కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w16 నవంబరు పేజీలు 19-20
  • “ఈ పని బహు గొప్పది”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఈ పని బహు గొప్పది”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా ఉదారంగా ఇస్తున్నందుకు కృతజ్ఞత చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఇష్టపూర్వకంగా ఇచ్చేవాళ్లను యెహోవా సమృద్ధిగా దీవిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • వాళ్ల సమృద్ధి ఇతరుల లోటును తీర్చింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఇతరుల అవసరాలను తీర్చడానికి మనం ఎలా సహాయపడవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
w16 నవంబరు పేజీలు 19-20
ఆలయ నమూనాను ఒకతనికి చూపిస్తున్న రాజైన దావీదు; నిర్మాణ నమూనాను చూస్తున్న ఒక సహోదరుడు

“ఈ పని బహు గొప్పది”

యెరూషలేములో ఓ ప్రాముఖ్యమైన కూటం జరగబోతోంది. రాజైన దావీదు అధిపతుల్ని, పెద్దల్ని, పరాక్రమశాలుల్ని పిలిపించాడు. అక్కడ చేయబడిన ఒక ప్రత్యేక ప్రకటన విని వాళ్లు ఆశ్చర్యపోయారు. సత్యదేవుని ఆరాధన కోసం ఒక అసాధారణమైన కట్టడాన్ని నిర్మించే పనిని దావీదు కుమారుడైన సొలొమోనుకు యెహోవా అప్పగించాడు. ఆ నిర్మాణం ఎలా ఉండాలో తెలిపే నమూనాను తన పవిత్రశక్తి ద్వారా యెహోవా దావీదు రాజుకు తెలియజేశాడు, దాన్ని అతను సొలొమోనుకు ఇచ్చాడు. దావీదు ఇలా చెప్తున్నాడు, “కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది.”—1 దిన. 28:1, 2, 6, 11, 12; 29:1.

తర్వాత దావీదు, “ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా?” అని అడిగాడు. (1 దిన. 29:5) ఒకవేళ మీరు అక్కడ ఉండివుంటే, ఎలా స్పందించేవాళ్లు? ఆ గొప్ప పనికి మీరు కూడా సహాయం చేసేవాళ్లా? ఇశ్రాయేలీయులు రంగంలోకి దిగారు. ‘పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చారు కాబట్టి వాళ్లు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు సంతోషపడ్డారు.’—1 దిన. 29:9.

కొన్ని శతాబ్దాల తర్వాత, యెరూషలేములోని ఆలయం కన్నా మరింత గొప్పదైన ఒకదాన్ని యెహోవా స్థాపించాడు. అదే గొప్ప ఆధ్యాత్మిక ఆలయం. యేసు బలి ఆధారంగా మనుషులు తనను ఆరాధనలో సమీపించడానికి యెహోవా చేసిన ఏర్పాటే ఆ ఆలయం. (హెబ్రీ. 9:11, 12) నేడు ప్రజలు తనతో సమాధానపడడానికి యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడు? శిష్యుల్ని చేసే పని ద్వారా ఆయన సహాయం చేస్తున్నాడు. (మత్త. 28:19, 20) ఫలితంగా, ప్రతీ సంవత్సరం లక్షలమంది బైబిలు స్టడీ తీసుకుంటున్నారు, వేలమంది శిష్యులు బాప్తిస్మం తీసుకుంటున్నారు, వందలకొలది కొత్త సంఘాలు ఏర్పడుతున్నాయి.

ఇంత అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మరిన్ని బైబిలు ప్రచురణల కాపీలు అవసరమౌతున్నాయి, మరిన్ని రాజ్యమందిరాల్ని నిర్మించి, వాటిని మంచి స్థితిలో ఉంచాలి, సమావేశాల కోసం మరిన్ని స్థలాలు అవసరమౌతున్నాయి. రాజ్యసువార్తను ప్రకటించే మన పని గొప్పదని, ఫలవంతమైనదని మీరు ఒప్పుకోరా?—మత్త. 24:14.

దేవుని మీద, పొరుగువాళ్లమీద ఉన్న ప్రేమనుబట్టి, రాజ్య ప్రకటనా పనికున్న ప్రాముఖ్యతను బట్టి దేవుని ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం ద్వారా ‘యెహోవాకు ప్రతిష్ఠితముగా ఇవ్వడానికి’ ముందుకు వస్తున్నారు. తమ ‘ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచడం,’ మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప పనికోసం ఆ వనరుల్ని నమ్మకంగా, వివేకంగా ఉపయోగించడం చూసి మనం ఎంత ఆనందిస్తామో కదా!—సామె. 3:9.

ప్రపంచవ్యాప్త పని కోసం కొందరు ఈ పద్ధతుల్లో విరాళాలిస్తారు

నేడు చాలామంది కొంత డబ్బును దాచిపెట్టి, “ప్రపంచవ్యాప్త పని” అని రాసివున్న బాక్సుల్లో వేస్తారు. (1 కొరిం. 16:2) ప్రతీనెల సంఘాలు ఆ విరాళాల్ని తమ దేశంలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి. మీ దేశంలో యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు నేరుగా కూడా మీ విరాళాలు పంపించవచ్చు.a ఈ కింది పద్ధతుల్లో మీరు విరాళాల్ని నేరుగా పంపించవచ్చు:

బేషరతుగా ఇచ్చే విరాళాలు

  • ఎలక్ట్రానిక్‌ బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఇచ్చే విరాళాలు.b

  • డబ్బు, ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులు. ఇలాంటి వాటిని పంపిస్తున్నప్పుడు, వాటిని బేషరతుగా బహుమతి రూపంలో పంపిస్తున్నట్లు తెలిపే ఉత్తరాన్ని జతచేయాలి.

దానధర్మ ప్రణాళికc

  • ప్రపంచవ్యాప్త రాజ్య పనికోసం డబ్బును, ఇతర విలువైన వస్తువులను ఇవ్వడంతో పాటు కింద ఉన్న ఇతర పద్ధతుల్లో కూడా విరాళాలు ఇవ్వవచ్చు. మీరు ఎలాంటి పద్ధతి ఉపయోగించి విరాళమివ్వాలనుకున్నా ముందుగా మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించి, మీ దేశంలో ఎలాంటి పద్ధతుల్లో విరాళమిచ్చే సౌలభ్యం ఉందో తెలుసుకోండి. చట్టాలు, పన్నులకు సంబంధించిన నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి కాబట్టి, ఏ పద్ధతిలో విరాళమిస్తే బాగుంటుందో నిర్ణయించుకునే ముందు అర్హుడైన లాయరును లేదా పన్ను సలహాదారుణ్ణి సంప్రదించండి.

భీమా: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్‌/పెన్షన్‌ పథకానికి లబ్ధిదారుగా యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థ పేరును సూచించవచ్చు.

బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలు, డిపాజిట్‌సర్టిఫికేట్లు లేదా వ్యక్తిగత రిటైర్‌మెంట్‌ఖాతాలు మరణం తర్వాత యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు చెందేలా చేయవచ్చు లేదా ఒక ట్రస్టు ఏర్పాటు చేసి లబ్ధిదారుయైన మన సంస్థకు అందేలా చేయవచ్చు.

షేర్లు, బాండ్లు: షేర్లను, బాండ్లను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు బేషరతు విరాళంగా ఇవ్వవచ్చు లేదా మరణానంతరం ఆ సంస్థకు చెందేలా ఏర్పాటు చేయవచ్చు.

స్థిరాస్తులు: అమ్మడానికి వీలయ్యే స్థిరాస్తులను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థకు బేషరతు విరాళంగా ఇవ్వవచ్చు. అవి నివాస స్థలాలైతే ఆయన/ఆమె జీవించినంత కాలం ఆ స్థలంలోనే నివసించి, వాళ్లు చనిపోయిన తర్వాత అవి సంస్థకు చెందేలా ఏర్పాటు చేయవచ్చు.

వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న చట్టబద్ధమైన సంస్థ పేరున వీలునామా రాయవచ్చు, లేదా ఒక ట్రస్టు అగ్రిమెంటులో ఆ సంస్థను లబ్ధిదారుగా సూచించవచ్చు. ఈ ఏర్పాటు వల్ల పన్ను చెల్లింపులో కొన్ని రాయితీలు పొందవచ్చు.

“దానధర్మ ప్రణాళిక” అనే మాట సూచిస్తున్నట్లుగా, ఇలా విరాళాలు ఇవ్వాలనుకునే దాతలు ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. దానధర్మ ప్రణాళిక ఏర్పాటు ద్వారా యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి మద్దతివ్వాలని కోరుకునేవాళ్ల సహాయం కోసం చారిటబుల్‌ ప్లానింగ్‌ టు బెనిఫిట్‌ కింగ్‌డమ్‌ సర్వీస్‌ వల్డ్‌వైడ్‌ అనే బ్రోషురు ఇంగ్లీషు, స్పానిష్‌ భాషల్లో రూపొందించబడింది.d బ్రతికుండగా లేదా మరణం తర్వాత వీలునామా ద్వారా విరాళాలు ఇవ్వగల అనేక పద్ధతుల గురించి ఆ బ్రోషురు వివరిస్తుంది. మీ దేశంలోని పన్ను నిబంధనలు, తదితర చట్టాల కారణంగా ఈ బ్రోషురులో ఉన్న సమాచారం మీ పరిస్థితికి పూర్తిగా సరిపోకపోవచ్చు. కాబట్టి, ఈ బ్రోషురును చదివిన తర్వాత మీరు మీ లాయర్లను లేదా పన్ను సలహాదారులను సంప్రదించాలి. చాలామంది దానధర్మ ప్రణాళిక ద్వారా విరాళమిచ్చి ప్రపంచవ్యాప్తంగా మతపరంగా, మానవతా దృష్టితో మనం చేస్తున్న పనికి మద్దతివ్వగలిగారు. అదే సమయంలో అధిక మొత్తంలో పన్ను మినహాయింపు పొందగలిగారు. ఈ బ్రోషురు మీ దేశంలో అందుబాటులో ఉంటే, మీ సంఘ కార్యదర్శిని అడిగి ఒక కాపీ తీసుకోవచ్చు.

మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన నంబరుకు ఫోన్‌ చేయండి లేదా కింది చిరునామాకు ఉత్తరం రాయండి. లేదా మీ దేశంలోని యెహోవాసాక్షుల కార్యాలయాన్ని సంప్రదించండి.

Jehovah’s Witnesses of India

Post Box 6440, Yelahanka Bengaluru 560064 Karnataka, India Telephone: 080-2309426

[అధస్సూచీలు]

a భారతదేశంలోనైతే వాటిని “Jehovah’s Witnesses of India” పేరున పంపించాలి.

b భారతదేశంలోనైతే వాటిని “Jehovah’s Witnesses of India” పేరున పంపించాలి.

c తుది నిర్ణయం తీసుకునే ముందు దయచేసి స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

d ‘మీ రాబడి అంతటితో యెహోవాను ఘనపర్చండి’ అనే పేరుతో ఓ డాక్యుమెంట్‌ భారతదేశంలో ఇంగ్లీషు, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి