సువార్తనందించుట—వ్యాపార ప్రాంతములో ధైర్యముగా సాక్ష్యమిచ్చుట ద్వారా
1 సువార్తనందించుటలో ధైర్యమవసరము. ప్రత్యేకంగా వ్యాపార ప్రాంతములలో సువార్తనందించునప్పుడు ఇది ప్రాంతాలలో పనిచేయుటకు వెనుకాడుదురు. బహుశా ఇది అనుభవము లేనందువలన కావచ్చు, లేక అది “ధైర్యము తెచ్చుకొని”వలసిన ప్రాంతమై యున్నందున కావచ్చు.—1 థెస్స. 2:2.
2 వ్యాపార ప్రాంతాలలో పనిచేయుట ద్వారా అనేకమంది ప్రచారకులు మంచి ఫలితాలను పొందారు. వ్యాపార ప్రాంతాలలో 9 ఉదయములు పనిచేయుట ద్వారా మొత్తము 177 పుస్తకములు అందించబడినవి అని ఒక సర్య్కూట్ ఓవర్సీర్ రిపోర్టు చేయుచున్నాడు. ఇంకా ఎక్కువ పోయివుండేవే కాని, ఉన్నయన్ని అయిపోయినవి. కాబట్టి వ్యాపార ప్రాంతమందు పనిచేయుటలో భాగము వహించ ప్రయత్నించిన నీవునూ విజయము పొందవచ్చును.
అనుకూలమైన దృక్పథమును కలిగియుండుము
3 మనము విజయవంతులమయ్యేది, తరచు మన స్వభావము (దృక్పథముపై) ఆధారపడివుంటుంది. కొంతమంది ప్రచారకులు దుకాణములో పనిచేయు వారికి సాక్ష్యమిచ్చుట చాలా కష్టమైన విషయమని భావించ మొదలుపెట్టారు. ఈ దృష్టిని కలిగిన ఒక ప్రచారకుడు యిలా అన్నాడు: “జవాబు వ్యతిరేకంగా వుంటుందని నేను అనుకున్నాను. ఏమైనను, నాకే ఆశ్చర్యమయ్యేట్లు రాజ్యవర్తమానమునకు వారి స్పందన అందుకు భిన్నంగా వుంది. వారు నిజంగా మర్యాద పూర్వకంగా, స్నేహపూర్వకంగా యుండి చాలా మట్టుకు అనేక సార్లు పత్రికలను అంగీకరించారు.” ఔను, వ్యాపార ప్రాంతములో పనిచేయుట యందు భాగము వహించువారు ఆశీర్వాదములను తెచ్చు ఫలవంతమైన పని అని దానిని గూర్చి మాట్లాడుదురు.
4 పెద్దలు, ప్రత్యేకంగా సర్వీసు ఓవర్సీర్ నాయకత్వమును తీసుకోవాలి. అట్టి ఎక్కువ రద్దీగల వ్యాపార ప్రాంతములకు ప్రత్యేకమైన టెరటరీ మ్యాప్‌లను తయారు చేయుట ప్రయోజనకరం కావచ్చును. ఇతర ప్రాంతాలలోని వ్యాపార ప్రాంతములు ఇతర నివాస ప్రాంతములతో పాటు చేయబడవచ్చును. షాపులు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు లేక అలాంటి వాటిని దాటి పోకుండునట్లు నిశ్చయతను కలిగియుండుము. అట్టి రద్దీగల వ్యాపార ప్రాంతములలో పనిచేయుటకు అర్హులైన ప్రచారకులను ఎన్నుకొనుట సమంజసమైనదిగా పెద్దలు ఎంచవచ్చును.
5 ఈ పనిలో భాగము వహించువారు చక్కగా వస్త్రములు ధరించి, వ్యాపార ప్రజలతో మాట్లాడునప్పుడు క్లుప్తముగా మరియు, అంశమును సూటిగా చెప్ప ప్రయత్నించవలెను. వాటి వ్యవధిలో ఒక్క నిమిషముకన్న మించిపోని ప్రసంగములు ఎంతో తగినటువంటివి. వ్యాపార ప్రాంతములలో మంచి ఫలితాలను పొందుటకు తక్కువ రద్దీగా యుండు సమయమును, దినములను ఎన్నుకొనుట ముఖ్యము. కొందరు శనివారం ఉదయమున తొలిగంట తగినదిగాను, మరికొందరు వారం దినములలో యజమానులు పనిలో నిమఘ్నము కాక దుకాణములు మనుష్యులతో నిండక వుండు తొలి సమయము ప్రయోజనకరమైనది గాను కనుగొన్నారు.
మనమేమి చెప్పవచ్చును
6 వ్యాపార ప్రాంతములో పనిచేయు నప్పుడు, పత్రికలను, ప్రస్తుత సాహిత్యపు అందింపును లేదా కరపత్రములను మనము చూపవచ్చును. మనము సమీపించు విధానము, మనము అందించునది పరిస్థితులను బట్టి మారవచ్చును. పత్రికలను అందించునప్పుడు: “వ్యాపారములో యున్న వారిని యింటి యొద్ద కలియుట తరచుగా చాలా కష్టము కాబట్టి, మిమ్ములను కలవాలని, ఈ రోజు ఈ విధంగా ప్రయత్నిస్తున్నాము. క్రొత్త సంచికయైన ఈ వాచ్‌టవర్‌లో (కావలికోట) వ్యక్తిగతంగా మీపై ప్రభావము చూపు ఈ పేరుగల ఒక శీర్షిక వున్నది. (ఆ శీర్షిక పేరు తెల్పుము) ఈ శీర్షికను మరియు ఇతర శీర్షికలను చదువుట ద్వారా మీరు ఆనందిస్తారని మేము అనుకుంటున్నాము. ఈ వాచ్‌టవర్‌ను అవేక్!తో పాటు కేవలము 4 రూ. చందా క్రింద అందిస్తున్నాము” అని మనము చెప్పవచ్చు.
7 ఈ నెలలో ఫ్ హౌడిడ్ ఇట్ గెట్ హియర్? బై ఎవల్యూషన్ ఆర్ బై క్రియేషన్ అను పుస్తకమును చూపిస్తున్నాము. వ్యాపార ప్రాంతములో ఈ ప్రచురణను అందించునప్పుడు: “ఒక వ్యాపారస్తునిగా విజయం సాధించాలంటే ఎంతో ఆలోచనతో కూడిన ప్రయత్నము అవసరమని మీకు తెలుసు. అయితే గ్రుడ్డిగా సంభవించు ఒక యాధృచ్చికమైన సంఘటన జీవమును మరియు విశ్వమును ఉనికిలోనికి తెచ్చుటలో విజయము సాధించి యుంటుందా? జీవమును దేవుడు సృష్టించాడనుటకు విజ్ఞాన శాస్త్రపరమైన రుజువును ఈ పుస్తకం అందిస్తుంది. ఈ నెలలో లైఫ్ హౌడిడ్ ఇట్ గె హియర్? బై ఎవల్యూషన్ ఆర్ క్రియేషన్ అను పేరుగల ఈ పుస్తకమును మేము అందిస్తున్నాము. ఒక 30 రూ. చందా క్రింద దానిని అందిస్తున్నాము.” (చిన్న సైజు 15 రూ.) ప్రాణాలకు రక్షించు ఈ సువార్తతో ప్రజల యొద్దకు వెళ్తుండగా, పట్టుదలతో కూడిన మన ప్రయత్నములను యెహోవా ఆశీర్వాదిస్తాడని మనము నమ్మగలము. మన సాక్ష్యమిచ్చు పనిలో ఎంతో పరిపూర్ణంగా ఉండవలసిన ప్రాముఖ్యమైన అవసరత ఎంతైనా కలదు. (అపొ. కార్య. 20:24) వ్యాపారస్థులను తరచు యింటి దగ్గర కలవటం కష్టము గనుక, వారు పనిచేయుచోట్ల మాట్లాడదగిన అవకాశములను మనము ఉపయోగించవలెను. వ్యాపార ప్రాంతములో పనిచేయుట ఒక సవాలు పూర్వకమైనదైనను, దేవుని సువార్తను మాట్లాడుటకు మనము ధైర్యము తెచ్చుకొనినట్లయిన అందు విజయము పొందగలము.