదును చేయును. వీటికితోడుగా సిద్ధపడుట, సంభాషణా అంశమును మరియు ఆ నెలలోని అందింపును ఎట్లు అందించవచ్చునో రిహార్సల్ చేసుకొనుట మన పరిచర్యలోని విజయమునకు తోడ్పడును.
7 మీ పరిచర్యను వృద్ధి చేసుకొనుటలో యింకా ఎక్కువ సలహాలను కోరినట్లయిన సేవాకాపరిని లేక మీ పుస్తక పఠన కండక్టరును సహాయమునకై అడుగుము. “సత్యవాక్యమును సరిగా ఉపయోగించు” పరిచారకులుగా మనమందరమును మన నైపుణ్యతలను వృద్ధి చేసికొనవచ్చును. ఇక కొద్దికాలములో యెహోవా దేవుడు ఈ దుష్టవిధానమునకు అంతము తెచ్చును. అంతవరకు రక్షణ పొందుటకు మనము చేయగలిగినంతమందికి సహాయము చేసి మన దేవుడైన యెహోవాకు ఘనత తెచ్చుట మన హృదయపూర్వక అభిలాషయై యున్నది.—యోహా. 15:8.