కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w17 నవంబరు పేజీలు 18-19
  • ఉదారంగా ఇచ్చేవాళ్లు దీవించబడతారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఉదారంగా ఇచ్చేవాళ్లు దీవించబడతారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ఈ పని బహు గొప్పది”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • యెహోవా ఉదారంగా ఇస్తున్నందుకు కృతజ్ఞత చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • వాళ్ల సమృద్ధి ఇతరుల లోటును తీర్చింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఇష్టపూర్వకంగా ఇచ్చేవాళ్లను యెహోవా సమృద్ధిగా దీవిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
w17 నవంబరు పేజీలు 18-19
హన్నా బాలుడైన సమూయేలును గుడారానికి తీసుకొస్తున్న చిత్రం

ఉదారంగా ఇచ్చేవాళ్లు దీవించబడతారు

ఎంతోకాలంగా సత్యారాధనలో బలులకు ప్రాముఖ్యమైన స్థానం ఉంది. ఇశ్రాయేలీయులైతే జంతు బలుల్ని అర్పించేవాళ్లు. క్రైస్తవులు దేవునికి “స్తుతి బలిని” అర్పించే విషయంలో ప్రసిద్ధి చెందారు. అయితే దేవున్ని సంతోషపెట్టే ఇతర రకాల బలులు కూడా ఉన్నాయి. (హెబ్రీ. 13:15, 16) ఈ కింది ఉదాహరణల్ని పరిశీలిస్తే, ఆ బలులు ఆనందంతోపాటు దేవుని దీవెనల్ని కూడా తెస్తాయని మీరు అర్థంచేసుకుంటారు.

ప్రాచీన కాలంలో జీవించిన హన్నా, నమ్మకమైన దేవుని సేవకురాలు. ఆమె మగబిడ్డ కోసం ఎంతో తపించింది కానీ ఆమెకు పిల్లలు కలగలేదు. దాంతో ఆమె యెహోవాకు ప్రార్థించి ఒక మగబిడ్డను ఇవ్వమని అడిగింది. ఒకవేళ దేవుడు తన ప్రార్థనకు జవాబిస్తే, ఆ అబ్బాయి ‘బ్రతికినన్ని రోజులు నిన్ను సేవించేలా అతన్ని నీకు ఇస్తాను’ అని యెహోవాకు మాటిచ్చింది. (1 సమూ. 1:10-11, NW) కొంతకాలానికి హన్నా గర్భవతి అయ్యి కొడుకును కనింది, ఆ అబ్బాయికి సమూయేలు అని పేరు పెట్టింది. అయితే హన్నా మాటిచ్చినట్లుగానే, తల్లిపాలు తాగడం మానేశాక సమూయేలును ప్రత్యక్ష గుడారంలో విడిచిపెట్టింది. స్వయంత్యాగ స్ఫూర్తి చూపించిన హన్నాను యెహోవా దీవించాడు. ఆమెకు మరో ఐదుగురు పిల్లల్ని ఇచ్చాడు. సమూయేలు దేవుని ప్రవక్తగా సేవచేశాడు, బైబిల్లోని కొన్ని పుస్తకాలను రాశాడు.—1 సమూ. 2:21.

హన్నా, సమూయేలులాగే సృష్టికర్తకు సేవచేయడానికి తమ జీవితాల్ని అంకితం చేసే గొప్ప అవకాశం క్రైస్తవులందరికీ ఉంది. యెహోవాను ఆరాధించడానికి మనం చేసే ఎలాంటి త్యాగానికైనా గొప్ప ప్రతిఫలం ఉంటుందని యేసు మాటిచ్చాడు.—మార్కు 10:28-30.

మొదటి శతాబ్దంలో జీవించిన దొర్కా అనే క్రైస్తవురాలు “ఎన్నో మంచి పనులు చేసేది, పేదవాళ్లకు ఎంతో సహాయం చేసేది.” కొన్ని రోజులకు ‘ఆమె జబ్బుపడి చనిపోవడంతో’ సంఘంలోని వాళ్లంతా శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే పేతురు ఆ సమయానికి తమ ప్రాంతంలోనే ఉన్నాడని విన్న శిష్యులు ఆయన్ని తమ దగ్గరకు ఒకసారి రమ్మని వేడుకున్నారు. పేతురు వచ్చి దొర్కాను తిరిగి బ్రతికించినప్పుడు వాళ్లెంత సంతోషించి ఉంటారో ఒకసారి ఊహించుకోండి. అపొస్తలులు చేసిన మొదటి పునరుత్థానం కూడా అదే. (అపొ. 9:36-41) దొర్కా అర్పించిన బలుల్ని లేదా ఆమె చేసిన త్యాగాల్ని దేవుడు మర్చిపోలేదు. (హెబ్రీ. 6:10) ఆమె చూపించిన ఉదారత మనందరికీ ఆదర్శంగా ఉండేలా దానిగురించి బైబిల్లో భద్రపర్చబడింది.

అపొస్తలుడైన పౌలు కూడా సమయాన్ని వెచ్చించడంలో, శ్రద్ధను చూపించడంలో ఉదారతను చూపించి చక్కని ఆదర్శంగా నిలిచాడు. కొరింథులోని సహోదరులకు రాస్తూ పౌలు ఇలా అన్నాడు, “నా వంతుగా నేను నాకున్నవన్నీ సంతోషంగా మీకోసం ఖర్చుపెడతాను, నా సర్వస్వం ధారపోస్తాను.” (2 కొరిం. 12:15) ఇతరుల కోసం తనను తాను బలిగా అర్పించుకున్నప్పుడు లేదా త్యాగాలు చేసినప్పుడు తృప్తిగా ఉంటుందని పౌలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని ఆశీర్వాదం, అనుగ్రహం దొరుకుతాయని కూడా గ్రహించాడు.—అపొ. 20:24, 35.

వీటన్నిటిని బట్టి, రాజ్యానికి సంబంధించిన పనుల కోసం, తోటి విశ్వాసులకు సహాయం చేయడం కోసం మన సమయాన్ని, శక్తిని ధారపోసినప్పుడు యెహోవా సంతోషిస్తాడని తెలుస్తోంది. రాజ్య ప్రకటనా పనికి మద్దతివ్వడానికి ఇంకా ఇతర పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి! ఆ పనిలో కష్టపడి పనిచేయడం ద్వారానే కాకుండా, స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం ద్వారా కూడా మనం దేవున్ని ఘనపర్చవచ్చు. ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిని ముందుకు నడిపించడానికి, అలాగే మిషనరీలకు, ప్రత్యేక పూర్తికాల సేవలో ఉన్నవాళ్లకు మద్దతివ్వడానికి ఆ విరాళాల్ని ఉపయోగిస్తారు. అంతేకాదు మన ప్రచురణల్ని-వీడియోలను సిద్ధంచేయడానికి, అనువదించడానికి; ప్రకృతి విపత్తు సహాయక పనులకు; కొత్త రాజ్యమందిరాల్ని కట్టడానికి కూడా మనం స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాల్నే ఉపయోగిస్తారు. ‘ఉదారంగా ఇచ్చేవాడు దీవించబడతాడనే’ పూర్తి నమ్మకంతో మనం ఉండవచ్చు. అంతేకాదు, మన దగ్గరున్న విలువైన వాటిని యెహోవాకు ఇచ్చినప్పుడు మనం ఆయన్ను ఘనపరుస్తాం.—సామె. 3:9; 22:9, NW.

ప్రపంచవ్యాప్త పని కోసం కొందరు ఈ పద్ధతుల్లో విరాళాలిస్తారు

పౌలు కాలంలోలాగే నేడు కూడా చాలామంది కొంత డబ్బును దాచిపెట్టి, “ప్రపంచవ్యాప్త పని” అని రాసివున్న బాక్సుల్లో వేస్తారు. (1 కొరిం. 16:2) ప్రతీనెల సంఘాలు ఆ విరాళాల్ని తమ దేశంలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి. మీ దేశంలో యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు నేరుగా కూడా మీ విరాళాలు పంపించవచ్చు.a స్థానిక పరిస్థితుల్ని బట్టి ఈ కింది పద్ధతుల్లో మీరు విరాళాల్ని నేరుగా పంపించవచ్చు:

బేషరతుగా ఇచ్చే విరాళాలు

  • ఎలక్ట్రానిక్‌ బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఇచ్చే విరాళాలు.b

  • డబ్బు, ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులు. ఇలాంటి వాటిని పంపిస్తున్నప్పుడు, వాటిని బేషరతుగా బహుమతి రూపంలో పంపిస్తున్నట్లు తెలిపే ఉత్తరాన్ని జతచేయాలి.

దానధర్మ ప్రణాళికc

ప్రపంచవ్యాప్త రాజ్య పనికోసం డబ్బును, ఇతర విలువైన వస్తువులను ఇవ్వడంతో పాటు కింద ఉన్న ఇతర పద్ధతుల్లో కూడా విరాళాలు ఇవ్వవచ్చు. మీరు ఎలాంటి పద్ధతి ఉపయోగించి విరాళమివ్వాలనుకున్నా ముందుగా మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించి, మీ దేశంలో ఎలాంటి పద్ధతుల్లో విరాళమిచ్చే సౌలభ్యం ఉందో తెలుసుకోండి. చట్టాలు, పన్నులకు సంబంధించిన నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి కాబట్టి, ఏ పద్ధతిలో విరాళమిస్తే బాగుంటుందో నిర్ణయించుకునే ముందు అర్హుడైన లాయరును లేదా పన్ను సలహాదారుణ్ణి సంప్రదించండి.

భీమా, రిటైర్‌మెంట్‌ పథకాలు: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్‌/పెన్షన్‌ పథకానికి, వ్యక్తిగత రిటైర్‌మెంట్‌ ఖాతాకు లబ్ధిదారుగా యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థ పేరును సూచించవచ్చు.

బ్యాంకు ఖాతాలు: బ్యాంకు ఖాతాలు మరణం తర్వాత యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు చెందేలా చేయవచ్చు లేదా ఒక ట్రస్టు ఏర్పాటు చేసి లబ్ధిదారుయైన మన సంస్థకు అందేలా చేయవచ్చు.

షేర్లు, బాండ్లు: షేర్లను, బాండ్లను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు బేషరతు విరాళంగా ఇవ్వవచ్చు లేదా మరణానంతరం ఆ సంస్థకు చెందేలా ఏర్పాటు చేయవచ్చు.

స్థిరాస్తులు: అమ్మడానికి వీలయ్యే స్థిరాస్తులను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు బేషరతు విరాళంగా ఇవ్వవచ్చు. అవి నివాస స్థలాలైతే ఆయన/ఆమె జీవించినంత కాలం ఆ స్థలంలోనే నివసించి, వాళ్లు చనిపోయిన తర్వాత అవి సంస్థకు చెందేలా ఏర్పాటు చేయవచ్చు.

వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థ పేరున వీలునామా రాయవచ్చు, లేదా ఒక ట్రస్టు అగ్రిమెంటులో ఆ సంస్థను లబ్ధిదారుగా సూచించవచ్చు. ఈ ఏర్పాటు వల్ల పన్ను చెల్లింపులో కొన్ని రాయితీలు పొందవచ్చు.

“దానధర్మ ప్రణాళిక” అనే మాట సూచిస్తున్నట్లుగా, ఇలా విరాళాలు ఇవ్వాలనుకునే దాతలు ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. దానధర్మ ప్రణాళిక ఏర్పాటు ద్వారా యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి మద్దతివ్వాలని కోరుకునేవాళ్ల సహాయం కోసం చారిటబుల్‌ ప్లానింగ్‌ టు బెనిఫిట్‌ కింగ్‌డమ్‌ సర్వీస్‌ వల్డ్‌వైడ్‌ అనే బ్రోషురు ఇంగ్లీషు, స్పానిష్‌ భాషల్లో రూపొందించబడింది.d బ్రతికుండగా లేదా మరణం తర్వాత వీలునామా ద్వారా విరాళాలు ఇవ్వగల అనేక పద్ధతుల గురించి ఆ బ్రోషురు వివరిస్తుంది. మీ దేశంలోని పన్ను నిబంధనలు, తదితర చట్టాల కారణంగా ఈ బ్రోషురులో ఉన్న సమాచారం మీ పరిస్థితికి పూర్తిగా సరిపోకపోవచ్చు. కాబట్టి, ఈ బ్రోషురును చదివిన తర్వాత మీరు మీ లాయర్లను లేదా పన్ను సలహాదారులను సంప్రదించాలి. చాలామంది దానధర్మ ప్రణాళిక ద్వారా విరాళమిచ్చి ప్రపంచవ్యాప్తంగా మతపరంగా, మానవతా దృష్టితో మనం చేస్తున్న పనికి మద్దతివ్వగలిగారు. అదే సమయంలో అధిక మొత్తంలో పన్ను మినహాయింపు పొందగలిగారు. ఈ బ్రోషురు మీ దేశంలో అందుబాటులో ఉంటే, మీ సంఘ కార్యదర్శిని అడిగి ఒక కాపీ తీసుకోవచ్చు.

మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన నంబరుకు ఫోన్‌ చేయండి లేదా కింది చిరునామాకు ఉత్తరం రాయండి. లేదా మీ దేశంలోని యెహోవాసాక్షుల కార్యాలయాన్ని సంప్రదించండి.

a భారతదేశంలోనైతే వాటిని “Jehovah’s Witnesses of India” పేరున పంపించాలి.

b భారతదేశ ప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్టు ఉన్నవాళ్లు jwindiagift.org వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు.

c తుది నిర్ణయం తీసుకునే ముందు దయచేసి స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

d ‘మీ విలువైన వాటితో యెహోవాను ఘనపర్చండి’ అనే పేరుతో ఓ డాక్యుమెంట్‌ భారతదేశంలో ఇంగ్లీషు, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, మరాఠీ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి