కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 11/15 పేజీలు 14-15
  • యెహోవా ఉదారంగా ఇస్తున్నందుకు కృతజ్ఞత చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ఉదారంగా ఇస్తున్నందుకు కృతజ్ఞత చూపించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉదారంగా ఇవ్వడంలో అత్యుత్తమ మాదిరి
  • “ఈ పని బహు గొప్పది”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • వాళ్ల సమృద్ధి ఇతరుల లోటును తీర్చింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఇష్టపూర్వకంగా ఇచ్చేవాళ్లను యెహోవా సమృద్ధిగా దీవిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఇతరుల అవసరాలను తీర్చడానికి మనం ఎలా సహాయపడవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 11/15 పేజీలు 14-15
తన ఏటియం కార్డును స్వైప్‌ చేస్తున్న ఓ స్త్రీ

యెహోవా ఉదారంగా ఇస్తున్నందుకు కృతజ్ఞత చూపించండి

యెహోవా ఉదారంగా ఇచ్చే దేవుడు. (యాకో. 1:17) నక్షత్రాలతో నిండిన విశాలమైన ఆకాశం మొదలుకొని భూమ్మీద తివాచీలా పరుచుకున్న పచ్చిక వరకు, యెహోవా చేసిన సృష్టంతా ఆయన ఉదారతను చాటిచెప్తుంది.—కీర్త. 65:12, 13; 147:7, 8; 148:3, 4.

సృష్టికర్త మీద ఉన్న కృతజ్ఞతతో కీర్తనకర్త, యెహోవా చేసిన అద్భుతమైన సృష్టిని స్తుతిస్తూ ఓ పాట రాశాడు. ఆయన రాసిన 104వ కీర్తన చదివి, యెహోవా గురించి మీరు కూడా అలాగే భావిస్తున్నారేమో పరిశీలించుకోండి. కీర్తనకర్త ఇలా అన్నాడు, “నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను.” (కీర్త. 104:33) మీ కోరిక కూడా అదేనా?

ఉదారంగా ఇవ్వడంలో అత్యుత్తమ మాదిరి

తనలాగే మనం కూడా ఉదారంగా ఇవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఎందుకు ఉదారంగా ఇవ్వాలో కూడా ఆయన మనకు చెప్తున్నాడు. దైవ ప్రేరేపణతో అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.”—1 తిమో. 6:17-19.

పౌలు కొరింథు సంఘానికి రెండవ పత్రిక రాసినప్పుడు, ఎలాంటి మనస్సుతో ఇవ్వాలో నొక్కిచెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” (2 కొరిం. 9:7) ఉదారంగా ఇవ్వడంవల్ల ఇతరుల అవసరాలు తీరతాయని, ఇచ్చేవాళ్లు కూడా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుతారని పౌలు ఆ తర్వాత వివరించాడు.—2 కొరిం. 9:11-14.

దేవుని ఉదారతకు అత్యంత గొప్ప రుజువు గురించి పౌలు ఇలా అన్నాడు, “చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.” (2 కొరిం. 9:15) యెహోవా దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన ప్రజలకోసం చేస్తున్న మంచివన్నీ ఆ ‘వరములో’ భాగం అయ్యుండవచ్చు. ఆ “వరము” ఎంత గొప్పదంటే దాని విలువను మాటల్లో వర్ణించలేం.

యెహోవా, యేసుక్రీస్తు మనకోసం చేసినవాటన్నిటికి, చేయబోయేవాటన్నిటికి మనం ఎలా కృతజ్ఞత చూపించవచ్చు? ఒక మార్గం ఏంటంటే, సత్యారాధన కోసం మన సమయాన్ని, శక్తిని, డబ్బును ఉదారంగా ఇవ్వడం. మనం ఇచ్చేది కొంచెమైనా లేదా ఎక్కువైనా ఉదారంగా ఇవ్వాలి.—1 దిన. 22:14; 29:3-5; లూకా 21:1-4.

ప్రపంచవ్యాప్త పని కోసం కొందరు ఈ పద్ధతుల్లో విరాళాలిస్తారు

పౌలు కాలంలోలాగే నేడు చాలామంది కొంత డబ్బును దాచిపెట్టి, “ప్రపంచవ్యాప్త పని” అని రాసివున్న బాక్సుల్లో వేస్తారు. (1 కొరిం. 16:2) ప్రతీనెల సంఘాలు ఆ విరాళాల్ని తమ దేశంలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి. మీ దేశంలో యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు నేరుగా కూడా మీ విరాళాలు పంపించవచ్చు.a ఈ కింది పద్ధతుల్లో మీరు విరాళాల్ని నేరుగా పంపించవచ్చు:

బేషరతుగా ఇచ్చే విరాళాలు

  • ఎలక్ట్రానిక్‌ బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఇచ్చే విరాళాలు.b

  • డబ్బు, ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులు. ఇలాంటి వాటిని పంపిస్తున్నప్పుడు, వాటిని బేషరతుగా బహుమతి రూపంలో పంపిస్తున్నట్లు తెలిపే ఉత్తరాన్ని జతచేయాలి.

షరతుపై విరాళాలు ఇచ్చే ఏర్పాటు

  • దాత తనకు కావాల్సినప్పుడు తిరిగి తీసుకునే షరతు మీద డబ్బు రూపంలో ఇచ్చే విరాళాలు.

  • షరతు మీదే విరాళమిస్తున్నట్లు తెలిపే ఉత్తరాన్ని జతచేయాలి.

దానధర్మ ప్రణాళికc

ప్రపంచవ్యాప్త రాజ్య పనికోసం డబ్బును, ఇతర విలువైన వస్తువులను ఇవ్వడంతో పాటు కింద ఉన్న ఇతర పద్ధతుల్లో కూడా విరాళాలు ఇవ్వవచ్చు. మీరు ఎలాంటి పద్ధతి ఉపయోగించి విరాళమివ్వాలనుకున్నా ముందుగా మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించి, మీ దేశంలో ఎలాంటి పద్ధతుల్లో విరాళమిచ్చే సౌలభ్యం ఉందో తెలుసుకోండి. చట్టాలు, పన్నులకు సంబంధించిన నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి కాబట్టి, ఏ పద్ధతిలో విరాళమిస్తే బాగుంటుందో నిర్ణయించుకునే ముందు అర్హుడైన లాయరును లేదా పన్ను సలహాదారుణ్ణి సంప్రదించండి.

భీమా: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్‌/పెన్షన్‌ పథకానికి లబ్ధిదారుగా యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థ పేరును సూచించవచ్చు.

బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలు, డిపాజిట్‌ సర్టిఫికెట్లు లేదా వ్యక్తిగత రిటైర్‌మెంట్‌ ఖాతాలు మరణం తర్వాత యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు చెందేలా చేయవచ్చు లేదా ఒక ట్రస్టు ఏర్పాటు చేసి లబ్ధిదారుయైన మన సంస్థకు అందేలా చేయవచ్చు.

షేర్లు, బాండ్లు: షేర్లను, బాండ్లను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు బేషరతు విరాళంగా ఇవ్వవచ్చు లేదా మరణానంతరం ఆ సంస్థకు చెందేలా ఏర్పాటు చేయవచ్చు.

స్థిరాస్తులు: అమ్మడానికి వీలయ్యే స్థిరాస్తులను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు బేషరతు విరాళంగా ఇవ్వవచ్చు. అవి నివాస స్థలాలైతే ఆయన/ఆమె జీవించినంత కాలం ఆ స్థలంలోనే నివసించి, వాళ్లు చనిపోయిన తర్వాత అవి సంస్థకు చెందేలా ఏర్పాటు చేయవచ్చు.

వార్షికభత్య ఏర్పాటుతో విరాళం: వార్షికభత్య విరాళమనే ఏర్పాటు కింద ఒక వ్యక్తి డబ్బును లేదా సెక్యూరిటీలను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు విరాళంగా ఇవ్వవచ్చు. ఈ పద్ధతిలో ఆ దాత లేదా ఆయన నియమించిన వ్యక్తి జీవించి ఉన్నంత కాలం ప్రతీ సంవత్సరం నిర్దిష్టమైన వార్షికభత్యాన్ని పొందుతాడు. దాత వార్షికభత్య విరాళం ఏర్పాటు చేసిన సంవత్సరంలో ఆయనకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.

వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థ పేరున వీలునామా రాయవచ్చు, లేదా ఒక ట్రస్టు అగ్రిమెంటులో ఆ సంస్థను లబ్ధిదారుగా సూచించవచ్చు. ఈ ఏర్పాటు వల్ల పన్ను చెల్లింపులో కొన్ని రాయితీలు పొందవచ్చు.

“దానధర్మ ప్రణాళిక” అనే మాట సూచిస్తున్నట్లుగా, ఇలా విరాళాలు ఇవ్వాలనుకునే దాతలు ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. దానధర్మ ప్రణాళిక ఏర్పాటు ద్వారా యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి మద్దతివ్వాలని కోరుకునేవాళ్ల సహాయం కోసం చారిటబుల్‌ ప్లానింగ్‌ టు బెనిఫిట్‌ కింగ్‌డమ్‌ సర్వీస్‌ వల్డ్‌వైడ్‌ అనే బ్రోషురు ఇంగ్లీషు, స్పానిష్‌ భాషల్లో రూపొందించబడింది.d బ్రతికుండగా లేదా మరణం తర్వాత వీలునామా ద్వారా విరాళాలు ఇవ్వగల అనేక పద్ధతుల గురించి ఆ బ్రోషురు వివరిస్తుంది. మీ దేశంలోని పన్ను నిబంధనలు, తదితర చట్టాల కారణంగా ఈ బ్రోషురులో ఉన్న సమాచారం మీ పరిస్థితికి పూర్తిగా సరిపోకపోవచ్చు. కాబట్టి, ఈ బ్రోషురును చదివిన తర్వాత మీరు మీ లాయర్లను లేదా పన్ను సలహాదారులను సంప్రదించాలి. చాలామంది దానధర్మ ప్రణాళిక ద్వారా విరాళమిచ్చి ప్రపంచవ్యాప్తంగా మతపరంగా, మానవతా దృష్టితో మనం చేస్తున్న పనికి మద్దతివ్వగలిగారు. అదే సమయంలో అధిక మొత్తంలో పన్ను మినహాయింపు పొందగలిగారు. ఈ బ్రోషురు మీ దేశంలో అందుబాటులో ఉంటే, మీ సంఘ కార్యదర్శిని అడిగి ఒక కాపీ తీసుకోవచ్చు.

మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన నంబరుకు ఫోన్‌ చేయండి లేదా కింది చిరునామాకు ఉత్తరం రాయండి. లేదా మీ దేశంలోని యెహోవాసాక్షుల కార్యాలయాన్ని సంప్రదించండి.

Jehovah’s Witnesses of India

Post Box 6440, Yelahanka

Bengaluru 560064

Karnataka, India

Telephone: 09845476425

09845348815

[అధస్సూచీలు]

a భారతదేశంలోనైతే వాటిని “Jehovah’s Witnesses of India” పేరున పంపించాలి.

b భారతదేశ పాస్‌పోర్టు కలిగివున్నవాళ్లు jwindiagift.org వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు.

c తుది నిర్ణయం తీసుకునే ముందు దయచేసి స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

d ‘మీ రాబడి అంతటితో యెహోవాను ఘనపర్చండి’ అనే పేరుతో ఓ డాక్యుమెంట్‌ భారతదేశంలో ఇంగ్లీషు, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి