శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
అక్టోబరు 9తో ఆరంభమగు వారము
పాట 154 (30)
7 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి తగిన ప్రకటనలు. శనివారపు మాగజైను పనిని ప్రోత్సహించుము. సమయము అనుమతించుకొలది ప్రస్తుతపు పత్రికలనుండి మాట్లాడదగిన అంశములను సూచించుము.
18 నిమి: “మన గొప్ప సృష్టికర్తను గుణగ్రహించునట్లు ఇతరులకు సహాయము చేయుము.” సమాచారము యొక్క ప్రశ్నా సమాధానముల చర్చ. 5వ పేరాగ్రాఫ్‌ను చర్చించిన తరువాత సంభాషణా అంశమును ఉపయోగించు ఒక ప్రదర్శనను ప్రచారకుని చేయనిమ్ము. క్రియేషన్ పుస్తకమును అందించునప్పుడు అందలి 130 మరియు 251 పేజీలలోని చిత్రములను వాటి క్రింద యివ్వబడిన ముఖ్యమైన మాటలను ఉపయోగించుము. క్రియేషన్ పుస్తకమును అందించుట యందు పూర్తి భాగమును వహించునట్లు అందరిని ప్రోత్సహించుము.
20 నిమి: “సువార్తనందించుట—వ్యాపార ప్రాంతములో ధైర్యముగా సాక్ష్యమిచ్చుట ద్వారా.” సర్వీసు ఓవర్సీర్ ద్వారా సమాచారపు యొక్క ప్రశ్నా సమాధానముల చర్చ. ప్రాంతములోని వ్యాపారస్తులను చేరుటలో ఎక్కువ భాగము వహించునట్లు ప్రోత్సహించుము. 6, 7 పేరాగ్రాఫ్‌లను పరిశీలించిన తరువాత పత్రికను మరియు క్రియేషన్ పుస్తకమును వ్యాపార ప్రాంతములో అందించు ప్రదర్శనను ప్రదర్శించుము.
పాట 92 (51) మరియు ముగింపు ప్రార్థన.
అక్టోబరు 16తో ఆరంభమగు వారము
పాట 211 (105)
15 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్సు రిపోర్టు పంపించిన డొనేషన్లు ముట్టినట్లు తెలియజేసిన వాటిని ప్రస్తావించుము. సంఘము యొక్క మరియు ప్రపంచ వ్యాప్తమైన ప్రకటన పని యొక్క ఆర్థిక అవసరతల యెడల మెలకువను కల్గియున్నందుకు సహోదరులను మెచ్చుకొనుము. “మీరు ఎలా నడుపుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి.” అను దానిని చర్చించుము. ప్రాంతీయ సేవా ఏర్పాట్లను ప్రకటించుము.
18 నిమి: “సంభాషణా అంశము.” ప్రశ్నా సమాధానముల చర్చ. సంఘ ప్రాంతములో ఏ అంశములను వారు ఫలవంతముగా ఉపయోగించారో అడుగుతూ ఇద్దరు పయినీరులను ఇంటర్వ్యూ చేయుము. ఆ ఆర్టికల్ నందలి 5వ పేరాగ్రాఫ్‌లో సిఫారసు చేయబడినట్లుగా క్రియేషన్ పుస్తకమును అందించుటను ప్రదర్శించుము.
12 ని: ప్రశ్నా భాగము. ప్రశ్నా సమాధానములతో ప్రిసైడింగ్ ఓవర్సీర్ దానిని చేయును. సొసైటి నుండి వచ్చు సమాచారమును క్లుప్తముగాను మరియు స్పష్టతతోను అందించు కారణములను ఉన్నతపరచుము.
పాట 128 (10) మరియు ముగింపు ప్రార్థన.
అక్టోబరు 23తో ఆరంభమగు వారము
పాట 133 (68)
12 నిమి: స్థానిక ప్రకటనలు. సూచించబడిన సంభాషణా అంశముతోపాటు ప్రాంతీయముగా ఉపయోగించదగు ఉపోద్ఘాతములను రీజనింగు పుస్తకమునుండి చర్చించుము. ఈ శనివారము అందరు మాగజైను సాక్ష్యములో పాల్గొనునట్లు అందరిని ప్రోత్సహించుము. సమయము అనుమతించుకొలది దైవపరిపాలనా వార్తల భాగములను ఉన్నతపరచుము.
18 నిమి: మన సంఘ అభివృద్ధి. గత సేవా సంవత్సరపు దాని కార్యమును గూర్చి సెక్రెటరీ సంఘముతో చర్చించును. కాంగ్రిగేషన్ అనాలిసిస్ రిపోర్టు (S-10) ప్రకారము సంఘము యొక్క గత రెండు సంవత్సరముల సంఖ్యలతో పోల్చుము. ఎక్కడ అభివృద్ధి చెందినది, ఏ విషయములో శ్రద్ధనివ్వవలసినది సూచించుము. ప్రాంతీయ కాపారిచే యివ్వబడిన సూచనలను పునఃసమీక్షించుము.
15 నిమి: ప్రాంతీయ పరిచర్యకు బాగుగా సిద్ధపడుము. ప్రాంతీయ పరిచర్యలో ఫలవంతముగాయున్న ఒక పెద్ద ద్వారా ప్రసంగము. ‘మాట్లాడుటకు తగిన వాక్చక్తి’ అను గ్రహింపబడునట్లు తన నిమిత్తమై ప్రార్థించుమని సహోదరులను పౌలు అడుగుతున్నాడని చూపిస్తూ ఎఫెసీయులు 6:18, 19ని చర్చించుము. మనమును ఆలాగే మన నిమిత్తమును మరియు ఒకరికొరకు ఒకరమును ప్రార్థించు అవసరత యున్నది. వ్యక్తిగతముగాను మరియు కుటుంబ సమేతముగాను సిద్ధపడుటకు తగిన సమయమును నిర్ణయించుకొను అవసరతను చర్చించుము. (1 కొరిం. 14:40) క్రొత్తవారితో కొందరు తర్ఫీదు నిచ్చు కార్యక్రమములను కలిగియుందురు. ఆ విధముగా వారు క్రొత్తవారితో ప్రాంతీయ పరిచర్యలో పనిచేయు కొలది ఎదురైన అనేక పరిస్థితులను గూర్చి చర్చిస్తారు. (స్కూల్గైడ్ బుక్ పేజీ. 39 పేరా. 3; క్వాలిఫైడ్ మినిస్టర్స్ 44, 45 పఠనములు) స్థానిక ప్రాంతమునకు సరిపడు ఉపోద్ఘాతములను మరియు సాధారణంగా సంభాషణను ఆప ప్రయత్నించు వారిని ఎదుర్కొను మార్గములను చర్చించునప్పుడు రీజనింగ్ పుస్తకమును ఉపయోగించుము. పరిచర్య యొక్క ఒక విధమైన భాగములో మీకు కష్టమున్నట్లయిన పయినీర్లతోను మరియు అనుభవముగల ప్రచారకులతోను పనిచేయు ఏర్పాటును చేసుకొని మీకు ఏ రంగములో సహాయము అవసరమో అడిగి తెలిసికొనుము. ప్రాంతములో యెహోవాను సేవించ సిద్ధపడుట సంతోషదాయకము. మనందరము పనితొందరలో వుంటూ కొంత సమయాన్ని కేటాయించటానికి చాలా కష్టమును కలిగియుండవచ్చు. అయితే ఆలోచన పూర్వకంగా కొద్ది నిముషములు గడుపుట ఎంతో అభివృద్ధికి తోడ్పడగలదు. పరిచర్యకొరకై బాగుగా సిద్ధపడునట్లు అందరిని ప్రోత్సహించుము.
పాట 156 (10) మరియు ముగింపు ప్రార్థన.
అక్టోబరు 30తో ఆరంభమగు వారము
పాట 20 (46)
10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు దినవచనమును పరిశీలించుట. ప్రాంతీయ సేవ కొరకైన వారంతపు ఏర్పాట్లు యెడల దృష్టి మలుపుము. క్లుప్తముగా నవంబరు అందింపును, క్రొత్త సంభాషణా అంశమును గూర్చి ప్రస్తావించుము.
20 నిమి: “వృద్ధియైన పత్రికా అందింపుల ద్వారా ఆనందమును పొందుట.” ప్రశ్నా సమాధానములు. గత ఆరు నెలలో ముట్టిన పత్రికలతో సంఘ సగటు మాగజైను అందింపులను పోల్చుము. 6వ పేరాగ్రాఫ్‌ను పరిశీలించునప్పుడు, ఇద్దరు పయినీర్లు ఏప్రిల్ 1984 మన రాజ్య పరిచర్యలోని ఇన్సర్ట్ నందలి ఉన్నతాంశములను చర్చించునట్లు చూడుము. ఇద్దరు పయినీర్లు 30 నుండి 60 సెకెండ్లలోపు పత్రికా అందింపును ఒక్కొక్కరు ఒక్కొక అందింపును తెలియజేయవలెను. సమయము అనుమతించిన మాగజైన్సు బాగుగా అందించు ఒకరు లేక ఇద్దరు పయినీర్లతో ఇంటర్వ్యూ చేయుము. అవసరమును బట్టి స్థానికంగా అన్వయించుము.
15 నిమి: స్థానిక అవసరములు లేక జూలై 1, 1989 “కొస్చెన్స్ ఫ్రం రీడర్సు” నుండి ఉన్నతాంశములను చర్చిస్తూ మాదిరికరమైన యవ్వవ పురుషులను ఎక్కు సేవాధిక్యతల కొరకు చేరుకొనమని ప్రోత్సహించుము. (ప్రాంతీయ భాషలో; ఫిబ్రవరి 87 కావలికోట నుండి “పరిచారకులారా శ్రేష్టమైన స్థానమును కాపాడుకొనుడి”)
పాట 53 (27) మరియు ముగింపు ప్రార్థన.