కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/91 పేజీ 5
  • ప్రశ్నాభాగము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగము
  • మన రాజ్య పరిచర్య—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బాప్తిస్మము తరువాత
  • బైబిలు అధ్యయనాలు నిర్వహించేందుకు “దేవుని ప్రేమ” పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలి?
    మన రాజ్య పరిచర్య—2010
  • ‘ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే నేనెలా . . .?’
    మన రాజ్య పరిచర్య—2000
  • ప్రశ్నాభాగం
    మన రాజ్య పరిచర్య—2011
  • శిష్యుల్నిచేసే ఆవశ్యకమైన పనిని గూర్చిన పురోభివృద్ధికరమైన పరిశీలన
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1991
km 1/91 పేజీ 5

ప్రశ్నాభాగము

• ఒకవేళ రెండవ పుస్తకమును పూర్తిచేయక ముందే బాప్తిస్మము పొందినను క్రొత్త శిష్యులు రెండు పుస్తకముల సంపూర్ణమైన పఠనమును పూర్తిచేయుట ఎందుకు ప్రాముఖ్యము?

సంఘములతో గుమికూడుతున్న క్రొత్తవారితో యెహోవా తన సంస్థను ఆశీర్వదించుచున్నాడు. ఈ గొప్ప సమకూర్పు పనిని చూచుటకు మనము ఆనందించుచున్నాము. ఏమైనను యెహోవాను సేవింప నేర్చుకొనుటలో ఈ గొర్రెలాంటివారికి ఎడతెగని నడిపింపు మరియు సహాయపు అవసరతను మనము మెచ్చుకొందుము.

సత్యముయొక్క ఖచ్చితమైన జ్ఞానమునకు వచ్చుటకు క్రొత్తవారికి సహాయము అవసరము. (కొలొ. 1:9, 10) బైబిలుయొక్క ప్రాథమిక సిద్ధాంతముల మంచి గ్రహింపును మరియు బైబిలు నైతిక ప్రమాణములు, క్రైస్తవ జీవితము, మరియు దానికి సంబంధించిన విషయములయొక్క మంచి గ్రహింపు పొందునట్లు సహాయపడు ఆధిక్యతను మనము కలిగియున్నాము. ఇది ముందు ఎటువంటి పరీక్షలు వచ్చినను సత్యమందు స్థిరముగా ఉండుటకు వారికి సహాయము చేయును.

విద్యార్థులు వారి గ్రహింపు శక్తినందు పూర్ణముగా ఎదిగిన వారు కావలసిన అవసరమున్నది. (1 కొరిం. 14:20) అట్లు ఆత్మీయంగా సంపూర్ణముగా ఎదిగిన పురుషులు ఆగుటకు ఒక బోధకుని సహాయముతో వ్యక్తిగత బైబిలు పఠనము అవసరమని అనుభవము చూపుచున్నది. ఆ విధంగా, రెండు పుస్తకముల పఠనమును పూర్తిచేయకముందే ఒక వ్యక్తి బాప్తిస్మము పొందినను, తాను రెండు పుస్తకముల పఠనమును పూర్తి చేయువరకు తన గృహ బైబిలు పఠనము కొనసాగవలెనని వివేకము ఖచ్చితముగా చూపుచున్నది.

బాప్తిస్మము తరువాత

వారికి బాప్తిస్మమిచ్చుచు, బోధించుచు శిష్యులను తయారు చేయవలెనని యేసు చెప్పెను. (మత్త. 28:​19, 20) శిష్యులకు బోధనా కార్యక్రమము ఎక్కువవరకు బాప్తిస్మము పొందిన తరువాత జరుగును. ఒక వ్యక్తి కేవలము ఒక పుస్తకము నుండి పొందు జ్ఞానము సాధారణముగా తన ఆత్మీయ శిక్షణను సంపూర్ణము చేయుటకు సరిపోదు. పరిచర్య పనికొరకు తనను తగినవానిగా చేయుటకు మరియు ఈ అంత్యదినములలో యెహోవాను సేవించు వారిపైకి వచ్చు వత్తిడులను ఎదుర్కొనుటకు అదనపు బోధయు అవసరమైయున్నది. తగినంత శిక్షణను ఇచ్చుటకు తప్పిపోవుటయనునది ఆత్మీయముగా విద్యార్థి తన స్వంతంగా నిలబడుటకు సిద్ధపడనివానిగా చేయకపోయినను, తదుపరి అభివృద్ధిని చేసికొనుటకు తనకు సహాయము చేయుటలో మనము కొనసాగుదుము. పఠనము చేయు మొదటి ప్రచురణ ప్రాథమిక విషయములను గూర్చిన గ్రహింపును ఇచ్చును. రెండవ పుస్తకము క్రైస్తవ లక్షణములను వివరించును. ఈ ప్రచురణలు లివ్‌ఫరెవర్‌ పుస్తకము, తదుపరి యునైటెడ్‌ ఇన్‌ వర్షిప్‌ పుస్తకముగాని, లేక ట్రూపీస్‌ పుస్తకమైయుండును. ఈ పుస్తకముల అందుబాటులో లేనట్లయిన అలాంటి సమాచారమునే కలిగిన ఇతరములను ఉపయోగించవచ్చును. రెండవ పుస్తకము పూర్తయ్యేంతవరకు పఠనము చేయుట అనేది యెహోవా సంకల్పములను, క్రైస్తవ ప్రమాణములు, మరియు అవసరతలను గూర్చిన మంచి విద్యను అనుగ్రహించును. ఇది క్రొత్తవ్యక్తి క్రైస్తవ సూత్రముల అర్థమును గ్రహించుకొని విశ్వాసమందు స్థిరముగా పాతుకు పోవుటకు సహాయపడును. (కొలొ. 2:7) అటువంటి పఠనములను రిపోర్టుచేయుటను గూర్చిన ఇతర వివరములకొరకు 1987 డిశంబరు మన రాజ్య పరిచర్య ప్రశ్నాభాగమును చూడుము.

అవును, బాప్తిస్మము తరువాత క్రొత్తవారు ఆత్మీయ అభివృద్ధిని చూపవలెనని కోరబడుచున్నారు. (హెబ్రీ. 6:1-3) అనేక సందర్భాలలో రెండవ పుస్తకమును ముగించుటకు ఎక్కువ సమయము పట్టదు. ఆవిధముగా క్రొత్తవ్యక్తి స్థిరముగా పునాదిని పొందుచున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి