యెహోవాచే బోధించబడుట
1 ప్రవక్తయైన యెషయా ఇలా ప్రకటించెను: “అలసిన వానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు బోధించబడినవారి నాలుకను యెహోవా నాకు దయచేసి యున్నాడు. (యెష. 50:4, NW) యెహోవా దీనిని దయచేయు ఒక విధమేమనగా దైవపరిపాలనా పాఠశాల ద్వారా ఇచ్చు శిక్షణ మూలంగా, అయినను వ్యక్తిగత కృషి ఇంకను అవసరము. థియోక్రటిక్ మినిస్ట్రి స్కూల్ గైడ్ బుక్ పేజి 39 నందు ఇట్టి పరిశీలనను తెలుపుచున్నది: “ఒక విధమైన నియామకమును నీవు ఎన్నిసార్లు చేసినను, సిద్ధపాటు ఎల్లప్పుడు విలువైనది.” పాఠశాలలో మనము కొద్దినెలలనుండి పాల్గొనుచున్నను, లేక 1943లో అది ప్రారంభమైన నాటి నుండి పాల్గొనుచున్నను ఇది మనందరికి వర్తించును.
2 విద్యార్థులందరు బాగుగా సిద్ధపడవలెను. ఇందు సమయము విషయంలో మనస్సు కలిగియుండుటయు ఇమిడియున్నది. దైవపరిపాలనా పాఠశాల షెడ్యూలులోని ఉపదేశములు ఇట్లున్నవి: “ఏ ప్రసంగము సమయము దాటి వెళ్లకూడదు.” నియామకము నెం. 1ని చేయు సహోదరుడు పదే పదే సమయమును మించి వెళ్లుతున్నట్లయిన, ఆయనకు ఏకాంతముగా ఉపదేశమివ్వవలెను. పాఠశాల కాపరి కూడా పాఠశాలను సరిగ్గా సమయమునకు ప్రారంభించి, తన సలహాకు మరియు పరిశీలనకుకూడా తనకు అనుమతించబడిన సమయమునుగూర్చి యిచ్చిన ఉపదేశములను గమనించవలెను. లభ్యమైనప్పుడు 1990 “ఆల్స్ర్కిప్చర్” పుస్తకపు రివైజ్డ్ ప్రతిని ఉపయోగించవలెనని దయచేసి గమనించుము.
3 బైబిలు ఉన్నతాంశముల భాగమునుండి అందరు ఎక్కువగా ప్రయోజనము పొందవచ్చును. ఇది నియామక సమాచారపు పునఃసమీక్షయై మాత్రమే ఉండకూడదని మనము గుర్తు చేయబడియున్నాము. ప్రసంగీకుడు ఆ సమాచారము ఎందుకు మరియు ఎట్లు మనందరికి విలువైనదో గుణగ్రహించునట్లు ప్రేక్షకులకు సహాయపడవలెను.
4 అనేక విధములైన సఫలతతో ప్రసంగము నెం. 3నకు అనేక కూర్పులు వాడబడినవి. అయితే పాఠశాలయొక్క ముఖ్య ఉద్దేశ్యములలో ఒకదానిని, అనగా సత్యమును ఖచ్చితముగా మరియు స్పష్టముగా అందించుటకు సహాయపడుటయనుదానిని, మనస్సునందుంచుకొని కూర్పులు ప్రాంతీయ సేవ, తటస్థ సాక్ష్యమునకు సంబంధించియుండుట కోరబడుతుంది.
5 ప్రసంగము నెం. 4 కొశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ పుస్తకమునుండి తీసుకొనబడినప్పుడు, క్రొత్త లేక యువకులైన విద్యార్థులకు నియమించబడుతుంది. అవును, నియమించబడు విద్యార్థి చదువగలవాడై యుండవలెను. ఈ ప్రసంగములు వారము మార్చి వారము రీజనింగ్ పుస్తకమునుండి తీసుకొనబడు ప్రసంగముతో మారుచుండును. ప్రసంగము నెం. 3 మరియు 4లకు మాత్రము విద్యార్థి చూపబడిన అంశమును ఉపయోగించవలెను.
6 అదనపు సమాచారమును తీసుకొచ్చునప్పుడు జాగ్రత్త వహించవలెను. కొన్నిసార్లు నియమించబడిన సమాచారము ఒకటి లేక రెండు పేరాగ్రాఫ్లందే ఉండవచ్చును. అయినను నియమించబడిన సమయములోపల లేఖనములను చదువుతూ వివరించుట, ఉపమానములను ఉపయోగించుట మొదలగువాటితో ఎంతో ప్రభావవంతముగా సమాచారమును అందించవచ్చును. సాధారణంగా నియమించబడిన సమాచారమునకు దాటి వెలుపటి సమాచారమును అందించనవసరములేదు. ప్రేక్షకులు ప్రసంగము ఆధారపడిన సాహిత్యమునుండి నిన్ను అనుసరించగలగవలెను.
7 మనము ఆరాధించు దేవుడు తరగిపోని జ్ఞానము మరియు తెలివికి మూలమును దయచేయును. (రోమీ. 11:33) వేల సంవత్సరములు గడిచినను మనమింకను నేర్చుకొనవలసినదెంతో ఉంటుంది. మన పరలోకపు తండ్రిని స్తుతించగలుగు సామర్థ్యము, జీవిత సమస్యలను పరిష్కరించగలుగుట దానితోపాటు మన తృప్తి మరియు సంతోషము దైవిక జ్ఞానమును సంపాదించుకొనుటకు మనము చేయు కృషికి తగినట్లు పెరుగును. కావున దైవపరిపాలనా పాఠశాలకు క్రమముగా హాజరగుట ద్వారా మన గొప్ప బోధకుడు ఏర్పరచిన ఏర్పాటునుండి పూర్తిగా ప్రయోజనము పొందు తీర్మానమును చేసికొనుము. 1991 నందు దైవపరిపాలనా పాఠశాలలో పాల్గొనుటయందు మరియు సిద్ధపడుటయందు నీ యొక్క పట్టుదల దీనిని చేయుటకు నీకు సహాయపడునుగాక.