ప్రశ్నాభాగము
• సేవా కూటముల యందలి ప్రకటనలను ఎవరు చేయవలెను?
సేవాకూటము యందలి ఈ భాగపు ఉద్దేశ్యమేమనగా, అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు అవసరమగు వివరణలను సంఘమునకు తెలియజేయుటయై యున్నది. కొన్ని ప్రకటనలు జ్ఞాపకము చేయునవిగా యుండి వారము వెంబడి వారము ఒకే రీతిగా యుండును. ఏమైనను ప్రకటనలన్నియు స్పష్టముగా వ్యక్తపరచబడవలెను. ఏవియు సాధారణంగా లేక ఎప్పుడూ చెప్పబడేవే గదా అను రీతిలో ఎంచబడకూడదు.
కొన్ని ప్రకటనల స్వాభావికతను బట్టి అవి ఒక పెద్దచే చెప్పబడు అవసరతను కలిగియుండవచ్చును. ఈలాంటి విషయమొచ్చినప్పుడు నిర్ణయించబడిన పట్టికలో యున్న ఇతర ప్రకటనలను వేరే సహోదరుడు చేయుచున్నను ఆ సమాచారమును మాత్రము అందించులాగున బాగా అర్హుడైన ఒక సహోదరుని ఏర్పాటు చేయుట ప్రిసైడింగ్ ఓవర్‌సీర్ యొక్క బాధ్యతై యున్నది.
సంఘమునకు పంపబడినలేఖలో, పెద్దలకు మాత్రమే సూచింపబడిన యితర సమాచారము యిమిడివున్న యెడల సంఘమునకు అన్వయించు సమాచారమును ఒక పెద్ద అందించవలెను. సంఘమునకు ఒక నిర్దిష్టమైన నడిపింపును కలిగియున్న సొసైటి నుండి వచ్చిన లేక ఒక అర్హుడైన పెద్దచే చదువబడుట చాలా మంచిది. అవి ఇతర దేశములలో హింసననుభవిస్తున్న సహోదరుల నిమిత్తమై ప్రత్యేక ఉత్తరములను వ్రాయు ఉద్దేశ్యముతో ఉండినవై యుండవచ్చును. కొన్ని ఉత్తరములు భవిష్యత్ దైవ పరిపాలనా కార్యక్రమమును గూర్చిన వివరణాత్మకమగు సమాచారమును కలిగియుండవచ్చును. అనగా ప్రాంతీయ కాపరి దర్శనములు, అసెంబ్లీలు, పెద్ద పెద్ద సమావేశములు మొదలగు వాటితో కూడినవి.
సంఘ సంక్షేమము నిమిత్తమై తప్పనిసరిగా చేయబడవలసిన ఒక ప్రాముఖ్యమైన ప్రకటన కొన్నిసార్లు వుండవచ్చును, మరియు అది స్పష్టముగా చెప్పబడవలెను. అలాంటి ప్రకటనలు ఒక పెద్దచే చేయబడుట అత్యంత శ్రేష్టము.
పెద్దలచే చేయబడినను లేక పరిచారకులచే (మినిస్టీరియల్ సర్వెంట్స్) చేయబడినను ప్రకటనలు స్పష్టతతోను, క్లుప్తమైన రీతిగాను వుండవలెను. ఈ మార్గ దర్శకములను అనుసరించుట, అందరు ఐక్యతతో ముందుకు వెళ్లునట్లు సంఘమునకు సరియైన రీతిగా ఉపదేశములను తెలియజేయుటకు నిశ్చయతనిచ్చును.—కీర్త. 133:1; 1 కొరిం. 14:8, 9, 40.