బైబిలు పఠనము చేయాలని నీవెందుకు కోరుకొనవలెను
1 క్రైస్తవుడు పొందే అత్యంత దీవెనకరమగు అనుభవాలలో ఒకటేమనగా, మరొకనిని యేసునకు శిష్యుడగుటకై సహాయము చేసే పని నిమిత్తము యెహోవా తనను ఉపయోగించుకొనుటయే. (మత్త. 28:19, 20; 1 కొరిం. 3:6, 9) అలాగున మనము సహాయము చేసేవారికి నిత్యజీవము లభించగలదు.
2 బోధకునికి విద్యార్థికి మధ్య సన్నిహిత సంబంధము ఏర్పడుతుంది. విద్యార్థియొక్క ఆత్మీయ ఎదుగుదల నిజంగా ఆనందానికి మూలము. (1 థెస్స. 2:11, 19, 20) అందుచేత ప్రతి క్రైస్తవుడు తన యింటివారికే కాకుండా, బయటి వ్యక్తులలో కనీసము ఒక్కరికైన ఒక బైబిలు పఠనము చేయాలనే గురిని కలిగియుండాలి. అయితే ప్రతి కుటుంబ యజమాని తన కుటుంబమునకు అర్థవంతమైన క్రమమైన బైబిలు పఠనముచేసే బాధ్యతను కలిగియున్నాడు. తండ్రి అవిశ్వాసియైతే క్రైస్తవురాలైన తల్లి తన పిల్లలతో బైబిలు పఠించుటకు తగిన ఏర్పాట్లు చేసుకొనే అవసరత ఉన్నది.
పఠనములకొరకు ప్రార్థించుట
3 మనము ఈ యుగాంతములో ఉన్నాము గనుక అందరూ ఫలవంతమగు బైబిలు పఠనములను చేయుటకు తీవ్రముగా కృషిచేయాలి. దీనికై క్రమంగా యెహోవాకు ప్రార్థిస్తూవుంటే దానినిబట్టి మనలో బైబిలు పఠనములు చేయాలనే యథార్థమైన కోరిక ఉందని అర్థమవుతుంది. అందునుబట్టి జీవన్మరణ తీర్మానము ఇందులో ఇమిడియున్నదని మనము గ్రహించినట్లవుతుంది. (యెహె. 33:7-9, 14-16) మనస్ఫూర్తిగా మనము చేసే ప్రయత్నాలను యెహోవా దీవిస్తాడనే అభయము కలిగియుండగలము.—1 యోహా. 5:14, 15.
4 శిష్యులను చేయుటలో ఫలించాలంటే మనము బాగా సిద్ధపడాలి. బైబిలు పఠనాలు చేసే వ్యక్తుల ప్రావీణ్యతను గమనించుట ఎంతో మేలు. రానైయున్న మాసాలలో, శిష్యులను చేయుటలో విజయవంతులైన ప్రాంతీయ కాపరులు మరియు ఇతరుల అనుభవాలను మీకు మేము అందిస్తాము. బైబిలు పఠనాలను ఎలా ప్రారంభించి వాటిని ఫలభరితమైనవిగా చేయగలమో తెలియజేసి వరుసగా వచ్చు అనేక శీర్షికలు అభ్యాసయోగ్యమైన సలహాలను అందించును.
రాబోవు శీర్షికలు
5 రాబోవు మన రాజ్య పరిచర్య సంచికలలో ఎటువంటి సలహాలు చర్చించబడును? వివిధ ప్రచారకులు పయినీర్లు బైబిలు పఠనాలను ఎలా ప్రారంభించారు? విద్యార్థులు హృదయములో చేరునట్లు ఏయే బోధనా పద్ధతులనుపయోగించారో వాటినిగూర్చి మనము చర్చిస్తాము. యెహోవా సంస్థ యెడల గుణగ్రహింపును కలిగించుట, ఇంటింటి సేవ యెడల కోరికను కలిగించుట మొదలగువాటిని గూర్చిన సలహాలు కూడ చర్చించబడును. మీ కుటుంబ బైబిలు పఠనము కూడ ఫలభరితముగా చేసుకొని మీ పిల్లలు యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకొనుటకు వీలగు సలహాలు కూడ అందులో పొందుపరచబడును.
6 ప్రపంచవ్యాప్తముగా గత నాలుగు సేవ సం.లలో 9,59,834 మంది బాప్తిస్మము పొందారు ఇందులో 836 మంది ఇండియాలోని సంఘములలోనే ఉన్నారు. ఇందులో అనేకులు వారితో ఎవరో ఒకరు బైబిలు పఠనము చేసినందువల్లనే బాప్తిస్మము పొందగలిగారు. జ్ఞాపకార్థ కూటములకు జిల్లాసమావేశాలకు హాజరైన సంఖ్యను బట్టి చూస్తే బాప్తిస్మము పొందుటకై సహాయము అవసరమైన వారు అనేకులున్నారని వ్యక్తమవుతుంది. అట్టివారికి బైబిలు పఠనములను ఆరంభించి నడిపించుటకు ప్రయత్నించుటద్వారా అనేకులు శిష్యులను తయారై చివరకు నిత్యజీవాన్ని అనుభవించుటకు సహాయము చేసిన వారమగుదుము.—1 తిమో. 6:12, 19.