విపత్తును ఎదుర్కొనకుండునట్లు యౌవనులకు సహాయపడుట
1 యెహోవా తన ప్రశస్తవరమైన జీవమును ఆనందించమని మనలను కోరుచున్నాడు. అందుకొరకై మనము మన హృదయవాంఛలను వెంటాడునట్లు మనకు కొంత వ్యక్తిగత స్వాతంత్ర్యమును అనుమతించాడు. అయితే అట్లు చేయుటకు గల స్వాతంత్ర్యముతోపాటు మనము చేయుదానికి యెహోవా సరైన రీతిలో బాధ్యులను చేయుచున్నాడు.—ప్రసం. 11:9.
2 అసంపూర్ణులము పాపులముగానున్న మనము మన జీవితమును నడుపు విధానమునుబట్టి మనలను పడద్రోయు విపత్తు నుండి ఎట్లు ప్రక్కకు తొలగగలము? (ప్రసం. 11:10) అనుభవములేని యౌవనులకైనను విపత్తును తప్పించుకొనుట సాధ్యమేనా? సంతోషదాయకముగా ఔను అను జవాబు మనకు కలదు. నడిపింపునకు మనకుగల అవసరతను యెహోవా బాగుగా ఎరిగియున్నాడు. యౌవనులకు అలాగే, వృద్ధులకు ఈ అంత్యదినములను గుర్తించు క్లిష్టమైన కష్టముల నుండి సురక్షితముగా దాటి వెళ్లునట్లు సహాయపడుటకు ఆయన ప్రేమపూర్వకమైన నడిపింపును మరియు ఉపదేశమును దయచేసియున్నాడు.—కీర్త. 19:7; 119:9; 2 తిమో. 3:1.
తల్లిదండ్రుల బాధ్యత
3 కష్టమొచ్చినప్పుడు, “వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచగల, మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళముచేయగల” బాధ్యతగల తల్లిదండ్రులు యౌవనులకు అవసరము. (హెబ్రీ. 12:12, 13) జీవమునకు నడుపగల మార్గమున నడచుటకు తమ పిల్లలకు సహాయపడుటకై తల్లిదండ్రులు ఒక క్రమమైన వంతుగా తమ పిల్లల ఆలోచనను సరిదిద్దవలసియున్నారు. దీనికి యెహోవా యొక్క నిండైన ఆశీర్వాదముతో పాటు ఓపిక మరియు నైపుణ్యము అవసరము.
4 తమ పిల్లలకు చెడు ప్రభావములు సోకకుండునట్లు తల్లిదండ్రులు సంపూర్ణమైన కవచములాగా ఉండలేరు. అయితే పిల్లవాని మనస్సు ఎట్లు బలపరచబడగలదు? ‘అతనిని యెహోవా యొక్క శిక్షలోను మరియు బోధలోను పెంచుట’ ద్వారా. (ఎఫె. 6:4) ఇతర విషయములలో కుటుంబ పఠనము, ఆత్మీయ మరియు నైతిక నడిపింపు, పాఠశాల తదుపరి చర్యలందు చక్కగా యుండుట, తగిన క్రమశిక్షణ, మరియు తల్లిదండ్రుల మంచి మాదిరి ఇమిడియున్నది.
5 “దైవభక్తి” జిల్లాసమావేశములో విడుదలైన కొశ్చన్స్ యంక్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ అను పుస్తకము యౌవనులకు సహాయపడుటకు రూపొందించబడినది. సరైన ప్రమాణములను గూర్చి పిల్లలతో తర్కించుటకును అది తల్లిదండ్రులకు సహాయపడును. దేవుని చట్టములు ప్రభావకరంగా పిల్లవాని మదిలో మరియు హృదయములో నాటబడినట్లయిన ఈ ఆజ్ఞలు అదుపులోనుంచునవిగా లేక క్రమపరచునవిగా పనిచేయును. ఈ నూతన సాహిత్యములోని సమాచారపు కుటుంబ చర్చ విపత్తునకు దూరముగా తొలగిపోవునట్లు యౌవనులను బలపరచును.
6 యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకము 1989లో విడుదలైనప్పుడు, సమావేశ ప్రసంగీకుడు గుమికూడియున్న యౌవనులవైపు తన అవధానమును మరల్చి పుస్తకము యొక్క విలువను ఉన్నతపరచెను. కుటుంబ చర్చకు ఆధారముగా దానిని వాడమని తల్లిదండ్రులు ప్రోత్సహించబడిరి. ప్రతి అధ్యాయపు ముగింపునందు “చర్చకొరకు ప్రశ్నలు” అను భాగము కలదు. ఈ ప్రశ్నలు పేరాగ్రాఫ్, వెంబడి పేరాగ్రాఫ్గా సమాచారమును విశ్లేషించుటకై రూపించబడినవి కావు. ఒక్కొక్క ప్రశ్న ఒకటి లేక అంతకంటె ఎక్కువ ఉపశీర్షికలను పరిశీలించుచున్నవి. కొందరు కుటుంబ యజమానులు అధ్యాయమంతటిని చదివిన తదుపరి ప్రశ్నలను పరిశీలించ యిష్టపడవచ్చును. ఇతరులు దానికి సంబంధించిన ఉపశీర్షిక సమాచారమును చదివిన తరువాత మధ్యలో ప్రశ్నలను అడుగవచ్చును.
మన ప్రాంతములోని యౌవనులకు సహాయపడుట
7 మన ప్రాంతమందు అనేకమంది యౌవనస్థులను మనము కనుగొనవచ్చును. వారు కలిగియున్న కొన్ని ప్రశ్నలకు ఈ క్రొత్త పుస్తకములో జవాబులివ్వబడియున్నవి. కావున ప్రాంతమందు జనవరి మాసములో యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకమును మనము అందించుదుము. బహుశా ఉపయోగించుటకు ఇష్టపడు అందింపు ప్రసంగమును ఇప్పటికే నీవు తయారు చేసికొనియుండవచ్చును. లేక ఈ క్రిందిదాని విధంగా చెప్పుటకు యిష్టపడవచ్చును:
8 “తరచు యౌవ్వనమును మన జీవితములో సంతోషదాయకమైన సమయముగా తలంతుము. అయితే దుఃఖకరంగా అనేకమంది అసంతోషభరితులైన యౌవనులను నేడు మనము చూచుచున్నాము. అట్లు కాదా? [సమధానమివ్వనిమ్ము.] మారుతున్న ప్రమాణములు యౌవనులపై ప్రభావము చూపి వారి సంతోషమును దోచుకొను అనేక సమస్యలుగల కలుషితమైన లోకమును తయారుచేసినవి. నమ్మదగిన నడిపింపును వారెక్కడ కనుగొనగలరు? [వ్యాఖ్యానించనిమ్ము.] కీర్తన 119:9 నందు బైబిలు సిఫారసు చేయుదానిని గమనించుము. [చదువుము.] సరైన దానిని బోధించుటలోగల తల్లిదండ్రుల బాధ్యతను ఉన్నతపరస్తు బైబిలు సామెతలు 1:8 నందు ఇట్టి ఉపదేశము నిచ్చుచున్నది. [చదువుము.] దీని కనుగుణ్యముగా కొశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—అండ్ ఆన్సర్స్ దట్ వర్క్ అను పుస్తకము బైబిలుపై ఆధారపడిన ఆచరణాత్మకమైన నడిపింపునిచ్చుచున్నది. మరియు భవిష్యత్తును వారు విజయవంతముగా ఎదుర్కొని అట్లుచేయుటలో ఎట్లు సంతోషముగా ఉండగలరో సహాయపడగల అనేక నిజజీవిత అనుభవములను కలిగియున్నది. [ఆసక్తిని రేకెత్తించుటకు అనేక అధ్యాయముల పేర్లను ఎత్తిచూపుము.] సహాయకరమైన మరియు అందముగా వర్ణింపబడిన ఈ పుస్తకము కేవలము 15 రూ.లకు నీవానందించవచ్చును.
9 యౌవనులు జ్ఞానయుక్తమైన మరియు యోగ్యకరమైన గురులవైపు వారి శక్తులను నడిపించవలసిన అవసరతయున్నదని బైబిలు సూచించుచున్నది. నిశ్చయముగా ఈ నూతన పుస్తకము అనేకులను అపరిమితమైన జ్ఞానమునకు మూలమైన బైబిలువైపు నడిపించుచున్నది. ప్రస్తుత నిండైన జీవితమునకు మరియు సురక్షితమైన భవిష్యత్తుకు యౌవనులను నడిపించు ఎంతటి విలువైన సాధనము.—ప్రసం. 12:1.